Live Updates: ఈరోజు (సెప్టెంబర్-25) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 25 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 25 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | నవమి: రా.10-31వరకు తదుపరి దశమి | పూర్వాషాఢ నక్షత్రం రా.11-06 వరకు తదుపరి ఉత్తరాషాఢ | వర్జ్యం: ఉ.9-00 నుంచి 10-34 వరకు | అమృత ఘడియలు: సా.6-24 నుంచి 7-58 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-16 నుంచి 9-04 వరకు తిరిగి మ.12-16 నుంచి 1-04 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-53
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 25 Sep 2020 12:41 PM GMT
Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్న వార్త వినడానికే బాధగా ఉంది: బాలకృష్ణ హిందూపురం mla!
అమరావతి..
-ఎస్పీబీ మృతి తెలుగుసినీ పరిశ్రమకు తీరని లోటు
-తన గానామృతంతో ఆబాల గోపాలాన్ని అలరించిన దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అస్తమించారన్న వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది.
-ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని నేను ప్రతిరోజూ ఆ లక్ష్మీ నరసింహ స్వామికి పూజ చేశాను.
-కానీ ఇంతలోనే బాలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను.
-ఎస్పీ బాలసుబ్రమణ్యంతో మా నందమూరి కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది.
-నాన్నగారు నటించిన ఎన్నో చిత్రాల్లో ఆయన సుమధుర గానం అందించారు.
-చిత్రం భళారే విచిత్రం అంటూ గంభీరమైన స్వరంతో బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట తెలుగువారి గుండెల్లో నిలిచిపోయింది.
-ఎస్పీబీ మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు.
-బాల సుబ్రహ్మణ్యం ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
-ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.
- 25 Sep 2020 12:34 PM GMT
Balasubrahmanyam: బాల సుబ్రహ్మణ్యం గారికి హృదయంతో నా కన్నీటి నివాళులు అర్పిస్తున్నాను: ఆళ్ల నాని!
పశ్చిమగోదావరి జిల్లా..ఏలూరు..
రాష్ట్ర డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని...
-సంగీత దర్శుకుడు, నటుడు, ప్రపంచం గర్వించదగ్గ పండితా రాడ్యు లు, గాన గంధర్యులు బాల సుబ్రహ్మణ్యం....
-మావూరు మణి..అని ముద్దుగా పిలవమనే గానగంధర్వుడు...ప్రముఖ సినీ నేపధ్య గాయకుడు,నటుడు,.ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం ఆకస్మిక మృతికి తీవ్ర విచారం.
-బహుముఖ ప్రజ్ఞాశాలి,భారతీయ సంగీత చరిత్రలో ఒక మైలు రాయిలా నిలిచిన మన బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు అనే మాట నమ్మలేకున్నాను
-భారతీయ చలనచిత్ర రంగంలో తనదంటూ ప్రత్యేక శైలి ఏర్పాటు చేసుకొని సుమారు 40 వేల పాటలు పాడిన బాలసుబ్రహ్మణ్యం మన మధ్య లేకున్నా ఆయన పాడిన పాటలలో ఆయన మనతో జీవించి వుంటారు.
-ఆయన ఆత్మకు శాంతి కలగాలని,వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనో నిబ్బరం కలిగించాలని కోరుకుంటున్నాను...
-సినిమాల్లోనే కాక టీవీ రంగంలో ఆయన పాడుతా తీయగా... పాడాలని ఉంది లాంటి కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది నూతన గాయకులను పరిచయం చేసాడు...
-బాల సుబ్రహ్మణ్యంకు భారత దేశ కేంద్ర ప్రభుత్వం నుండి 2001లో పద్మ శ్రీ పురస్కారాన్ని, 2011లో పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు...
-ఏడ్చినా.. నవ్వినా.. నీరసపడినా.. ఉత్సాహం నిండినా.. స్ఫూర్తి పొందినా.. ప్రతి ఒక్క సందర్బా నికి ఆయన పాట ఒకటుందన్నారు.
-గాయకునిగా, వ్యాఖ్యతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, బహుముఖ ప్రజ్ఞ కలిగిన బాల సుబ్రహ్మణ్యం కారణ జన్ములుగా అభివర్నించిన మంత్రి ఆళ్ల నాని.
- 25 Sep 2020 12:10 PM GMT
Balasubrahmanyam: నాన్న గారితో బాల సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేక అనుబంధం ఉంది...పెద్దిరెడ్డి సతీష్..
తూర్పుగోదావరి... కాకినాడ...
-ఆయన మృతి కాకినాడ నగరానికి, కళాకారులకు, సంగీత అభిమానులకు తీవ్ర మనస్థాపానికి గురి చేసింది.
-ఆయన కుటుంబం పెద్దదిక్కును కోల్పోయిన ప్పటికీ.. దేశమంతా ఆయన కుటుంబం తోనే ఉంటుంది..
-ఆర్కెస్ట్రా పితామహుడు గంగాధర మాస్టర్ తనయుడు ..... పెద్దిరెడ్డి సతీష్.
- 25 Sep 2020 11:38 AM GMT
Balasubrahmanyam: బాలసుబ్రమణ్యం ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను: కళా వెంకట్రావ్!
అమరావతి..
కళా వెంకట్రావ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు
-ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి తీవ్ర విచారకరం
-ఎస్పీబీ మరణవార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది
-బాలు మృతి భారతీయ సినీ లోకానికి తీరని లోటు
- 25 Sep 2020 11:29 AM GMT
Balasubrahmanyam: ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారు లేరన్న నిజం నమ్మడం కష్టంగా ఉంది: రోజా!
సినీనటి, రోజా..
-గాన గంధర్వుడు, తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ, మా శ్రేయోభిలాషి ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి మృతి నన్ను కలిచివేసింది.
-మా నాన్నగారి స్నేహితుడిగా చిన్నప్పటినుండి మా కుటుంబానికి ఆయన ఆత్మీయులే.
-వారు లేరన్న నిజం నమ్మడం కష్టంగా ఉంది.
-వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను
- 25 Sep 2020 10:45 AM GMT
Balasubrahmanyam: పాటకోసమే పుట్టిన మహానుభావులు ఎస్.పీ బాలు: దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి!
విజయవాడ..
-పాటకోసమే పుట్టిన మహానుభావులు ఎస్.పీ బాలు లేని లోటు మరే గాయకులు పూడ్చలేనిది వారి మరణం బాధాకరం- దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు.
-మాట్లాడినా..పాట పాడిన తెలుగు భాష, తెలుగుజాతి సగర్వంగా చెప్పుకునే బాలసుబ్రమణ్యం భౌతికంగా దూరమైనా 'పాట'లో మనతో మనలోనే శాశ్వతంగా ఉంటారు. ఈ సందర్భంగా నగరంతో వారికి ఉన్న అనుబంధం గుర్తు చేసుకున్నారు.
-గానగంధర్వుడు బాలు మృతి పట్ల సంతాపం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు...
- 25 Sep 2020 10:21 AM GMT
Balasubrahmanyam: ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తాను. ఓం శాంతి!
జీవీఎల్ నరసింహారావు , బిజెపి రాజ్యసభ సభ్యులు..
-పుట్టిన దగ్గరనుంచి ప్రతి రోజూ విన్న ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం గారి అమృత కంఠం మూగబోయింది.
-ఆయన పాటను పాడని, కనీసం హమ్ చేయని తెలుగు వాడు ఉండడు.
-నింగికి ఎగిన బాలు గారు భగవంతుడిని, దేవతలను తన గాన మాధుర్యంతో ఇక అలరించనున్నారు.
- 25 Sep 2020 10:14 AM GMT
Balasubrahmanyam: కోట్లాది భారతీయుల అభిమాన గాయకుడు పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మరణం విచారకరం..
అమరావతి..
సుజనాచౌదరి రాజ్యసభ సభ్యులు..
-గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా సినీరంగానికి ఎనలేని సేవలందించిన బాలసుబ్రహ్మణ్యం గారు లేని లోటు తీర్చలేనిది.
-వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి.
- 25 Sep 2020 10:05 AM GMT
Balasubrahmanyam: సంగీతమే ఊపిరిగా బాలు జీవించారు: స్వరూపానందేంద్ర!
విశాఖ..
-ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సంతాప సందేశం
-ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శివైక్యం పొందడం బాధాకరం
-బాలు మరణం సంగీత ప్రపంచానికే తీరని లోటు
-విశాఖ శ్రీ శారదాపీఠంతో ఆయనకు మంచి అనుబంధం ఉంది
-శ్రీశైలం వెళితే శారదాపీఠం ఆశ్రమంలోనే ఉండేవారుగొప్ప ఆధ్యాత్మిక భావాలున్న సంగీత శిఖరం బాలసుబ్రహ్మణ్యం
-బాలు ఆత్మ భగవంతుని పాద చరణముల వద్దకు చేరాలని కోరుకుంటున్నా - స్వరూపానందేంద్ర
- 25 Sep 2020 10:02 AM GMT
Balasubrahmanyam: Sp బాల సుబ్రహ్మణ్యం మృతి కి సంతాపం: కొడాలి నాని!
కృష్ణా జిల్లా..
-గాన గంధర్వుడు Sp బాల సుబ్రహ్మణ్యం మృతి కి సంతాపం తెలిపిన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
-సిని పరిశ్రమలో 40 ఏళ్ళ సినీప్రస్తానంలో 40 వేల పాటలు 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచములోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించారు
-గానగంధర్వుడు S.P బాల సుబ్రమణ్యం గారికి ఘన నివాళులు ,వారి పవిత్ర ఆత్మ కు శాంతి కలగాలని ,వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనో దైర్యం ప్రసాదించాలి
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire