Live Updates: ఈరోజు (సెప్టెంబర్-25) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 25 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | నవమి: రా.10-31వరకు తదుపరి దశమి | పూర్వాషాఢ నక్షత్రం రా.11-06 వరకు తదుపరి ఉత్తరాషాఢ | వర్జ్యం: ఉ.9-00 నుంచి 10-34 వరకు | అమృత ఘడియలు: సా.6-24 నుంచి 7-58 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-16 నుంచి 9-04 వరకు తిరిగి మ.12-16 నుంచి 1-04 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-53
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 25 Sep 2020 8:28 AM GMT
S.P.B.: గాన గంధర్వుడు ఎస్పీ బాలు చనిపోవడం బాధాకరం: రఘురామకృష్ణ రాజు!
రఘురామకృష్ణ రాజు..వైసిపి ఎంపీ..
-గొప్ప గాయకుడుని భారత దేశం కోల్పోవడం దురదృష్టకరం
-ఎస్పీ బాలుతో మంచి పరిచయం ఉంది..
-బాలు లేని లోటు తీర్చలేనిది
-వివిధ భాషల నుంచి రత్నల్లాంటి గాయకులను అందించారు
-ఎస్పీ బాలు ఆత్మకు శాంతి కలాగాలని కోరుకుంటున్నా
-బాలు కుటుంబానికి మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా
- 25 Sep 2020 8:08 AM GMT
East Godavari-Rajahmundry: అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కొత్త దివ్వ రధం తయారీకి ఈనెల 27న ముహూర్తం నిర్ణయం..
తూర్పుగోదావరి -రాజమండ్రి -రాజోలు..
-ఉదయం 11.15 గంటలకు రధం తయారు చేయడానికి పనులు ప్రారంభిస్తారు
-ఆరోజు ఉదయం 9గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహ సుదర్శన శాంతి హోమం చేసి రధం తయారీ పనులు,
-ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగడం కోసమే సుదర్శన శాంతి హోమం చేయడానికి దేవాదాయశాఖ అధికారులు నిర్ణయించారు
- 25 Sep 2020 8:02 AM GMT
Amaravati updates: గుంటూరు దళిత శ్మశాన వాటిక విధ్వంసంపై టీడీపీ నిజ నిర్థారణ కమిటీ..
అమరావతి..
-కె. కళా వెంకటరావు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు..
-గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో దళిత శ్మశాన వాటికలో జరిగిన విధ్వంసంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటి ఏర్పాటు చేయడం జరిగింది.
-ఈ కమిటీలో తెలుగుదేశం పార్టీ నాయకులు పిల్లి మాణిక్యాల రావు, మానుకొండ శివ ప్రసాద్, దేవతోటి నాగరాజు లు ఉన్నారు.
-గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని దళిత స్మశాన వాటికలో 171 సమాదులను శ్మశాన వాటిక ఆధునీకరణ పేరుతో తొలగించడం దుర్మార్గం.
-దళితుల అంగీకారం అనుమతి లేకుండా శ్మశాన వాటికలో ఏ విధంగా పనులు మొదలు పెడతారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
-దళితుల మనోభావాలను అగౌరవ పరిచేలా, అవమాన పరిచేలా ప్రభుత్వం వ్యవహరిస్తుంది.
-జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 16 నెలల్లో రోజుకో చోట దళితులపై దాడులు జరుగుతున్నాయి.
-విధ్వంసకర పాలనకు కేరాఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ను మార్చి దళితులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు.
-దళిత వ్యతిరేక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు.
- 25 Sep 2020 7:09 AM GMT
Visakha updates: మావోయిస్టు వారోత్సవాలు సందర్భంగా పోలీసులు వాహనాల తనిఖీలు..
విశాఖ..
-చింతపల్లి ,గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాల్లో మావోయిస్టు వారోత్సవాలు సందర్భంగా పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు..
-ప్రతి వ్యక్తిని క్షుణ్నంగా పరిశీలించి విడిచి పెడుతున్న పోలీసులు..
-మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పోలీసు బలగాలు తో అడుగడుగునా గాలింపు చర్యలు..
-దీంతో గిరిజన ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయాందోళన..
- 25 Sep 2020 7:05 AM GMT
Kadapa District updates: హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు...
కడప :
-పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి కామెంట్స్
-జీవో 776 సస్పెండ్ చేస్తూ హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు...
-హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది కి ఏపీ హోం శాఖ మంత్రికి, డీజీపీకి ఇకపై ఇలా వ్యవహరించవద్దని సలహా ఇవ్వమని తెలిపింది...
-గతంలో ఉమ్మడి రాష్ట్ర సిఎంలు నైతిక విలువలు పాటించి నీలం సంజీవరెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పదవికి రాజీనామా చేశారు..
-ప్రస్తుతం హైకోర్టు చేసిన వ్యాఖ్యలు గత సిఎంలపై చేసిన వ్యాఖ్యల కంటే 100 రెట్లు తీవ్ర మైనవి...
-ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా సిఎం వెంటనే రాజీనామా చేయాలి
- 25 Sep 2020 7:01 AM GMT
Tirumala updates: కోవిడ్ వ్యాప్తి నియంత్రణను పాటిస్తూ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నాం..
తిరుమల :
వైవీ సుబ్బారెడ్డి, టిటిడి ఛైర్మన్..
-కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కోవిడ్ వ్యాప్తి నియంత్రణను పాటిస్తూ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నాం..
-గత పాలకమండలి సమావేశంలో నిర్ణయించిన విధంగా హిందు ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశంలో ఆలయాల్లో గుడికి ఒక గోమాత కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం..
-బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం వచ్చే అక్టోబర్ లో దక్షిణ భారత దేశంలోని 4 రాష్ట్రాల్లోని 27 ఆలయాల్లో గుడికి ఒక గోమాత కార్యక్రమం నిర్వహిస్తాం..
-గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని స్వామివారి ప్రార్థిస్తున్నా..
-స్వామి వారిపైన ఎన్నో గీతాలను బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు..
- 25 Sep 2020 6:57 AM GMT
Vijayawada updates: రైతాంగ వ్యతిరేక బిజెపి కార్పొరేట్లకు రైతాంగాన్ని ధారాదత్తం చేస్తోంది...
విజయవాడ..
-మధు....సీపీఎం రాష్ట్ర కార్యదర్శి..
-రైతాంగం బీజేపీపై పోరులో పెద్ద ఎత్హున పాల్గొనాలి
-రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి..
-నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది
-శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతాంగాన్ని పోలీసులు అరెస్ట్ లతో అడ్డుకోవడం సరికాదు
-వడ్డే శోభనాధీశ్వర రావు, అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ అధ్యక్షుడు
-కేంద్రం తీసుకొచ్చిన మూడు బిల్లులను ఉపసంహరించుకోవాలి
-తన తండ్రి తీసుకొచ్చిన ఉచిత విద్యుత్ పథకానికి జిఓ నెంబర్ 22 తూట్లు పోడుస్తోంది
-సీఎం జగన్ తీసుకొచ్చిన జిఓ నెంబర్ 22ను వెనక్కు తీసుకోవాలి
- 25 Sep 2020 6:52 AM GMT
Vijayawada updates: వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతు సంఘాల నిరసన..
విజయవాడ...
-మద్దతు ప్రకటించిన లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలు
-సిపిఎం ఆఫీస్ నుంచి కలెక్టర్ క్యాంపు కార్యాలయంకు ర్యాలీగా బయలుదేరిన నేతలు
-నారాయణ, రామకృష్ణ, సీపీఎం నేతలు మధు, రైతు నాయకుడు వడ్డే శోభనాధీశ్వర రావుల అరెస్డ్
-రోడ్డుపై బైఠాయించిన మహిళ కార్యకర్తలు...తీవ్ర పెనుగులాట
-నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి..
-రైతులను బానిసలుగా మార్చే బిల్లులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుంది
-పోలీసులు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు
-సీఎం జగన్, చంద్రబాబు లు మోడీకి బానిసలైపోయారు
-రైతాంగ సమస్యల వైపు ఉంటారో లేదో జగన్, చంద్రబాబులు తేల్చుకోవాలి
- 25 Sep 2020 6:24 AM GMT
Krishna updates: శ్రీకాకుళం వద్ద కృష్ణానదిలో పురుషుని మృతదేహం..
కృష్ణాజిల్లా..
-లభించిన ఎన్ఎంయూ ఉపాధ్యక్షుడు దుర్గా ప్రసాద్ మృతదేహం
ఘంటసాల మండలం శ్రీకాకుళం వద్ద కృష్ణానదిలో పురుషుని మృతదేహం..
-విజయవాడలో ప్రకాశం బ్యారేజీ వద్ద పూజలు చేస్తూ కృష్ణానదిలో దూకిన దుర్గాప్రసాద్ గా గుర్తింపు
-దుర్గాప్రసాద్ బంధువులకు సమాచారం అందించిన పోలీసులు
- 25 Sep 2020 6:21 AM GMT
Srikakulam updates: వజ్రపుకొత్తూరు - అనకాపల్లి గ్రామ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి అప్పలరాజు..
శ్రీకాకుళం జిల్లా..
-వజ్రపుకొత్తూరు మండలంలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీదిరి అప్పలరాజు..
-వైఎస్సార్ ఆసరాతో లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న దుకాణం ప్రారంభించిన మంత్రి అప్పలరాజు..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire