Live Updates: ఈరోజు (23 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 23 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | సప్తమి మ.12-01 వరకు తదుపరి అష్టమి | పూర్వాషాఢ నక్షత్రం ఉ.06-46 వరకు తదుపరి ఉత్తరాషాఢ | వర్జ్యం: మ.02-43 నుంచి 04-18 వరకు | అమృత ఘడియలు రా.12-15 నుంచి 03-22 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-15 నుంచి 09-02 వరకు తిరిగి మ.12-09 నుంచి 12-56 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 23 Oct 2020 10:23 AM GMT
Warangal updates: మున్సిపల్ కార్పోరేషన్ ( GWMC ) కౌన్సిల్ సమావేశం..
వరంగల్ అర్బన్.
*హన్మకొండ అంబేద్కర్ భవన్ లో వరంగల్ మేయర్ గుండా ప్రకాష్ ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ( GWMC )కౌన్సిల్ సమావేశం..
*హాజరైన పంచాయతీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, కమిషనర్ పమేలా సత్పాతి. కార్పొరేటర్లు, అధికారులు హాజరయ్యారు..
*ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్
*వరంగల్ నగరానికి ఉన్న పెద్ద సమస్య డ్రైనేజి వ్యవస్థ లో లోపాలు ఉన్నాయి..
*పెద్ద సమస్య డ్రైనేజి వ్యవస్థ లో లోపాలు ఉన్నాయి..
*నాళాలపై ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాలి..
*మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు సక్రమంగా పనిచేయాలి..
*ప్రత్యేక నిధులతో వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తాం..
- 23 Oct 2020 9:32 AM GMT
L.Ramana: రైతులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం...
టీడీపీ అధ్యక్షులు ఎల్.రమణ..
*జగిత్యాల, కామారెడ్డిలో మొక్కజొన్న కొనుగోలు చేయాలని సన్నరకం ధాన్యానికి రూ.2,500 మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న రైతులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం...
*అరెస్టు చేసిన రైతులను బేషరతుగా వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి....
*మొక్కజొన్న పంటను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలి..
*ప్రభుత్వమే రైతుల చేత సన్నరకాలు సాగు చేయాలని ప్రోత్సహించి ఇప్పుడు కనీస మద్దతు ధర కల్పించకపోవడం హేయమైన చర్య....
*ప్రభుత్వం వెంటనే సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 2,500 మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం....
*ప్రభుత్వం స్పందించన పక్షంలో రైతాంగం తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.....
- 23 Oct 2020 9:29 AM GMT
Telangana updates: సునీల్ శర్మ తో భేటి అయిన తెలంగాణ ఆర్టీసీ అధికారులు..
-రవాణాశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరి సునీల్ శర్మ తో భేటి అయిన తెలంగాణ ఆర్టీసీ అధికారులు
-రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ భవనం లో మొదలయిన టేలికాన్ఫరెన్సీ సమావేశం...
-సమావేశం లో పాల్గొన్న తెలంగాణ రవాణాశాఖ ఆపేరేషన్స్ ఈ.డి లు ..
-ఈరోజు అంతరాష్ట్ర బస్సు సర్వుసుల ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ..
-ఇప్పటికే ఒప్పందం గురించి హైదరాబాద్ చేరుకున్న ఏపీ మంత్రి పేర్ని నాని...
- 23 Oct 2020 6:57 AM GMT
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్ లోని వరదల్లో వందల బస్తీలకి నీళ్లు వచ్చాయి...
యూనివర్సిటీ రోడ్డుకు వెళ్లే నీటి కాలువలు వెడల్పు చేయడంతో పాటు పూడికతీత తీయాలి...
నాగమయ్యా కుంట కు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది...
హైదరాబాద్ లో సుమారు 2లక్షల దరఖాస్తులు లోన్ల కోసం చేసుకున్నారు...
త్వరలోనే బ్యాంకుల సమావేశం ఏర్పాటు చేస్తాను...
రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలి..
నిత్యవసర వస్తువులు , బట్టలతో అన్ని కొట్టుకుపోయాయి ప్రభుత్వం వారిని అదుకునేలా చూడాలి...
యుద్ధ ప్రాతిపదికన ఓపెన్ నాలల మరమ్మతులు చేయాలి...
అండర్ గ్రౌండ్ లో పేరుకున్న పూడికను కొత్త టెక్నాలజీ ద్వారా తొలగించాలి...
కేంద్ర బృందం నిన్నటి నుండి రాష్ట్రంలో పర్యటిస్తుంది...
రాష్ట్ర ప్రభుత్వం తో చర్చించిన తరువాత నివేదిక ఇస్తారు...
అప్పటి వరకు డిజాస్టర్ ఫండ్ నుండి ఖర్చు చేసుకోవాలి...
కేంద్ర బృందం తో ఉదయం దిల్ ఖుషా గెస్ట్ హౌస్ లో సమవేశమయ్య..
రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తిగా సమాచారం అందించలేదన్నారు...
రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సహాయం రాజకీయాలకు అతీతంగా నిజమైన బాధితులకు అందివ్వాలి...
ఇంట్లో ఉన్న యజమానులే కాక రెంటర్స్ కి కూడా పరిహారం అందేలా చూడాలి...
- 23 Oct 2020 6:57 AM GMT
జగిత్యాల : జగిత్యాల లో ఉద్రిక్త పరిస్థితి ..
చలో జగిత్యాల పేరుతో కలెక్టరేట్ ముట్టడికి బయల్దేరిన మొక్కజొన్న రైతులు
రైతులను అడ్డుకున్న పోలీస్ లు ...
రైతులకి పోలీస్ లకి మధ్య వాగ్వాదం
కలెక్టరేట్ ముందు భారీ ఎత్తున మోహరించిన పోలీస్ లు
- 23 Oct 2020 6:56 AM GMT
కరీంనగర్:
టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎం.పీ పొన్నం ప్రభాకర్ కామెంట్స్..
మొక్కజొన్న రైతులు జగిత్యాలలో చేపట్టిన మహా ర్యాలీ ముందస్తు అరెస్టులను ఖండిస్తున్నాం...
రైతుల అక్రమ అరెస్టులు పిరికిపంద చర్యలు..
మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలి..
పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేసి న్యాయం.చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే కేంద్రం నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి..
రైతుల డిమాండ్ల సాధనకోసం మహా ర్యాలీ చేస్తే అడ్డుకుంటారా..
- 23 Oct 2020 6:56 AM GMT
సిద్దిపేట:- : దుబ్బాక మండలం బల్వంతపూర్ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం పాల్గొన్న మంత్రి హరీష్ రావు,టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట సుజాత.
హరీష్ రావు కామెంట్స్
*బిజెపి పాలిత రాష్ట్రాల్లో బిజెపి చేయలేని పనులను రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది.
*రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలలో కేంద్రం చేస్తున్న ఆర్ధిక సహాయం ఏమీలేదు.
* దుబ్బాక బిజెపి నాయకులు బిజెపి ని భారతీయ జూటా పార్టీ చేశారు.
*ఎన్నికల సభయంలో నైనా ఎన్నికల తర్వాతైనా మీ ముందు కన్పించేది మేము తప్ప కాంగ్రెస్, బిజెపి వాళ్ళు కాదు.
*కాళేళ్వరం నీళ్ళు దుబ్బాక నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయనున్నాయి.
*బిజెపి,కాంగ్రెస్ పార్టీల కల్లబొల్లి కబుర్లు నమ్మి మోసపోవద్దు.
*రామలింగారెడ్డి ఆకస్మిక మరణం తీరని లోటు,ఆయన మరణం నాకు దుఃఖాన్ని కలిగిస్తుంది.
సుజాత కామెంట్స్
*రామలింగారెడ్డి ఆశయాలను కొనసాగిస్తాను,నాకు ఓటేసి మీకు సేవ చేసే భాగ్యం ఇవ్వండి
- 23 Oct 2020 6:55 AM GMT
జగిత్యాల :
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. కామెంట్స్
మోదీ కేసీఆర్ లవి తప్పుడు ఆలోచనలు..
వ్యాపారులకు లాభం చేకూర్చడమే కేసీఆర్ లక్ష్యం..
రైస్ మిల్లర్ల తో కేసీఆర్ కుమ్మక్కు అయ్యారు.
రైతులను కేసీఆర్ నట్టేటా ముంచారు..
కడుపు కాలి రైతులు రోడ్డెక్కుతున్నారు...
తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా?
కేసీఆర్ కంటే రాజుల కాలం నయం..
- 23 Oct 2020 6:55 AM GMT
జగిత్యాల : జగిత్యాల లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గృహ నిర్బంధం ....
చలో జగిత్యాల కి మొక్క జొన్న రైతుల పిలుపు
రైతు సంఘాల నేతలను ఎక్కడిక్కడ అరెస్ట్ చేసిన పోలిస్
- 23 Oct 2020 6:54 AM GMT
డాలర్ బాయ్ అరెస్ట్..
139 మంది తనపై అత్యాచారం చేశారని ఆగస్టు 20 న పంజాగుట్ట పీఎస్ లో పిర్యాదు చేసిన మహిళ
ప్రత్యేక దర్యాప్తు కోసం ఈ కేసును సీసీఎస్ కు బదిలీ చేసిన పోలీసులు
ఈ కేసు ఆరోపణలు ఎదుర్కున్న కొంత మందిని ఇప్పటికే విచారించిన పోలీసులు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు డాలర్ బాయ్ ని అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు.
ఈ రోజు రిమాండ్ కి తరలించే అవకాశం.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire