Live Updates: ఈరోజు (23 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 23 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | సప్తమి మ.12-01 వరకు తదుపరి అష్టమి | పూర్వాషాఢ నక్షత్రం ఉ.06-46 వరకు తదుపరి ఉత్తరాషాఢ | వర్జ్యం: మ.02-43 నుంచి 04-18 వరకు | అమృత ఘడియలు రా.12-15 నుంచి 03-22 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-15 నుంచి 09-02 వరకు తిరిగి మ.12-09 నుంచి 12-56 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 23 Oct 2020 3:38 PM GMT
Hyderabad updates: పంజాగుట్ట పీఎస్ లో పిర్యాదు చేసిన కేసు సైబర్ క్రైమ్ కు ట్రాన్స్ఫర్ అయ్యింది...
-హైదరాబాద్ జాయింట్ కమిషనర్ అవినాష్ మహంతి..
-139 మంది తనపై అత్యాచారం చేశారని ఆగస్టు 20 న పంజాగుట్ట పీఎస్ లో పిర్యాదు చేసిన.. కేసు సైబర్ క్రైమ్ కు ట్రాన్స్ఫర్ అయ్యింది.
-ప్రత్యేక దర్యాప్తు కోసం ఈ కేసు సీసీఎస్ కు బదిలీ అయింది.
-ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కున్న కొంత మందిని ఇప్పటికే విచారించాము.
-ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ శేకర్ అలియాస్ డాలర్ బాయ్ ని అరెస్ట్ చేసాము.
-ఈ కేసు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నాము.
-ఈ కేసులో ప్రమేయం ఉన్న వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.
-ఈ కేసును మహిళా ఏసీపి స్థాయి అధికారులతో విచారణ జరుపుతున్నాము.. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
-బాధిత మహిళ నుండి ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేశాము.
-ఈ కేసును టెక్నికల్ అనాలసిస్ ద్వారా దర్యాప్తు చేశాము.
- 23 Oct 2020 3:25 PM GMT
Siddipet updates: టి ఆర్ ఎస్ వైపే అని ముంఫు గ్రామం నినదించిన ఏటీగడ్డ కిష్టాపూర్..
- సిద్దిపేట జిల్లా:
- సీఎం కేసీఆర్.. టి ఆర్ ఎస్ పార్టీ పై మాకు నమ్మకం విశ్వాసం ఉంది..
- మొన్న పల్లె పహాడ్.. నిన్న వేములఘట్ , నేడు ఎటిగడ్డ కిష్టాపూర్ .
- మంత్రి హరీష్ రావు ని కల్సి టి ఆర్ ఎస్ కె జై కొట్టిన ఏటీగడ్డ కిష్టాపూర్ గ్రామం...
- మాకు సీఎం కేసీఆర్...మంత్రి హరీష్ రావు పై నమ్మకమ్..విశ్వాసం ఉంది.. .
- 23 Oct 2020 3:19 PM GMT
Siddipet updates: బీజేపీ పై విరుచుకుపడ్డ మంత్రి హరీష్ రావు ..
సిద్దిపేట జిల్లా:
- బీజేపీ ఒక బీహార్ రాష్ట్రానికేనా... దేశానికి ప్రభుత్వమా...
- మంత్రి హరీష్ రావు సమక్షంలో బిజెపి నుండి టి ఆర్ ఎస్ పార్టీ లో చేరిన పలువురు నాయకులు..
- 23 Oct 2020 2:55 PM GMT
Pragathi Bhavan: ప్రగతి భవన్ లో ముగిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష.
ప్రగతి భవన్...
*మక్కల కొనుగోలు పై నిర్ణయం ప్రకటించిన ప్రభుత్వం.
*మార్కెఫెడ్ ద్వారా మక్కలు కొనుగోలు చేయలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్.
- 23 Oct 2020 2:50 PM GMT
Telangana updates: పెండింగ్ నిధులు విడుదల చేసిన కేంద్రం...
#రాష్ట్రానికి 202.3 కోట్లు పెండింగ్ నిధులు విడుదల.
#రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి సంబంధించి పెండింగ్ నిధులు విడుదల
#202.3 కోట్లు పెండింగ్ నిధులు విడుదల చేసిన కేంద్రం.
#గడ్కరీతో కిషన్‌రెడ్డి భేటీ అనంతరం నిధుల విడుదలకు అంగీకారం.
#రాష్ట్రంలో 8 జాతీయరహదారుల నిర్వహణ, మరమ్మత్తుల కోసం నిధులు
- 23 Oct 2020 12:06 PM GMT
Telangana updates: ప్రజలందరికీ బతుకమ్మ శుభకాంక్షలు-ఆర్దిక మంత్రి హారీష్ రావు...
*తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయలకు ప్రతీకైనా బతుకమ్మ పండుగను జిల్లా ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని మంత్రి హరిశ్ రావు గారు అన్నారు.
*బతుకమ్మ పండుగా సందర్భంగా .. ప్రజలకు మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు.
*దేశంలోనే పూలను పూజించి, ప్రకృతి ని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని అలాంటి సంస్కృతి మన తెలంగాణ లో ఉంది
*మహిళలను గౌరవిస్తూ వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ బతుకమ్మ
*టి ఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చాక బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ రాష్ట్ర పండుగగా గుర్తించింది
*ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వ బతుకమ్మ కానుకగా ఆడపడుచులలు చీరల పంపిణీ చేస్తున్నాము.
*ఈ పండుగను ప్రజలందరు వేడుకగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి
- 23 Oct 2020 11:54 AM GMT
K. T. Rama Rao: వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్కు లను శుక్రవారం ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కి అందజేశారు..
1)తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ , తరుపున ,సంఘము రాష్ట్ర అధ్యక్షులు చేవెళ ఎం.పి డాక్టర్ రంజిత్ రెడ్డి , కోటి రూపాయలు .
2)తెలంగాణ పౌల్ట్రీ పెడరేషన్,తరుపున రాష్ట్ర అధ్యకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కోటి రూపాయలు.
3)స్నేహ పౌల్ట్రీ ఫార్మ్ ప్రైవేటు,లిమిటెడ్ సంస్థ, తరుపున మేనేజింగ్ డైరెక్టర్ రాంరెడ్డి కోటి రూపాయలు
4)GMR-Airport సంస్థలు ,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసన్న ,రూ.రెండు కోట్ల యాబై లక్షలు(2.5cr)
- 23 Oct 2020 11:49 AM GMT
Nagarkurnool district updates: నాగర్ కర్నూల్ ఎంపి పి. రాములు కు కరోనా పాజిటీవ్...
నాగర్ కర్నూల్ జిల్లా :
*తనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని పేర్కొన్న ఎంపి.
*ఢిల్లీ పర్యటన కు వెళ్లి వచ్చిన తర్వాత తనకు పాజిటివ్ వచ్చింది.
*వారం రోజులుగా తనను కలిసినవారు టెస్టులు చేయించుకోవాలని, వీలయితే హోం ఐసోలేషన్‌లో ఉండేందుకు ప్రయత్నించాలని కోరిన ఎంపీ రాములు.
- 23 Oct 2020 10:33 AM GMT
Telangana updates: మరికాసేపట్లో ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్...
*వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై సమీక్ష.
*వ్యవసాయ, పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
*వానాకాలం పంటల కొనుగోలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఏర్పాట్లపై సమీక్షిస్తారు.
*ముఖ్యంగా మక్కల సాగుపై విధాన నిర్ణయం తీసుకునే అవకాశం.
*గత ఏడాది ఎన్ని ఎకరాల్లో మక్కలు వేశారు, వాటికి ఎంత ధర వచ్చింది, తదితర వివరాలను సమావేశానికి తీసుకురావల్సిందిగా అధికారులను సిఎం ఆదేశం.
*యాసంగిలో మక్కల సాగు చేయడం వల్ల లాభమా? నష్టమా? దేశంలో మక్కల మార్కెట్ పరిస్థితి ఏంటి? తదితర అంశాలపై చర్చించి, నిర్ణయం ప్రకటించే అవకాశం.
- 23 Oct 2020 10:29 AM GMT
Errabelli Dayakar Rao: కరోనా కష్ట కాలంలో వరంగల్ జిల్లా ప్రజలను కాపాడుకోవడంలో ముదున్నాం..
* మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కామెంట్స్
* వరంగల్ నగరాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు గా మననందరి పై ఉంది..
* ఎంజీఎం ఆసుపత్రికి ప్రత్యేక నిధులు మంజూరు చేసి మరింత అభివృద్ధి చేస్తాం..
* మొన్నటి అకాల వర్షాలకు నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలు వల్ల డ్రైనేజి వ్యవస్థకి ఇబ్బంది ఏర్పడింది..
* నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలను వెంటనే కూల్చేయాలి..
* ఎనిమిదో డివిజిన్ కార్పొరేటర్ దామోదర్ షెడ్డును కూల్చివేసిన అధికారులు ఏ కారణాల వల్ల కూల్చివేశారో తెలియజేయాలి..
* త్వరలో కేటీఆర్ తో చర్చలు జరిపి వరంగల్ నగరానికి ఉన్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తాము..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire