Live Updates: ఈరోజు (23 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 23 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | సప్తమి మ.12-01 వరకు తదుపరి అష్టమి | పూర్వాషాఢ నక్షత్రం ఉ.06-46 వరకు తదుపరి ఉత్తరాషాఢ | వర్జ్యం: మ.02-43 నుంచి 04-18 వరకు | అమృత ఘడియలు రా.12-15 నుంచి 03-22 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-15 నుంచి 09-02 వరకు తిరిగి మ.12-09 నుంచి 12-56 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 23 Oct 2020 6:54 AM GMT
ఎస్ ఆర్ నగర్ పి ఎస్....
16 ఏళ్లగా తప్పించుకుని తిరుగుతున్న కరుడుగట్టిన రౌడీషీటర్ డేవిడ్ రాజు ను అరెస్టు చేసిన ఎస్సార్ నగర్ పోలీసులు...
గత పదహారు సంవత్సరాలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న రౌడీషీటర్ డేవిడ్ రాజు ను కృష్ణ జిల్లా లో అరెస్టు చేసిన ఎస్సార్ నగర్ పోలీసులు
గతంలో ఎర్రగడ్డ లో జరిగిన పలు హత్య కేసులో డేవిడ్ రాజు ప్రధాన నిందితుడు
ఎస్సార్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లతో పాటు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో ఇతని పై1991 నుంచి కేసులు.
- 23 Oct 2020 6:54 AM GMT
సిద్ధి పేట జిల్లా:
దుబ్బాక మండలం రాజక్కపేటలో ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు
కామెంట్స్:
- ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఘనత కెసిఆర్
- కాంగ్రెస్ కు ఓటేస్తే మోరీలో వేసినట్టే..
- ఆనాడు కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఉండకపోవు..
- కెసిఆర్ హయాంలో 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాడు
- రైతు చనిపోతే.. రూ. 5లక్ష్మల భీమా ఇస్తున్నాం
- పెన్షన్ ల మీద చర్చకు బస్టాండ్ కు రమ్మన్నా బండి సంజయ్ ఇప్పటివరకు పత్తాలేడు...
- బీజేపీ అంటే.. భారతీయ జనతా పార్టీ కాదు.. భారతీయ జూటా పార్టీ
- బీజేపీ వాళ్ళు ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు..
- తెలంగాణ వచ్చినంక.. 1.24లక్ష్మల ఉద్యోగాలు ఇచ్చాము
- బీజేపీ ప్రభుత్వం కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.. ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి??
- దుబ్బాక ను రాబోయే రోజుల్లో అన్నీ రకాల్లో అభివృద్ధి చేసుకుందాం
- బీజేపీ, కాంగ్రెస్ వాళ్ల ఇండ్లు తెలియదు.. కానీ, ఆటో ఎక్కితే.. హరీష్ రావు ఇంటి కాడ దించుతాడు
- గా.. ఉత్తమ్, బండి సంజయ్ కు ఎంఎరుక.. రాజక్కపేట కష్టాలు
- మంత్రి హరీష్ రావు
- 23 Oct 2020 6:53 AM GMT
తెలంగాం పోలీస్ అకాడమీ లో ఎస్.ఐ. ల పాసింగ్ అవుట్ పరేడ్
తెలంగాణ పోలీస్ అకాడమీ లో ప్రారంభ మైన 12 వ బ్యాచ్ 1162 మంది ఎస్.ఐ ల పాసింగ్ అవుట్ పరేడ్
ఈ పాసింగ్ అవుట్ పరేడ్ లో సివిల్ కు చెందిన 661 ఎస్.ఐ. లు, ఐ.టీ, కమ్యూనికేషన్ కు చెండీన 28, 448 ఆర్.ఎస్.ఐ. లు, ఫింగర్ ప్రింట్ కు చెందిన25 ఏ.ఎస్.ఐ లున్నారు.
వీరిలో 256 మంది మహిళా ఎస్.ఐ. లున్నారు.
ఈ పాసింగ్ అవుట్ పరేడ్ ముఖ్య అతిధిగా హాజరైన హోమ్ మినిస్టర మహమూద్ అలీ, డీ.జీ.పీ మహేందర్ రెడ్డి, సీనియర్ పోలీసు ఉన్నతాధికారులు, ట్రైనింగ్ పూర్తైన ఎస్.ఐ. ల కుటుంబ సభ్యులు హాజరయ్యారు
కొత్త ఎస్.ఐ లతో ప్రమాణం చేయించిన పోలీస్ అకాడమీ ఇంచార్జ్ డైరెక్టర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
మహేందర్ రెడ్డి, డీజీపీ
ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ఎస్సైలు రావడం రాష్ట్ర పోలీసు శాఖ కి బలం
ప్రతీ ఒక్కరు నిష్పక్షపాతంగా, చట్ట ప్రకారం ప్రజలందరికీ రక్షణ కల్పించాలి
పోలీస్ అవ్వగానే ఏదైనా చేయొచ్చనుకుంటారు.. కానీ ప్రజల రక్షణ కోసం మాత్రమే మీకు ఇచ్చిన అధికారాలను ఉపయోగించాలి
సర్వీసులో ఉన్నంతకాలం ప్రజాలనుంది ఏమి ఆశించకుండా చట్టప్రకారం న్యాయం చేయాలి
పేద వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎవరూ ప్రవర్తించకూడదు
ప్రతీ ఒక్కరు టెక్నాలజీ తో అప్డేట్ అవుతూ, టెక్నాలజీని ఉపయోగిస్తూ ముందుకెళ్లాలి
మహిళ భద్రతలో తెలంగాణ దేశంలోనే ముందుంది...
పోలీస్ శాఖ కి కావాల్సిన వనరులన్నీ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది.. కాబట్టి ఎవరూ ఎలాంటి అవినీతికి పాల్పడవద్దు
స్వంత ప్రయోజనాలకోసం ఎవరూ అధికారాన్ని వాడుకోవద్దు
నీతి, నిబద్ధతతో పనిచేస్తూ పోలీస్ శాఖ కి మంచి పేరు తీసుకురావాలి
- 23 Oct 2020 6:53 AM GMT
హైదరాబాద్ నగర శివారులో రవిరాల లో వరద తో మునిగిపోయిన పంట పొలాలను పరిశీలించిన కేంద్ర బృందం
- 23 Oct 2020 6:52 AM GMT
మహబూబాబాద్ జిల్లా:
దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ అండ్ మర్డర్ కేసు రిమాండ్ రిపోర్ట్
రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు
సంవత్సరం నుండి డింగ్ టాక్ వాయిస్ ఓవర్ ఇంటర్ నెట్ ప్రోటోకాల్ యాప్ వాడుతున్న నిందితుడు
తన గర్ల్ ఫ్రెండ్ కు ఫోన్ చేసేందుకు యాప్ ను సంవత్సరం నుండి ఉపయోగిస్తున్న నిందితుడు.
అదే యాప్ ద్వారా బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసిన మంద సాగర్
నిందితుడు మొబైల్ నెంబర్ ద్వారా కాకుండా యాప్ ద్వారా కాల్స్ చేయటంతో పోలీసులకు 3 రోజులు పాటు సవాలు గా బాలుడి ఆచూకీ
పెట్రోల్ బంక్ వద్దకు వెలదమని చెప్పి బాలుడిని తీసుకెళ్లిన మందసాగర్
తెలిసిన వ్యక్తి కావడంతో పిలవగానే వెళ్లిన బాలుడు
అప్పటికే స్థానిక మెడికల్ స్టోర్ నుండి రెండు నిద్రమాత్రలు కొనుగోలు చేసిన నిందితుడు.
మార్గమధ్యంలో ఒక చోట మంచినీళ్లు తాగెందుకు ఆపిన నిందితుడు
ఆ మంచి నీళ్లలోనే నిద్రమాత్రలు చేసిన నిందితుడు
బాబు మత్తులోకి జారుకునీ స్పృహ వచ్చేలోపు బాలుడిని హత్య చేసిన మంద సాగర్.
టూవీలర్ స్పేర్ పార్ట్స్ దుకాణం నడుపుతున్న సాగర్
ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన నిందితుడు
ఒక చౌరస్తా దగ్గరికి బాలుడు తండ్రి రమ్మని చెప్పి షాపులో నుండి రంజిత్ రెడ్డి కదలికలను గమనించిన నిందితుడు
మఫ్టీలో పోలీసులు ఫాలో అవుతున్నారు అన్న అనుమానంతో మళ్లీ యాప్ నుండి రంజిత్ రెడ్డి కి ఫోన్ చేసిన మంద సాగర్
హత్య చేసిన వెంటనే మనోజ్ రెడ్డి ఇంటికి వెళ్లి బాలుడి తలిదండ్రుల రియాక్షన్ చూసేందుకు వెళ్లిన మంద సాగర్
తల్లిదండ్రులు కిడ్నాప్ గురించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చే లోపే బాలుడిని హత్య చేసిన మంద సాగర్.
- 23 Oct 2020 4:30 AM GMT
సికింద్రాబాద్
జూబ్లీ బస్ స్టేషన్ లో భారీగా పండగ రద్దీ...
తెలంగాణ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో బస్ స్టేషన్ లో రద్దీ...
పండగ నేపథ్యం 3000 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన తెలంగాణ ఆర్టీసీ..
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణం చేయాలని అధికారుల ఆదేశం..
ప్రయాణికుల రద్దీని బట్టి అవసరమైన ప్రదేశాలకు బస్సులు పంపించడానికి మరిన్ని ఆర్టీసీ బస్సులు సిద్ధం...
- 23 Oct 2020 4:30 AM GMT
హైదరాబాద్
దాదాపు ఏడు నెలల తర్వాత ప్రారంభమైన సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్..
గతంలో సాధారణ రైల్లో భాగంగా నిత్యం సికింద్రాబాద్ నుండి సిర్పూర్ కాగజ్ నగర్ వెళ్ళేది...
కోవిడ్ తరువాత రద్దైన రైల్లో ఈ రైలు కూడా బాగమే...
ఈ రైళ్లు ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులకు ప్రయాణం సులభతరం...
ప్రస్తుతం దసరా ప్రత్యేక రైళ్లలో భాగంగా ఈరోజు ఉదయం సికింద్రాబాద్ నుండి సిర్పూర్ కాగజ్ నగర్ బయలుదేరిన రైలు...
ఈ రోజు నుండి నవంబర్ 30 వరకు నడవనున్న ప్రత్యేక రైళ్లు.
- 23 Oct 2020 4:29 AM GMT
మధ్యాహ్నం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్
వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై సమీక్ష.
వ్యవసాయ, పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
వానాకాలం పంటల కొనుగోలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఏర్పాట్లపై సమీక్షిస్తారు.
ముఖ్యంగా మక్కల సాగుపై విధాన నిర్ణయం తీసుకునే అవకాశం.
గత ఏడాది ఎన్ని ఎకరాల్లో మక్కలు వేశారు, వాటికి ఎంత ధర వచ్చింది, తదితర వివరాలను సమావేశానికి తీసుకురావల్సిందిగా అధికారులను సిఎం ఆదేశం.
యాసంగిలో మక్కల సాగు చేయడం వల్ల లాభమా? నష్టమా? దేశంలో మక్కల మార్కెట్ పరిస్థితి ఏంటి? తదితర అంశాలపై చర్చించి, నిర్ణయం ప్రకటించే అవకాశం.
- 23 Oct 2020 4:29 AM GMT
మహబూబాబాద్ జిల్లా.
దీక్షిత్ రెడ్డి కిడ్నప్, హత్యోదంతం కేసులో బయటపడుతున్న అనేక కోణాలు.
నిందితుడు మంద సాగర్ కు ఉన్న నేర చరిత్ర ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న వైనం.
నిందితుడి బావలు ఇద్దరు పోలీసు శాఖలో కానిస్టేబుల్స్ గా ఉన్నారు.
వారికంటే తానే ఎక్కవగా డబ్బులు సంపాదించాలని ఆలోచనతోనే కిడ్నప్ పధకరచన చేసిన నిందితుడు సాగర్.
గతంలో 6 ఏళ్ల పాటు స్థానిక పోలీసు వాహనానికి తాత్కాలిక డ్రైవర్ గా పనిచేసిన సాగర్.
బాలుడు దీక్షిత్ తండ్రి రంజిత్ వద్ద డబ్బులు ఉన్నాయని అతన్ని ఎంచుకున్న నిందితుడు.
సాగర్ చదివింది 7వ తరగతి మాత్రమే.... టెక్నాలజీ పట్ల అవగాహన పెంచుకున్న నిందితుడు.
గతంలో ఇజ్రాయిల్ కంపెనీకి చెందిన ఒక యాప్ డౌన్ లోడ్ చేసుకొని కాల్స్ ద్వారా ఒక యువతిని వేధించిన సాగర్.
అప్పుడు కూడా పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్న సాగర్, ఇంకా పెండింగులోనే ఉన్న ఆ వేధింపుల కేసు.
తాజా ఘటనతో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న సాగర్ అరాచకాలు.
- 23 Oct 2020 4:28 AM GMT
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెండో రోజు పర్యటన.
వరద ప్రభావిత ప్రాంతాలల్లో పర్యటించనున్న కిషన్ రెడ్డి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire