Live Updates: ఈరోజు (సెప్టెంబర్-21) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 21 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | చవితి ఉ. 7-41వరకు పంచమి తె. 5.24వరకు తదుపరి షష్ఠి | విశాఖ నక్షత్రం తె. 3-06 వరకు తదుపరి అనూరాధ | వర్జ్యం ఉ.9-54 నుంచి 11-24 వరకు | అమృత ఘడియలు: సా. 6-52 నుంచి 8-22 వరకు | దుర్ముహూర్తం: మ. 12-18 నుంచి 1-07 వరకు తిరిగి 2-43 నుంచి 3-32 వరకు | రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-57
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 21 Sep 2020 10:28 AM GMT
Amaravati updates: పోలీస్ సేవ యాప్‌కు సంబంధించిన పోస్టర్ రిలీజ్..
అమరావతి..
సీఎం పాయింట్స్..
-పౌరులకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో ఏపీ పోలీస్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ఏపీ పోలీస్ సేవ (సిటిజెన్ సర్వీసెస్ అప్లికేషన్)యాప్‌ను ఆవిష్కరించిన సీఎం వైయస్ జగన్
-పోలీసు ఫీల్డ్ ఆఫీసర్లకు అత్యాధునిక ట్యాబ్‌లు అందజేసిన సీఎం.
-పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం చాలా తగ్గుతుంది.
-సర్టిఫికెట్ కావాలన్నా, డాక్యుమెంట్లు పోయినా, ఏవైనా లైసెన్సులు రెన్యువల్ చేయించుకోవాలన్నా, ఎన్‌ఓసీ కావాలన్నా పోలీస్ స్టేషన్‌కు పోవాల్సిన అవసరం లేదు.
-మొబైల్ యాప్‌లోనే ఫిర్యాదు చేసుకోవచ్చు. కేసు నమోదు చేస్తే, ఎఫ్‌ఐఆర్ పొందవచ్చు.
-మహిళల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ 12 మాడ్యూల్స్ చేర్చారు. దిశ యాప్ కూడా అనుసంధానం చేశారు.
--పోలీసులే సరైన సమాచారం ఇచ్చే సోషల్ మీడియా కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది.
-దేశంలోనే తొలిసారిగా దిశ యాప్. ఇది ఎంతో సక్సెస్ అయింది. 11 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇది గర్వకారణం
-దిశ యాప్ ద్వారా 568 మంది నుంచి ఫిర్యాదులు అందగా, వాటిలో 117 యఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి చర్యలు తీసుకున్నాము.
-సైబర్ సేఫ్టీ కోసం సైబర్‌మిత్ర అనే వాట్సాప్ నంబరు ఫేస్‌బుక్‌లో అందుబాటులోకి తెచ్చాం.
స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ.
-రాష్ట్ర పోలీసులకు అందుబాటులోకి తెచ్చి రిమోట్ ఏరియా కమ్యూనికేషన్లు, వాహనాలకు జీపీఎస్, శాటిలైట్ ఫోన్ల వ్యవస్థ ఏర్పాటు చేశాం.
-న్యాయ ప్రక్రియలో కేసులు త్వరగా పరిష్కారమయ్యే విధంగా గత నెలలోనే ‘ఇంటర్- ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్’.
-ఆన్‌లైన్‌లోనే ఎఫ్‌ఐఆర్, ఛార్జ్‌షీట్లు పంపిస్తున్నారు. దీని ద్వారా కేసుల విచారణ వేగంగా జరుగుతుంది.
-చాలా సమస్యల పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా యాప్ ద్వారా పొందవచ్చు.
- 21 Sep 2020 10:19 AM GMT
Visakha updates: సింహాచలం లో భక్తులకు ఇవాళ నుండి ప్రత్యక్ష పద్దతిలో పూజల్లో పాల్గొనే అవకాశం..
విశాఖ..
-కోవిడ్ నిబంధనలు పాటిస్తు పరిమిత సంఖ్యలో అనుమతి
-ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు దర్శనానికి అనుమతి
- 21 Sep 2020 10:13 AM GMT
AP Congress Core Committee Meeting: ఈ నెల 23న హైదరాబాద్ ఇందిరభవన్ లో ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం..
ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం..
-హజరుకానున్న మాజి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఇంచార్జీ ఉమించాంది , ఏపీసీసీ ప్రెసిడెంట్ శైలజానాథ్ , ఇతర పార్టీ సీనియర్ నేతల.
-చాలా రోజుల తరువాత పార్టీ మీటింగ్ కి హాజరవుతున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.
- 21 Sep 2020 10:08 AM GMT
Rajahmundry updates: ముద్రగడ నాయకత్వంలోనే కాపులకు న్యాయం జరుగుతుంది..ఏపీ కాపు జేఏసీ నేతలు..
తూర్పుగోదావరి -రాజమండ్రి..
ఏపీ కాపు జేఏసీ నేతలు మీడియా సమావేశం
రాష్ట్ర కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ , ఆరేటి ప్రకాష్, చినిమిల్లి రాయుడు కామెంట్స్ ,,
-ముద్రగడ నాయకత్వంలో ఐదేళ్ళు ఉద్యమం చేశాం
-లేఖరూపంలో ముద్రగడ తన నిర్ణయం తెలిపారు
-ముద్రగడ మనస్తాపం చెందివున్నారు
-ఎమ్మెల్యే పదవికి రాజీనామా , జీవో 30 తేవడం, కాపు కార్పొరేషన్ ఏర్పాటు, ఐదు శాతం రిజర్వేషన్లు బిల్లు కేంద్రానికి పంపడం ముద్రగడ ఉద్యమం వల్లే
-కాపులు ఎపుడూ ముద్రగడ ను మరచిపోరు
-రిజర్వేషన్లు ఫలితాలు సాధన, సంక్షేమంపై ఆయన పాత్ర లేనిదే మేము లేం
-ఏదిఏమైనా ముద్రగడ బాటలోనే నడుస్తాం
-ప్రతిజిల్లాలో కాపు జేఏసీ సమావేశాలు నిర్వహించి మళ్ళీ ముద్రగడ ను కలుస్తాం..కాపు రిజర్వేషన్లు సాధించితీరతాం
-ముద్రగడ పద్మనాభం మనస్థాపం చెంది ఆయనను బుజ్జగింపుపైనే దృష్టి పెట్టాం
-ముద్రగడ కు అండగా వున్నామని చెప్పడానికే ఈ సమావేశం ప్రాధాన్యం
- 21 Sep 2020 10:00 AM GMT
National updates: పోలవరం ప్రాజెక్టు రీయింబర్స్మెంట్ నిధులు త్వరితగతిన విడుదల చేయాలని కోరా: అనిల్ కుమార్ యాదవ్..
జాతీయం..
-కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ ను కలిసిన రాష్ట్ర మంత్రి అనిల్ యాదవ్, ఎంపీలు మిథున్ రెడ్డి, గోరంట్ల మాధవ్, లావు కృష్ణదేవరాయలు
-పోలవరం బకాయిలు, పునరావాసం ప్యాకేజీ నిధులు విడుదల చేయాలని వినతి
అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి..
- రెండు మూడు రోజుల్లోనే నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు
- వరదల సమయంలో నూ పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం జగన్ ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నారు
- 2021 డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యం
- పునరావాసం ప్యాకేజీని త్వరితగతిన సెటిల్ చేయాలి
- నాలుగు వేల కోట్ల రూపాయల పోలవరం బకాయిలు విడుదల చేస్తామన్నారు
- కృష్ణ ప్రాజెక్టుల వల్ల రాయలసీమకు జరిగే ప్రయోజనాలను వివరించాను
- అపెక్స్ కౌన్సిల్ సమావేశం తేదీ త్వరలోనే నిర్ణయిస్తామని చెప్పారు
- ఈ అంశాలను సానుకూలంగా పరిష్కరించుకోవచ్చు
- 21 Sep 2020 8:57 AM GMT
Guntur updates: గుంటూరు జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి....అగ్రికల్చర్ జేడీ విజయభారతి....
గుంటూరు...
-హెచ్ఎంటివి తో గుంటూరు అగ్రికల్చర్ జేడీ విజయభారతి....
-జిల్లాలో ప్రత్తి,మిరప,వరి,పసుపు పంటలు నష్టపోయాయి...
-జిల్లాలో 9,600హెక్టార్లలో పంటలు నష్టపోయాయి.....
-వాగులు పొంగిపొర్లడంతో పంటలకు నష్టం జరిగింది....
-రైతులను అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది....
- 21 Sep 2020 8:47 AM GMT
East Godavari updates: రాజోలు గాంధీ బొమ్మ సెంటర్ లో ఆందోళన చేపట్టిన బిజెపి యువమోర్చా సభ్యులు..
తూర్పు గోదావరిజిల్లా.... రాజోలు..
-హిందూ దేవుళ్ళ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ని బర్తరఫ్ చేయాలంటూ ఆందోళన చేపట్టి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన యువ మోర్చా సభ్యులు.
-మంత్రి కొడాలి నాని పై తీవ్ర స్థాయిలో మండిపడ్డా బీజేపీ యువ మోర్చా సభ్యులు.
-150 కేజీల బరువున్న నాని ఒంట్లో నుంచి రెండు కేజీలు తీసేస్తే వాడికి ఏమైనా నష్టమా అంటూ మండిపడ్డారు
-ఆందోళన చేస్తున్న యువ మోర్చా సభ్యులను అడ్డుకున్న పోలీసులు.
- 21 Sep 2020 8:27 AM GMT
East Godavari updates: అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో మళ్ళీ దర్శనములు నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన ఆలయ అధికారులు
తూర్పుగోదావరి..
-అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి ఆలయం లో
-ఈనెల 25 వరకు భక్తులకు మళ్ళీ దర్శనములు నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన ఆలయ అధికారులు
-కరోనా వ్యాప్తి నివారణ, పోలీసు బందోబస్తు నేపధ్యంలో తాజా నిర్ణయం తీసుకున్న అధికారులు
-ఉదయాన్నే దర్శనాలకు అనుమతించినా ఆలయానికి రాని భక్తులు
- 21 Sep 2020 7:11 AM GMT
Amaravati updates: రైతును..రాజును, పారిశ్రామిక వేత్తను చెయ్యడమే బీజేపీ పరిపాలనా ఉద్దేశం: సోము వీర్రాజు..
అమరావతి...
-సోము వీర్రాజు...ఏపీ బీజేపీ అధ్యక్షుడు..
-ఇదే ఉద్దేశం తో రైతుల బిల్ ప్రవేశ పెట్టాము..
-భారత దేశం లో రైతు పండించే పంట కు గిట్టుబాటు ధర లేదు..
-రైతు కూడా తన పంట ఎక్కడైనా అమ్ముకోవాలి...
-ఏ రకమైన అడ్డంకులు ఉండకూడదు.
-ఇప్పటివరకు దేశంలో దళారి వ్యవస్థ మూలంగా రైతులు నష్టపోయారు.
-మంత్రి కొడాలి నాని ఆంజనేయ స్వామి చెయ్యి విరిగితే నష్టం లేదంటున్నారు.
-ఏంటి..ఈ భాష, ఇది సభ్యత కాదు.
-ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి భాష మాట్లాడించడం మంచిది కాదు...
-బీజేపీ ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది..
-సరైన భాష మాట్లాడడానికి కూడా చట్టబద్ధత ఉండాలి....
- 21 Sep 2020 7:01 AM GMT
Amaravati updates: కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలకు పిడుగు హెచ్చరిక-కె.కన్నబాబు..
పిడుగు హెచ్చరిక..
కృష్ణా జిల్లా..
*కె.కన్నబాబు, విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్*
-నందిగామ, చందర్లపాడు, జగ్గయ్యపేట, ఆగిరిపల్లి, నూజివీడు, బాపులపాడు,మైలవరం.
తూర్పుగోదావరి జిల్లా..
-రాజమండ్రి, జగ్గంపేట, గండేపల్లి, సామర్లకోట, రంగంపేట, పెద్దాపురం, రాజనగరం
-మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది.
-పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి.
-సురక్షితమైనభవనాల్లో ఆశ్రయంపొందండి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire