Live Updates: ఈరోజు (సెప్టెంబర్-21) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 21సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 21 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | చవితి ఉ. 7-41వరకు పంచమి తె. 5.24వరకు తదుపరి షష్ఠి | విశాఖ నక్షత్రం తె. 3-06 వరకు తదుపరి అనూరాధ | వర్జ్యం ఉ.9-54 నుంచి 11-24 వరకు | అమృత ఘడియలు: సా. 6-52 నుంచి 8-22 వరకు | దుర్ముహూర్తం: మ. 12-18 నుంచి 1-07 వరకు తిరిగి 2-43 నుంచి 3-32 వరకు | రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-57
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 21 Sep 2020 12:19 PM GMT
Vijayawada updates: మంత్రి కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అతనికి బుద్ది రావాలి....సోము వీర్రాజుగారు..
విజయవాడ..
-రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అతనికి బుద్ది రావాలని కోరుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుగారు నగరంలోని మాచవరం దాసాంజనేయ స్వామి వారికి వినతి పత్రం సమర్పించారు.
-అనుచిత వ్యాఖ్యల వలన హిందువుల మనో భావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని మాచవరం పోలీసు స్టేషన్ లో కొడాలి నాని పై కేసుల నమోదు చెయ్యాలని కోరుతూ ఫిర్యదు పత్రాన్ని సమర్పించారు.
- 21 Sep 2020 12:16 PM GMT
Guntur updates: తక్షణమే సీఎం జగన్ స్పందించి మంత్రి కొడాలి నానిని బర్తరఫ్ చేయాలని డిమాండ్..బీజేపీ నేతలు..
గుంటూరు....
-మంత్రి కొడాలి నాని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
-గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, లీగల్ సెల్ కన్వీనర్ జూపూడి రంగరాజ్
-హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని ని అరెస్ట్ చేయాలని డిమాండ్
- 21 Sep 2020 12:13 PM GMT
Amaravati updates: సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల కేసు వ్యవహారం లో తుళ్లూరు పోలీసుల విచారణ తర్వాత సీఐడీకి బదిలీ చేయనున్న ప్రభుత్వం..
అమరావతి:
-మూడు రాష్ట్రాల పరిధిలోని అంశం కావడంతో సీఐడీకి బదలాయించనున్న ప్రభుత్వం.
-ఉద్యోగుల పాత్రపైనా అంతర్గత విచారణ చేపట్టనున్న ఏసీబీ.
-సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల వ్యవహారంపై సెక్రటేరీయేట్టులో తుళ్లూరు పోలీసుల విచారణ.
-రెవెన్యూ శాఖ అధికారులతోపాటు సచివాలయంలోని ఎస్బీఐ అధికారులనూ విచారించిన పోలీసులు.
-గతంలో సీఎంఆర్ఎఫ్ కోసం జారీ చేసిన చెక్కుల నకిలీ చేసినట్టు గుర్తింపు.
-నకిలీ చెక్కులను అదే నెంబరు తో, అదే సంతకం తో రూపొందించిన ఆగంతకులు
-మూడు కంపెనీల ఖాతాల పేరు పై చెక్కులను బ్యాంకుకు జమ
-నకిలీ చెక్కులతో గతంలో వేలు,లక్షల్లో ను నిధులు డ్రా చేసి ఉంటారని పోలీసులు అనుమానం
-సుమారు గంటన్నర పాటు సాగిన విచారణ.
- 21 Sep 2020 12:10 PM GMT
CM Jagan Tour to Tirumala: సీఎం జగన్ తిరుమల పర్యటన..
అమరావతి..
సీఎం జగన్ తిరుమల పర్యటన షెడ్యూల్:
-23 సాయంత్రం 3.50 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్ట్ కి చేరుకోనున్న జగన్.
-రోడ్ మార్గం ద్వారా 5 గంటలకు పద్మావతి గెస్ట్ హౌస్ కి సీఎం జగన్.
-సాయంత్రం 6.20 నిమిషాలకు శ్రీ వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న జగన్.
-24 ఉదయం 8.10 కి కర్ణాటక సీఎం యడ్యూరప్ప తో కలిసి కర్ణాటక సత్రాల భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్.
- 21 Sep 2020 11:32 AM GMT
National updates: “ప్రధాన మంత్రి ఆవాస్ (పట్టణ) యోజన” కింద ఆంధ్రప్రదేశ్‌కు 10 లక్షల ఇళ్ళు మంజూరు..హర్దీప్ సింగ్ పురి..
జాతీయం..
గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పురి..
• “ప్రధాన మంత్రి ఆవాస్ (పట్టణ) యోజన” కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2016 నుంచి 2019 వరకు 10.50 లక్షల ఇళ్ళు మంజూరు చేసినట్లు గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు.
• రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ రాష్ట్రానికి కేటాయించిన 10.50 లక్షల ఇళ్ళలో 2.93 లక్షల ఇళ్ళ నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు.
• మిగిలిన ఇళ్ళు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయి.
• 2022 మార్చి నాటికి వీటి నిర్మాణం పూర్తి చేసి లబ్దిదారులకు అందచేయడం జరుగుతుందని ఆయన చెప్పారు.
- 21 Sep 2020 10:47 AM GMT
Nellore updates: బల్లి దుర్గాప్రసాద్ కుటుంబానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతాపం..
నెల్లూరు..
-- తిరుపతి పార్లమెంటు సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ కుటుంబానికి రాష్ట్రపతి రామనాథ కొవిద్ సంతాపం.
-- లేఖ ద్వారా సంతాప సందేశాన్ని దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులకు తెలిపిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్..
-- లేఖను దగ్గరుండి ఎంపీ కుటుంబ సభ్యులకు అందజేసిన గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ...*
- 21 Sep 2020 10:41 AM GMT
Kakinada updates: మంత్రి గుమ్మనూరు జయరాంను మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేయాలి..నిమ్మకాయల చినరాజప్ప కామెంట్..
తూర్పుగోదావారి..
కాకినాడ.....
- పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప కామెంట్..
- మందుల సరఫరా కాంట్రాక్టు టెండరు విషయమై కార్తీక్‌ను బినామీగా పెట్టుకొని ఈఎస్‌ఐ ఆసుపత్రులకు మందులు సరఫరా చేసే కాంట్రాక్టును కట్టబెట్టారు..
- అందుకు కృతజ్ఞతగా అతను మంత్రి కుమారుడికి బెంజి కారును బహుమతిగా ఇవ్వడం పక్కా ఆధారాలతో నిరూపితమైనది,
- ఆయన కుమారుడు పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల..
- విజయవాడలో తిరుమల మెడికల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న కార్తీక్.. మంత్రి జయరామ్‌కు బినామీ.
- దీనిపై సీఎం జగన్ ఉన్నతస్థాయి న్యాయ విచారణ జరిపించాలి.
- 21 Sep 2020 10:35 AM GMT
Vizianagaram updates: పార్వతీపురం చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్య మంత్రులు..
విజయనగరం ...
-పార్వతీపురం చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్య మంత్రులు ఆళ్ల నాని,ధర్మాన కృష్ణ దాస్,పాముల పుష్ప శ్రీవాణి, మంత్రి సీదిరి అప్పలరాజు
-పార్వతీపురం ఐటిడిఎ పరిదిలో నూతనంగా నిర్మించనున్న సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ స్థలం పరిశీలించిన ఉప ముఖ్య మంత్రుల బృందం.
-పార్వతీపురం ఏరియా హాస్పిటల్ సందర్శించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ధర్మాన కృష్ణదాస్,పాములు పుష్ప శ్రీవాణి ,మంత్రి సీదిరి అప్పలరాజు
-హాజరైన ఎమ్మెల్యే అలజంగి జోగారావు,బొబ్బిలి ఎమ్మెల్యే అప్పలనాయుడు సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీవో, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు..
- 21 Sep 2020 10:33 AM GMT
East Godavari updates: కోరుకొండ పోలీస్ స్టేషన్ లో మంత్రి కొడాలి నాని పై బిజెపి, జనసేన ఫిర్యాదు..
తూర్పు గోదావరి జిల్లా..
-హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న మంత్రి వ్యాఖ్యలపై నిరసన
-మంత్రిని అరెస్టు చేయాలని డిమాండ్.
- 21 Sep 2020 10:31 AM GMT
Vijayawada updates: ఛీఫ్ సెక్రటరీ, డీజిపికి నోటీసులు జారీ చేసిన ఎన్.హెచ్.ఆర్.సి.!
విజయవాడ..
-పీసీసీ ఉపాధ్యక్షుడు, డా. గంగాదర్ పై సి.ఐ.డి. కేసు నమోదు చేసిన వ్యవహారం పై స్పందించిన ఎన్.హెచ్.ఆర్.సి.
-ఈ వ్యవహారంలో యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు
-భవిష్యత్ లో ఇటువంటి ఇబ్బందులు మరెవరికి కల్పించకూడదని ఆదేశించిన ఎన్.హెచ్.ఆర్.సి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire