Live Updates: ఈరోజు (సెప్టెంబర్-21) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 21 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | చవితి ఉ. 7-41వరకు పంచమి తె. 5.24వరకు తదుపరి షష్ఠి | విశాఖ నక్షత్రం తె. 3-06 వరకు తదుపరి అనూరాధ | వర్జ్యం ఉ.9-54 నుంచి 11-24 వరకు | అమృత ఘడియలు: సా. 6-52 నుంచి 8-22 వరకు | దుర్ముహూర్తం: మ. 12-18 నుంచి 1-07 వరకు తిరిగి 2-43 నుంచి 3-32 వరకు | రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-57
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 21 Sep 2020 6:45 AM GMT
Srikakulam updates: రిమ్స్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత..
శ్రీకాకుళం జిల్లా..
-పోలీసుల తీరుకు నిరసనగా ఆందోళనకు దిగిన చంద్రకళ అనే యువతి కుటుంబ సభ్యులు..
-నాలుగు నెలల క్రితం ప్రేమ వ్యవహారంలో ఆత్మహత్య చేసుకున్న యువతి..
-యువతి శ్రీకాకుళం పి.ఎన్. కాలనీకి చెందిన చంద్రకళ..
-తమ కూతురు చావుకు రవి కుమార్ అనే వ్యక్తి కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి తల్లిదండ్రులు..
-రవికుమార్ ను పోలీసులకు అప్పగించిన చంద్రకళ కుటుంబ సభ్యులు..
-విచారణ కూడా చేయకుండా రవికుమార్ ను పోలీసులు వదిలేశారని చంద్రకళ కుటుంబ సభ్యులు ఆరోపణ..
-తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగిన యువతి కుటుంబ సభ్యులు..
-AITUC ఆధ్వర్యంలో ఆందోళన .. పోలీసులు రంగప్రవేశం..
-పోలీసులకు, సంఘ నాయకులకు మధ్య వాగ్వాదం..
-ఏఐటీయూసీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు..
- 21 Sep 2020 5:59 AM GMT
Kurnool updates: కార్మిక చట్టాలను పాత వాటినే అమలు చేయాలని సీపీఎం పార్టీ నిరసన..
కర్నూలు...
-సవరించిన కార్మిక చట్టాలను పునరుద్ధరించి.. పాత వాటినే అమలు చేయాలని సీపీఎం పార్టీ నిరసన..
-ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకోవలని డిమాండ్.
-కరోనా కష్టకాలం లో కరెంట్ చార్జీలు పెంపు కు నిరసనగా కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఎం పార్టీ ధర్నా..
- 21 Sep 2020 5:55 AM GMT
Vizianagaram District updates: మహాకవి గురజాడ అప్పారావు 158వ జయంతి ఉత్సవాలు..
విజయనగరం..
-గురజాడ స్వగృహంలో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాలర్పించిన జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్, గురజాడ వారసులు, సాహితీకారులు,
-పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు
- 21 Sep 2020 5:50 AM GMT
Kadapa District updates: కేంద్ర కారాగారం కేంద్రంగా రెండవ రోజు కోనసాగుతున్న వివేకా హత్య కేసుపై సిబిఐ విచారణ..
కడప :
-మరోమారు విచారణకు హాజరైన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి భార్య, మరో మహిళ...
-నిన్న మహిళలిద్దరినీ ఆరు గంటల పాటు విచారించిన సిబిఐ అధికారులు..
-కీలక వ్యక్తులు, అనుమానితులను విచారించనున్న సీబీఐ బృందం..
-కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నాక విచారణను వేగవంతం చేసిన సీబీఐ బృందం..
- 21 Sep 2020 4:27 AM GMT
High Court Of Andhra Pradesh: నేడు ధర్మాసనం ముందుకు రానున్న లిస్ట్ అయిన 93 పిటిషన్‌లు..
అమరావతి:
-నేటి నుండి హైకోర్టులో అమరావతి రైతులు, రైతు పరిరక్షణ సమితి,మాజీ ఎంఎల్‌ఏ శ్రవణ్ కుమార్ తదితరులు వేసిన పిటిషన్‌లపై రోజువారీ విచారణ
-పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు, జీఎన్‌రావు కమిటీ, హై పవర్ కమిటీల చట్టబద్దతపై కేసులు వేసిన రాజధాని రైతులు
-సీర్డీఏ రైతులతో చేసుకున్న ఒప్పంద ఉల్లంఘనపై కేసులు నమోదు
-రాజధానిలో మాస్టర్ ప్లాన్ డివియేషన్‌పైన, మౌలిక సదుపాయాల కల్పన చేయకపోవడంపైన కేసులు వేసిన రైతులు
-రాజధాని గ్రామాల్లో సెక్షన్ 144 సీఆర్పీసీ విధింపును ఛాలెంజ్ చేసిన రైతులు
-పరిపాలన రాజధాని తరలింపు కోసం చేసిన చట్టం పై ఇప్పటికే స్టేటస్ కో ఇచ్చిన హైకోర్టు
-నేడు ఆన్‌లైన్ ద్వారా రాజధానికి సంబంధించిన కేసులను విచారించనున్న ధర్మాసనం..
- 21 Sep 2020 4:23 AM GMT
Amaravati updates: సిఎంఆర్ఎఫ్ నిధులు దారి మళ్లించే అంశంపై సీరియస్ గా ఉన్న జగన్ సర్కార్..
అమరావతి..
-సచివాలయంలో 117.15 కోట్ల సిఎమ్ఆర్ఎఫ్ కుంభకోణంపై నేడు విచారించనున్న పోలీసులు.
-ఫోర్జరీ చెక్కులు సృష్టించి నిధులు పక్కదారి పట్టించే ప్రయత్నం చేసారని పిర్యాదు చేసిన రెవెన్యూ శాఖ అసిస్టెంట్ సెక్రటరీ మురళి కృష్ణ.
-పారదర్శకంగా దర్యాప్తు చెసి దోషులను త్వరగా అదుపులోకి తీసుకోవాలని అధికారులకు సూచించిన సీఎం జగన్
-తుళ్లూరు డిఎస్పీ శ్రీనివాస రెడ్డి ఆధ్యర్యంలో నేడు సచివాలయంలో విచారణ..
- 21 Sep 2020 4:20 AM GMT
Dhavaleswaram updates: ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 9.10 అడుగుల నీటిమట్టం..
తూర్పుగోదావరి..
-సముద్రంలోకి 3లక్షల 34వేల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల
-భారీవర్షాలతో తూర్పు, మధ్య డెల్టాల పంట కాల్వలకు 2,000, 500 క్యూసెక్కులు సరఫరా.
-పశ్చిమ డెల్టాల కాల్వకు నీటిని నిలిపివేసిన అధికారులు..
- 21 Sep 2020 4:14 AM GMT
East Godhavari updates: జిల్లాలో విజృంభిస్తోన్న కరోనా వైరస్..
తూర్పుగోదావరి :
-85 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.. తాజాగా 1,260 పాజిటివ్ కేసులు నమోదు..
-జిల్లాలో 86,507 కి చేరిన పాజిటివ్ కేసులు..
-ఆస్పత్రులు, కోవిడ్ కేర్ సెంటర్స్, హోం ఐసోలేషన్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన 73 వేల 831 మంది బాధితులు..
-12 వేల 191 పాజిటివ్ కేసులు.. నిన్న కరోనాతో 4 గురు మృతి 485 కి చేరిన కరోనా మరణాలు..
- 21 Sep 2020 4:10 AM GMT
Antervedi updates: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి దర్శనాలు నేటి నుంచి పునః ప్రారంభం..
తూర్పుగోదావరి :
-రథం దగ్ధమైన ఘటన తరువాత ఆందోళనలు, నిరసనలు, పోలీస్ డ్యూటీలతో సుమారు 60 మందికి సోకిన కరోనా..
-కరోనా ప్రభావం అధికంగా ఉండడంతో నిన్నటి వరకు స్వామివారి దర్శనాలు నిలిపివేసిన అధికారులు..
-ఈ రోజు నుంచి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనాలకు అనుమతి..
- 21 Sep 2020 4:03 AM GMT
Rajahmundry updates: నేడు కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తో భేటీకానున్న రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు..
తూర్పుగోదావరి -రాజమండ్రి..
-కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టు ముద్రగడ ప్రకటించాక తొలిసారి ముద్రగడ తో కాపు రాష్ట్ర జేఎసీ సమావేశం
-కాపు ఉద్యమాన్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదేనని, మౌనం వీడి ఉద్యమం ముందుకు తీసుకువెళ్ళాలని కోరనున్న కాపు జేఎసి నేతలు..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire