Live Updates: ఈరోజు (21 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 21 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పంచమి మ.02-47 వరకు తదుపరి షష్టి | జేష్ఠ నక్షత్రం ఉ.08-21 వరకు తదుపరి మూల | వర్జ్యం: సా.04-02 నుంచి 05-34 వరకు | అమృత ఘడియలు రా.01-14 నుంచి 02-52 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-23 నుంచి 12-10 వరకు | రాహుకాలం: మ.11-23 నుంచి 12-10 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Dubbaka updates: మర్రికుంట లో మంత్రి హరీష్ రావు పర్యటన..
    21 Oct 2020 9:09 AM GMT

    Dubbaka updates: మర్రికుంట లో మంత్రి హరీష్ రావు పర్యటన..

    సిద్దిపేట జిల్లా:

    - దుబ్బాక మండలం మర్రికుంట లో మంత్రి హరీష్ రావు పర్యటన..

    - ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ...

    ◆మర్రికుంట గ్రామస్తులంటే అభిమానం గల ప్రజలు..

    ◆ ఈ గ్రామస్తులతో నాకు ఆత్మీయ అనుబంధం ఉంది..

    ◆ హనుమాన్ దేవాలయ ప్రారంభోత్సవం రోజు కూడా నేను మర్రికుంటకు వచ్చాను.

    ◆24 గంటల కరెంటుతో ప్రజల బాధలు తీరపోయాయి...

    ◆ కేసీఆర్ కిట్టు ఇస్తూ తల్లీ పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నది మన పార్టీ.

    ◆ ఎకరానికి రైతుబంధు 10 వేలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన టిఆర్ఎస్ ప్రభుత్వం.

    ◆ బీడీ కార్మికులను దేశంలో ఆదుకుంటున్న ప్రభుత్వం మనది.

    ◆ బాయిలకాడ మీటర్లు పెట్టేది బీజేపీ పార్టీ,24 గంటల కరంటు కాకుండా ,కరెంటు ఇవ్వక ప్రజలను ఇబ్బంది పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.

    ◆ అన్నివర్గాల ప్రజలను అందుకుంటున్న పార్టీ మన టిఆర్ఎస్ పార్టీ.

    ◆కేసీఆర్ గారికి ఇష్టమైన ఊరు ఈ మర్రికుంట.

    ◆కేసీఆర్ గారిని,నన్ను ఎమ్మెల్యే చేసిన ఊరు ఈ మర్రికుంట అంటే ఎప్పటికీ మాకు అభిమానం.

    ◆ అన్నిరకాలుగా అందరికీ అండగా ఉంటాం...

    ◆ కారు గుర్తుకే ఓటు వేసి,సుజాతక్కను గెలిపిస్తే

    -- సుజాతక్కకు..... నేను,ప్రభాకరన్న అండగా ఉండి,........ మన గ్రామాన్ని,నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం...

  • 21 Oct 2020 8:59 AM GMT

    Warangal urban updates: హన్మకొండ లోని ప్రెస్ క్లబ్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు..

    వరంగల్ అర్బన్ జిల్లా....

    - విరసం నేతలు ప్రెస్ మీట్ పెడుతారనే సమాచారం తో ఎవరు వస్తున్నారంటూ అరా తీస్తున్న పోలీసులు.

    - వారు మీడియాను కలవకముందే వారిని అరెస్టు   చేయాలని చూస్తున్న పోలీసులు.

  • Warangal urban updates: శ్రీ భద్రకాళీ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు!
    21 Oct 2020 8:55 AM GMT

    Warangal urban updates: శ్రీ భద్రకాళీ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు!

      వరంగల్ అర్బన్ :

    -వరంగల్ శ్రీ భద్రకాళీ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు భాగంగా

    -ఈ రోజు భద్రకాళి అమ్మవారు లలితా మహా త్రిపుర సుందరి అలంకారం, ఉదయము గందోత్సవం వాహనసేవ సాయంత్రం

    -సాలభంజిక వాహన సేవలతో దర్శనమివ్వనున్న అమ్మవారు..

  • Kamareddy district updates: గంగస్టాన్ లో లక్కీ డ్రా నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు..
    21 Oct 2020 8:43 AM GMT

    Kamareddy district updates: గంగస్టాన్ లో లక్కీ డ్రా నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు..

      కామారెడ్డి జిల్లా :

    -జిల్లా కేంద్ర పరిధిలోని గర్గుల్ గ్రామ శివారులో గల గంగస్టాన్ లో లక్కీ డ్రా నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.

    -లక్కీ డ్రా నిర్వహిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

    -పట్టుబడ్డ వారిలో పలువురు ప్రజా ప్రతినిధులు.

    -ఆరుగురిలో కేవలం ఇద్దరు పైనే కేసు నమోదు చేసిన పోలీసులు.

    -ఈ ఘటన సోమవారం జరిగినప్పటికీ బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డా పోలీసులు.

  • 21 Oct 2020 8:40 AM GMT

    Nizamabad updates: నగరంలో భారీగా గుట్కా పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు..

    నిజామాబాద్..

    -నిజామాబాద్ నగరంలో భారీగా గుట్కా పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

    -11 లక్షల విలువచేసే నిషేధిత గుట్కా స్వాధీనం

    -నిందితుల పరారీ

    -పట్టుకున్న గుట్కా నిల్వలు స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలింపు

  • 21 Oct 2020 5:06 AM GMT

    నిర్మల్

    బాసర సరస్వతీ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి*

    శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి దంపతులు

    అమ్మవారి కి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి , కుటుంబ సభ్యులు

  • 21 Oct 2020 5:05 AM GMT

    అమరావతి

    మరికాసేపట్లో ‘వైయస్సార్‌ బీమా పథకం’ ప్రారంభించనున్న సీఎం జగన్

    క్యాంప్‌ ఆఫీస్‌లో ప్రారంభించనున్న సీఎం

    రైస్ కార్డు ఉన్న కుటుంబాలకు అండగా వైఎస్సార్ బీమా పథకం

    కుటుంబ పెద్దకూ జీవన భద్రత, ప్రభుత్వమే ప్రీమియమ్‌ చెల్లింపు

    అంగ వైకల్యం పొందిన వారికీ బీమా పరిహారం

  • 21 Oct 2020 5:04 AM GMT

    డీజీపీ మహేందర్ రెడ్డి

    నేటినుండి 31 వతేదీ వరకు పోలీస్ ఫ్లాగ్ డే గా రాష్ట్ర వ్యాప్తం గా పలు కార్యక్రమాల నిర్వహణ.

    దేశ అంతర్గత భద్రత కు సవాలుగా మారిన ఉగ్రవాదం, తీవ్రవాదం,వ్యవస్తీకృత నేరస్తులను ఎదుర్కోవడంలో పోలీసులు నిరంతర కృషి చేస్తున్నారు.

  • 21 Oct 2020 5:04 AM GMT

    ఎల్.బీ. ఇండోర్ స్టేడియం లో ప్రారంభమైన పోలీసు అమర వీరుల సంస్మరణ సభ. హాజరైన హోమ్ మంత్రి మహమూద్ అలీ, డీ.జీ.పీ మహేందర్ రెడ్డి, సీనియర్ పోలీసు ఉన్నతాధికారులు.

  • 21 Oct 2020 5:04 AM GMT

    సైబరాబాద్ కమీషనర్ రేట్ లో అమవీరుల స్తూపానికి నివాళులర్పించిన సైబరాబాద్ సీపీ సజ్జనార్...

    శంషాబాద్ స్రైబర్ క్రైమ్ డిసిపి రోహిణి ప్రియా దర్శిని డిసిపి ప్రకాశ్ రెడ్డి ,ట్రాఫిక్ డిసిపి విజయ్ కూమార్,

    మదాపూర్ డిసిపి వెంకట్శ్వర్లు,మరియు పోలీస్ అధికారులు పాల్గొన్నారు...

Print Article
Next Story
More Stories