Live Updates: ఈరోజు (21 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 21 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పంచమి మ.02-47 వరకు తదుపరి షష్టి | జేష్ఠ నక్షత్రం ఉ.08-21 వరకు తదుపరి మూల | వర్జ్యం: సా.04-02 నుంచి 05-34 వరకు | అమృత ఘడియలు రా.01-14 నుంచి 02-52 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-23 నుంచి 12-10 వరకు | రాహుకాలం: మ.11-23 నుంచి 12-10 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 21 Oct 2020 11:08 AM GMT
Rajath kumar: చరిత్ర లో ఎప్పుడు ఇంతటి వర్షపాతం నమోదు కాలేదు..
రజత్ కుమార్ ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి @జల సౌధ
#గత నాలుగు ఐదు రోజుల నుండి భారీ వర్షాలు పడుతున్నాయి.
#లాస్ట్ వన్ వీక్ లో చాలా వర్షపాతం నమోదు అయింది.
#నగరంలో 185 చెరువులు ఉన్నాయి,అన్ని జాగ్రత్తలు తీసుకంటున్నాం.
#185 చెరువులు పూర్తి స్థాయి లో నిండి ఉన్నాయి
#అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు 24 గంటలు మానిటరింగ్ చేస్తున్నాం
#సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 15 టీం లు ఏర్పాటు చేస్తున్నాం.
#ఈ బృందాలు అన్ని చెరువులను పరిశీలిస్తారు ,పరిశీలించడమే కాదు ఎక్కడికక్కడ చెరువులను బాగు చేసేందుకు నిధులు విడుదల చేస్తారు.
#చెరువుల పునరుద్ధరణ కు 2 కోట్లు విడుదల చేస్తారు.
#మూడు చెరువులు గండి పడినాయి, వీటిని అన్నిటినీ మరమ్మతులు చేస్తున్నాం.
#53 డ్యామేజ్ అయ్యాయి ,ముసా పెట్,బండ్ల గూడ, మాన్సూర బాద్ చెరువులు తెగినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇవి అవాస్తవం కానీ పూర్తి స్థాయిలో నిండి ఉన్నాయి.
#చెరువుల కబ్జా చేసినవాటి జోలికి మేము వెళ్లడం లేదు .చెరువుల కబ్జా పై చర్యలు చేపడుతాం.
#నగర ప్రజలకి అత్యవసర పరిస్థితి లలో నేపథ్యంలో తీసుకోవల్సిన వాటిపై దృష్టి పెట్టాం.
#శాశ్వత మరమ్మతులు కోసం 40 కోట్ల రూపాయలు అవసరం.
#హైదరాబాద్ నగరంలో 53 చెరువుల డ్యామేజ్ అయ్యాయి.
#నా విజ్ఞప్తి చెరువుల దగ్గర ఎవరు సెల్ఫీ లు దిగవద్దు,చెరువుల దగ్గరకు వెళ్లవద్దు.
- 21 Oct 2020 10:52 AM GMT
A.C.B.Court updates: ఓటుకు నోటు కేసు పై ఏసీబీ కోర్ట్ విచారణ...
ఏసీబీ కోర్ట్......
-తమ పేర్లు తొలగించాలని సండ్ర వెంకట వీరయ్య, ఉదయ సింహా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు..
-డిశ్చార్జ్ పిటిషన్లపై నేడు కౌంటరు దాఖలు చేసిన ఏసీబీ..
-ఏసీబీ ధాఖలు చేసిన కౌంటర్ పై ఈ నెల 23 న వాదనలు వింటామన్న ఏసీబీ..
-తదుపరి విచారణను ఈ నెల 23 కు వాయిదా వేసిన ఏసీబీ కోర్ట్.
- 21 Oct 2020 10:38 AM GMT
Siddipet updates: ఆర్ఎస్ కు మద్దతుగా మహిళ ల భారీ ర్యాలీ.. ర్యాలీ లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు..
సిద్దిపేట..
- దుబ్బాక పుర విధుల్లో టి ఆర్ఎస్ కు మద్దతుగా మహిళ ల భారీ ర్యాలీ.. ర్యాలీ లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు ..
- గులాబీ మయమైన దుబ్బాక పట్టణం..
- మంగళ హరతులు.. డప్పు చప్పుళ్ల తో భారీగా తరలివచ్చిన మహిళ లోకం..
- కాసేపట్లో ప్రారంభం కానున్న మహిళ బహిరంగ సభ...
- 21 Oct 2020 10:33 AM GMT
K Krishna Sagar Rao: దుబ్బాక ఉప ఎన్నికల్లో పచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది...
బీజేపీ మీడియా ప్రకటన..
-కె.కృష్ణసాగర రావు...బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి.
-కేసీఆర్ నాయకత్వం వహిస్తున్న టిఆర్ ఎస్ ప్రభుత్వం దుబ్బాక ఉప ఎన్నికల్లో పచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది.
-బీజేపీ అభ్యర్థి ఎం రఘునందన్ రావు ప్రచారానికి అప్రజాస్వామికంగా, అనైతికంగా, అక్రమ మార్గాల్లో టిఆర్ఎస్ అడ్డంకులు సృష్టించడాన్ని బీజేపీ ఖండిస్తోంది.
-దీనిపై బీజేపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేస్తుంది. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వంపై అన్ని చట్టపరమైన చర్యలనూ పరిశీలిస్తాం.
-ఈ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయం టిఆర్ఎస్ లో కనిపిస్తోంది. ప్రభుత్వంలో ఉన్నందున పోలీసులను, అధికార యంత్రాంగాన్ని అనైతికంగా వాడుకుంటూ నీతి, నిజాయితీ లేని రాజకీయాలు చేస్తోంది టిఆర్ ఎస్
-దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావుకి సమాన అవకాశాలు కల్పించకుండా, ఆయన హక్కులను కాలరాస్తూ, ఆయనపై అధికార దుర్వినియోగానికి పాల్పడితే రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ విషయంలో బాధ్యత వహించాలి.
- 21 Oct 2020 10:24 AM GMT
Nizamabad updates: పోలీసు అమరవీరుల దినోత్సవ వేడుకలు..
నిజామాబాద్..
-పోలీస్ పరేడ్ మైదానం లో ఘనంగా పోలీసు అమరవీరుల దినోత్సవ వేడుకలు
-హాజరైన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, సీపీ కార్తికేయ, కామారెడ్డి ఎస్.పి. శ్వేతా రెడ్డి.
-విధి నిర్వహణలో అమరులైన వారికి నివాళులు
- 21 Oct 2020 10:22 AM GMT
Hyderabad updates: రేపు తెలంగాణ కి కేంద్ర బృందం..
#రేపు సాయంత్రం హైదరాబాద్ కు రానున్న కేంద్ర బృందం.
#రెండు రోజుల పాటు రాష్ట్రంలోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం
#వరద ప్రాంతాల్ల నష్టం తీవ్రతను అంచనా వేయనున్న కేంద్ర బృందం.
#ఈ 13వ తేదీ నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో 5 వేల కోట్ల మేర నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం...
#తక్షణ సహాయంగా 1350 కోట్ల ను విడుదల చేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి లేఖ రాసిన సీఎం కేసీఆర్
#ఈ నేపథ్యంలో నే కేంద్ర బృందం రాక
- 21 Oct 2020 10:19 AM GMT
Hyderabad updates: హైదరాబాద్ లో గంగమ్మ తల్లి కి పూజలు...
హైదరాబాద్..
-నగరం లో పెద్ద ఎత్తున్న వరదలు వస్తుండడంతో మూసి నది ఒడ్డున ఉన్న గంగమ్మ తల్లి కి పూజలు చేస్తున్న నగర మంత్రులు, మేయర్ , మేయర్
-1908 లో వరదల సమయంలో పూజలు చేసిన నిజాం రాజులు
-మళ్ళి అలాంటి వరదలు రావడంతో పండితుల సూచన మేరకు గంగమ్మ తల్లి పూజలు
- 21 Oct 2020 9:48 AM GMT
Mahabubabad district updates: కిడ్నప్ అయ్యిన బాలుడి తల్లికి ఫోన్ చేసిన ఆగంతకుడు!
మహబూబాబాద్ జిల్లా...
-డబ్బులు రెడి అయ్యాయా?
-డబ్బులు రెడి చేసుకోండి.. రేపు మళ్ళీ ఫోన్ చేసి చెప్పుతా ఎక్కడికి తీసుకరవాలో అని చెప్పినట్లు సమాచారం.
-నిన్న 12 గంటల తరువాత ఈరోజు 8.30 ఫోన్ వచ్చింది.
-11.గంటలకు ఫోన్ చేస్తా ఆనంటుగానే కాల్ చేసిన కిడ్నాపర్.. 45 లక్షలు రెడీ చేసినట్లు వీడియో తీసి రెడీ చెయ్యాలి అని ఆదేశించిన కిడ్నపర్..
- 21 Oct 2020 9:32 AM GMT
Jurala Project updates: జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద...
మహబూబ్ నగర్ జిల్లా :
-26 గేట్లు ఎత్తివేత..
-ఇన్ ఫ్లో: 3, 54,000 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో: 3,75,079 వేల క్యూసెక్కులు.
-పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం:
-9.657 టీఎంసీ.
--ప్రస్తుత నీట్టి నిల్వ: : 8.396 టీఎంసీ.
-పూర్తి స్థాయి మట్టం: 318.516 మీ.
-ప్రస్తుత నీటి మట్టం: 317.890 మీ.
- 21 Oct 2020 9:24 AM GMT
Hyderabad updates: ఎమ్మెల్యే క్వార్టర్స్ లో స్వల్ప అగ్ని ప్రమాదం!
హైదరాబాద్..
-హైదరాబాద్ ఆదర్శనగర్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో స్వల్ప అగ్ని ప్రమాదం.
-మంటలు ఆర్పేసిన అగ్నిమాపక సిబ్బంది.
-ఆంద్రప్రదేశ్ కి చెందిన మాజీ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏసీ లో షాట్ సర్క్యూట్ కావడం వల్లా అగ్నిప్రమాదం...
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire