Live Updates: ఈరోజు (21 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 21 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 21 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పంచమి మ.02-47 వరకు తదుపరి షష్టి | జేష్ఠ నక్షత్రం ఉ.08-21 వరకు తదుపరి మూల | వర్జ్యం: సా.04-02 నుంచి 05-34 వరకు | అమృత ఘడియలు రా.01-14 నుంచి 02-52 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-23 నుంచి 12-10 వరకు | రాహుకాలం: మ.11-23 నుంచి 12-10 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 21 Oct 2020 2:41 PM GMT
Karimnagar updates: నూతన పాలకవర్గం సమావేశం లో నాయకులకు ఈటెల హితవు..
కరీంనగర్ :
* మంత్రి ఈటెల రాజేందర్ కామెంట్స్
*జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గం సమావేశం లో నాయకులకు ఈటెల హితవు
* ప్రజా ప్రతినిధి గెలవడం అనేది ఓ ఛాయిస్ కాదు ఓ ఛాన్స్ లా గెలిచేలా ఉండాలి
* గెలుస్తా అనుకుంటే గెలవాలి..అలా ఉండాలి రాజకీయం అంటే
* రాజకీయాల్లో అయన ఉడొద్దు ఈయన ఉండొద్దు అంటూ చర్చలు జరుగుతూనే ఉంటాయి
* కానీ రాజేందర్ అంటే ఎప్పుడు రాజేందరే
* నేను ఎకనామిస్ట్ కాదు అయినా ఆర్ధిక శాఖ మంత్రి గా పని చేశా
* ఆరోగ్య శాఖ మంత్రి గా ఎన్ని నెగిటివ్ వార్తలు వచ్చిన అందులో పాజిటవ్ ని వెతుకుని పనిచేశా
* ఒళ్ళుమంచి పని చేసినవాడే ధర్మం తప్పనివాడు ..అలాంటివారికి ఎప్పుడు అపజయం ఉండదు
- 21 Oct 2020 12:53 PM GMT
Jaggareddy: దుబ్బాక లో కాంగ్రెస్-బీజేపీ-టీఆరెస్ మద్యే పోటీ...
* జగ్గారెడ్డి ఎమ్మెల్యే అసెంబ్లీ మీడియా పాయింట్
* దుబ్బాకలో టీఆరెస్ అభ్యర్థి మళ్ళీ గెలిస్తే రాష్ట్ర ప్రజలకు శాపం కానుంది.
* సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కేసీఆర్ కు పెద్దకొడుకు పాత్ర పోషిస్తున్నారు.
* దుబ్బాక లో టీఆరెస్ గెలుపు ఖాయం అయింది--మెజారిటీ మాత్రమే అని మంత్రి హరీష్ రావు ప్రచారం చేస్తున్నారు.
* దుబ్బాక లో టీఆరెస్ ధీమా ప్రచారం పోలీసులు- కలెక్టర్ సపోర్ట్ చేస్తున్నారు.
* దుబ్బాక లో టీఆరెస్ గెలిస్తే- మళ్ళీ వచ్చే ఎన్నికల్లో టీఆరెస్ కు సీఎం పీఠం ఇచ్చినట్లే.
* టీఆరెస్ ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చకున్నా కారు గెలిస్తే మళ్ళీ కేసీఆర్ కాలర్ ఎగరేస్తడు.
* ప్రభుత్వం చేసిన వైఫల్యాలను కాంగ్రెస్ ప్రజల్లోకి తెచ్చినా ప్రజలు పట్టించుకోపోతే రాష్ట్రాన్ని ఎవ్వరూ కాపడలేరు.
* రాష్ట్ర ప్రజలందరూ దుబ్బాక లో ఉన్న కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి టీఆరెస్ ను ఓడించమని చెప్పండి.
* ఉస్మానియా- కాకతీయ విద్యార్థి పిల్లలు ఎక్కడ ఉన్నారు--ఉద్యమంలో టీఆరెస్ అన్నారు ఉద్యోగం రాలేదు...ఇప్పుడైనా మేల్కొండి.
* దుబ్బాక లో కాంగ్రెస్ గెలిస్తే ప్రజలకు మేలు జరుగుతధి--టీఆరెస్ గెలిస్తే ఇంతకంటే ఎక్కువ వరదలు వస్తాయి.
* దుబ్బాక ప్రజలు తమ జీవితాలు మార్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది.
* దుబ్బాక లో టీఆరెస్ ఓడిపోతే హరీష్ రావు మంత్రి పదవి ఉండదు- వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట టిక్కెట్టు ఉండదు.
* దుబ్బాక ఉపఎన్నిక హరీష్ రావు రాజకీయ జీవితం ముడిపడి ఉంది.
- 21 Oct 2020 12:47 PM GMT
Siddipet updates: ఔదార్యం చాటుకున్న సినీ ఆర్టిస్ట్ సంపూర్ణేష్ బాబు..
సిద్దిపేట:
- హైదరాబాద్ వరద బాధితులకు సహాయంగా 50వేలు సీఎం రిలీఫ్ ఫండ్ కు మంత్రి హరీష్ రావు కు చెక్ అందించిన సంపూర్ణేష్ బాబు..
- మానవత్వాన్ని చాటుకున్న సంపూర్ణేష్ ను అభినందించిన మంత్రి హరీష్ రావు
- 21 Oct 2020 11:51 AM GMT
K. Chandrashekar Rao: అపోలో హాస్పిటల్ కి చేరుకున్న సీఎం కేసీఆర్..
-- మాజీ హోమ్ మంత్రి నాయిని నరసింహ రెడ్డిని పరామర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్
-- నాయిని ఆరోగ్యంపై కుటుంబసభ్యులతో మాట్లాడిన కేసీఆర్..
-- డాక్టర్లను అడిగి నాయిని ఆరోగ్యంపై ఆరాతీసిన కేసీఆర్...
-- గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో అపోలోలో ఐసియు లో చికిత్స పొందుతున్న నాయిని...
- 21 Oct 2020 11:48 AM GMT
Hyderabad updates: భారీ వర్షాలు వల్ల పట్ల ఆందోళన వ్యక్తం చేసిన మాజీ గవర్నర్ ఈ.ఎస్.ఎల్ నరసింహన్..
హైదరాబాద్..
-హైదరాబాద్ లో భారీ వర్షాలు, వరదల వల్ల నెలకొన్న పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేసిన మాజీ గవర్నర్ ఈ.ఎస్.ఎల్ నరసింహన్ .
-బాధిత ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న సహాయ పునరావాస కార్యక్రమాలను అభినందించిన నరసింహన్.
-సహాయ కార్యక్రమాల కోసం తన వంతు సహాయంగా తన వ్యక్తిగత సేవింగ్స్ నుండి 25 వేల రూపాయలను సి.ఎం.ఆర్.ఎఫ్ కు అందించిన నరసింహన్.
-మాజీ గవర్నర్ ఈ.ఎస్.ఎల్ నరసింహన్ కు కృతగ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్.
- 21 Oct 2020 11:45 AM GMT
K.Narayana: దసరా ఉత్సవాలు చాలా ప్రాముఖ్యమైనవి.
-డాక్టర్ కె.నారాయణ సిపిఐ జాతీయ కార్యదర్శి..
-ఎక్కువ మంది కోస్తా, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణలో ఉన్నారు...
-ప్రతి సంవత్సరం దసరా పండుగకు వారి సొంతూళ్లకు వెళ్తుంటారు...
-తెలంగాణలో బతుకమ్మ పండుగ ఎంత ప్రసిద్దో దసరా సంక్రాంతి ఆంధ్రప్రదేశ్ లో కూడా అంతే ఫేమస్...
-రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు బస్సులు ఎలా నడిపించాలి అనే చర్చ వచ్చింది...
-ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లక్ష కిలోమీటర్లు ఎక్కువ తిరిగే అవకాశం ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర మీరు ఎక్కువ సర్వీసులు తిప్పటం వల్ల నష్టం వాటిల్లుతుందని చెబుతుంది...
-ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మీరు ఎక్కువ సర్వీసులు నడిపించు కోండి, లేకపోతే మాకు అవకాశం ఇవ్వండి టాక్సీలు ఎక్కవ చెల్లిస్తామంటున్నారు..
-రెండు రాష్ట్రాలు బస్సులు తిప్పక పోవడం వల్ల ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు దాదాపు 50-60 కోట్ల రూపాయలు లాభాలు పొందే అవకాసం వుందనే వాదన కు బలం చేకూరుతుంది...
-ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇద్దరు మిత్రులే. ప్రజల కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకొని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను...
- 21 Oct 2020 11:37 AM GMT
Nirmal district updates: చిరుత పులి సంచారం!
నిర్మల్ జిల్లా//
సారంగాపూర్:-
-మండలంలోని జౌలీ బీట్, లక్ష్మీ పూర్ గ్రామాలలో చిరుత సంచారం..
-అడవుల్లో మేత మేయడానికి వెళ్లిన అవుపై దాడి చేసి చంపిన చిరుత పులి..
-అందోళన చెందుతున్న ప్రజలు
- 21 Oct 2020 11:34 AM GMT
Mulugu district updates: వెంకటాపురం ప్రధాన రహదారి పై వాహనాల తనిఖీలు..
ములుగు జిల్లా..
-భద్రాచలం వెంకటాపురం జాతీయ ప్రధాన రహదారి పై వాహనాలను ముమ్మరంగా తనిఖీలు,
-ఏజెన్సీ ప్రాంతం కావడం తో అనుమానిత వ్యక్తిలను వివరాలను తెలుసుకుంటున్నా పోలీసులు.
-ఇటువల జరిగిన ఎన్కౌంటర్ తో అప్రమత్తం అయిన వెంకటాపురం సర్కిలు పోలీసులు .
-తెలంగాణ చత్తీస్ గడ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు పోలీసులు.
- 21 Oct 2020 11:28 AM GMT
Adilabad district updates: ఎమ్మెల్యే జోగురామన్న మీడియా సమావేశం..
ఆదిలాబాద్..
-బిజెపి ఒబిసి జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పై మండిపడ్డ ఎమ్మెల్యే రామన్న
-దేశంలో అరవై శాతం ఉన్న బీసీలకు ఒరుగబెట్టింది ఏమిలేదు..
-దేశంలో చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసింది..
-అయినా కేంద్రం ప్రభుత్వం స్పందించలేదు..
-తెలంగాణ సర్కార్ బీసీలకు ఎంతో ప్రాదాన్యత ఇచ్చింది..
-తెలంగాణ సర్కార్ బీసీలకు అన్యాయం చేస్తుందని చెప్పడం అబద్దం..
-దేశంలో బీసీ సంక్షేమ శాఖను ఏర్పాటు చేయాలని కోరిన పట్టించుకోవడం లేదు..
-బీసీల అభివృద్ధి పై లక్ష్మణ్ తో బహిరంగ చర్చ సిద్దం..
-సవాల్ కు లక్ష్మణ్ స్పందించాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే రామన్న
- 21 Oct 2020 11:22 AM GMT
Harish Rao Comments: దుబ్బాకలో దుమ్ము లేచిపోయింది!
సిద్దిపేట జిల్లా:
//కిరాయి...పరాయి మనుషులతో కాంగ్రెస్, బిజెపి ప్రచారం చేస్తున్నారు
//అన్ని వర్గాల వర్గాల మద్దతు టిఆర్ఎస్ కు ఉంది
//సుజాతను గెలిపించి మహిళా శక్తిని చాటాలి
//సిఎం కేసీఆర్ దుబ్బాకలో పుట్టి పెరిగిండు
//ఉత్తమ్,బండి.సంజయ్ కు దుబ్బాక గురించి ఏం తెలుసు
//ఇంటింటికీ తాగునీటి ఇచ్చిన ఘనత కేసీఆర్ కు దక్కింది
//చేతకాని దద్దమ్మలు కాంగ్రెస్, బిజెపి నేతలు
//ఫించన్లలో కేంద్రం వాటా లేనే లేదు
//బిజెపి సోషల్ మీడియా పుకార్ల పుట్ట...అబద్ధాల గుట్ట
//బిజెపి పాలిత రాష్ట్రం...నరేంద్ర మోడి రాష్ట్రంలో రూ.500
//బతుకమ్మకు పెద్ద కొడుకులా చీరలు ఇచ్చిండు కేసీఆర్
//కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో లేని ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చాం
//కళ్యాణ లక్ష్మీ...
//కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో లేనే లేవు
//సిద్దిపేట//దుబ్బాక ఆసుపత్రి కోసం రూ.18కోట్లు మంజూరు చేశాం
//కాంగ్రెస్, బిజెపి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన హరీష్ రావు
//ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చింది టిఆర్ఎస్
//బిజెపి బాయిల దగ్గర మీటర్లు పెడతామంటున్నారు
//కరోనా వస్తే మనిషికి 10కిలోల బియ్యం ఇచ్చి ఆదుకున్నాం
//దుబ్బాక నియోజకవర్గాన్ని రామలింగారెడ్డి అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు
//బిజెపి నేతలు ఇళ్ళల్లో కూర్చొని మాట్లాడడం కాదు
//క్షేత్ర స్థాయిలో తిరిగితే రామలింగారెడ్డి చేసిన అభివృద్ధి బిజెపి నేతలకు తెలుస్తోంద
//మరింతగా అభివృద్ధి జరగాలంటే సుజాతక్కను భారీ మెజారిటీతో గెలిపించాలి
//ఉత్తమ్, బిజెపి నేతలు వానా కాలం ఉసిల్ల లాగా...ఎన్నికలప్పుడు వస్తరు
//ఎన్నికల తర్వాత ఉండేది టిఆర్ఎస్ నేతలే
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire