Live Updates: ఈరోజు (21 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 21 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పంచమి మ.02-47 వరకు తదుపరి షష్టి | జేష్ఠ నక్షత్రం ఉ.08-21 వరకు తదుపరి మూల | వర్జ్యం: సా.04-02 నుంచి 05-34 వరకు | అమృత ఘడియలు రా.01-14 నుంచి 02-52 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-23 నుంచి 12-10 వరకు | రాహుకాలం: మ.11-23 నుంచి 12-10 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 21 Oct 2020 5:03 AM GMT

    మహబూబాబాద్ జిల్లా.

    మహబూబాబాద్ లో కిడ్నాపైన 9ఏళ్ల బాలుడు దీక్షిత్ కేస్ లో ఇంకా వీడని మిస్టరీ.

    మూడు రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు లభించని

    దీక్షిత్ ఆచూకీ..

    నిందితుల ఆచూకీ కోసం రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ టీం...

    మహబూబాద్ చేరుకొని నిందితుల ఆచూకీ కోసం ట్రేసింగ్ మొదలుపెట్టిన సైబర్ క్రైమ్ టీం.

    పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు..ఐనా ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఆందోళన చెందుతున్న బాలుడి కుటుంబ సభ్యులు.

    45లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు..

    రెండు రోజుల నుండి

    ఇప్పటివరకు ఎలాంటి ఫోన్ కాల్స్ రాకపోవడంతో ఆందోళన చెందుతున్న దీక్షిత్ తల్లిదండ్రులు, పోలీసులు..

    దీక్షిత్ ఆరోగ్యం పై ఆందోళన వ్యక్తం చేస్తు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు.

  • 21 Oct 2020 5:03 AM GMT

    సూర్యాపేట జిల్లా.

    పులిచింతల ప్రాజెక్టు సమాచారం

    *13 గేట్లు 4 మీటర్ల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల..

    * ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం: 45.77 టీఎంసీలు.

    ప్రస్తుతం నీటి నిల్వ 44.5380 టీఎంసీలు

    పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు

    ప్రస్తుతం నీటి మట్టం 174.210 అడుగులు నిలువ

    * ఇన్ ప్లో: 3,55,274 క్యూసెక్కులు.

    *అవుట్ ఫ్లో: 3,55,274 క్యూసెక్కులు.

    *విద్యుత్ ఉత్పాదన ద్వారా 8 వేల క్యూసెక్కుల నీటి విడుదల.

  • 21 Oct 2020 5:02 AM GMT

    కరోనాతో మరో కానిస్టేబుల్ మృతి

    ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న రాము (31) అనే కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. 15 రోజులుగా ఓ ప్రేవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయ్యాడు. నిన్న రాత్రి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో అదే హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. రాత్రి రెండు గంటల సమయంలో శ్వాస అందక మృతి చెందాడు.

  • 21 Oct 2020 5:02 AM GMT

    హైదరాబాద్

    ఇరు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం ఈ రోజు కొలిక్కి వచ్చే అవకాశం...

    ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడపడం కోసం నిన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆర్టీసీ అధికారులు టెలీ కాన్ఫరెన్స్ లో సమావేశం...

    అంతర్రాష్ట్ర ఒప్పందం పై తుది దశకు చేరుకున్న చర్చలు...

    ఈరోజు మరోసారి టేలికాన్ఫరెన్స్ సమావేశమై ఒప్పందంపై ఫైనల్ చేయనున్నారు..

    పండగ కోసం తాత్కాలిక బస్సులా..? లేదంటే శాశ్వత ఒప్పంద మా మధ్యాహ్నం ఒకరికి వచ్చే అవకాశం...

    పండగ నేపథ్యంలో లో ఇరు రాష్ట్రాల మధ్య రేపటి నుండి బస్సులు నడిచే అవకాశం బెంగళూరు కూడా నడవనున్న సర్వీసులు

  • 21 Oct 2020 5:01 AM GMT

    నిజామాబాద్ జిల్లా:

    శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం

    16 వరద గేట్లు ఎత్తేసిన అధికారులు

    ఇన్ ఫ్లో 37837 క్యూసెక్కులు

    ఔట్ ఫ్లో 62827 క్యూసెక్కులు

    ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు.

    నీటి సామర్థ్యం 90 టీఎంసీల

    జూన్ నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి చేరిన 336 టీఎంసీలు.

    210 టీఎంసీలను వరద గేట్ల ద్వారా గోదావరి లోకి వదిలిపెట్టిన అధికారులు

  • 21 Oct 2020 5:01 AM GMT

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో వాకర్స్ ను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు నమోదు చేసుకోవాల్సిందిగా అభ్యర్థించిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్.

  • 21 Oct 2020 3:39 AM GMT

    వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో స్కంద మాత అలంకారంలో అమ్మవారు

    రాజన్నసిరిసిల్లజిల్లా

    - వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రులు సందర్భంగా

    - 5 వ రోజు స్కంద మాత అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు

    - స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం

    - శ్రీ రాజరాజేశ్వరిదేవి కి శ్రీసూక్తం శ్రీ దుర్గా సూక్తం ద్వారా లలిత సహస్ర నామ అష్టోత్తర శతనామ సహిత చత్యుస్ట ఉపచార పూజ నిర్వహిస్తున్న ఆలయ అర్చకులు

Print Article
Next Story
More Stories