Live Updates: ఈరోజు (20 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం | 20 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | చవితి సా.04-40 వరకు తదుపరి పంచమి | అనూరాధ నక్షత్రం ఉ.09-37 వరకు తదుపరి జేష్ఠ | వర్జ్యం: మ.02-55 నుంచి 04-25 వరకు | అమృత ఘడియలు మ.12-01 నుంచి 01-42 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-17 నుంచి 09-04 వరకు తిరిగి రా. 10-32 నుంచి 11-19 వరకు | రాహుకాలం: మ.03-00 నుంచి 04-30 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 20 Oct 2020 3:16 PM GMT
Vijayawada updates: బెజవాడలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు..
విజయవాడ..
-పోరంకిలో క్రికెట్ బెట్టింగ్ స్ధావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
-ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
-3.88లక్షలు నగదు స్వాదీనం
-10 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, టీవీ సీజ్
-క్రికెట్ మజా యాప్ ద్వారా ఆన్ లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు
- 20 Oct 2020 2:57 PM GMT
Vijayawada updates: మహేష్ కేసులో పురోగతి!
విజయవాడ..
-ఇద్దరు నిందితులను గుర్తించిన పోలీసులు
-మీడియా ముందుకు వివరాలు అందించనున్న విజయవాడ సీపీ శ్రీనివాసులు
- 20 Oct 2020 2:46 PM GMT
Pothina Mahesh: జగన్ సర్కార్ బీసీలపై కపట ప్రేమ వలకబోస్తోంది!
విజయవాడ...
-జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్
-బిసి లలో ప్రతికులానికి డైరెక్టర్ పదవులంటూ కొత్తనాటకానికి తెరతీసారు ముఖ్యమంత్రి జగన్
-జగన్ సర్కార్ ప్రత్యక్ష రాజకీయాలలో 20 వేలమంది బీసీ లకు అన్యాయం చేశారు
-10 శాతం బీసీల రిజర్వేషన్ తొలగించి అన్యాయం చేశారు
-జగన్ ప్రభుత్వం బీసీల వ్యతిరేక ప్రభుత్వం
-బిసి సబ్ ప్లాన్ నిధులన్నీ నవరత్నాలకోసం తరలించారు
-బిసి ల కార్పొరేషన్...ఖాళీ కార్పొరేషన్
-నిధులులేని 56 బిసిల కార్పొరేషన్ వల్ల బీసీలకు ఏమి ప్రయోజనం లేదు
-బిసి కార్పొరేషన్ ఓ బోగస్ కార్పొరేషన్
-రాష్ట్రంలో రెడ్ల శాసనాలు,పెత్తనాలు జరుగుతున్నాయి
-ఆర్ కృష్ణయ్య వ్యక్తిగత ప్రయోజనాలకోసం జగన్ ని పొగడడం హాస్యాస్పదం
-బీసీలకు అన్యాయం చేస్తున్న జగన్ సర్కార్ ను ఆర్ కృష్ణయ్య ప్రశ్నించకపోతే చరిత్రలో బీసీ ద్రోహిగా మిగిలిపోతారు
-జగన్ రెడ్డికి బీసీ లపై చిత్తశుద్ధి ఉంటే విదేశీ విద్య పథకాన్ని ఎందుకు తీసివేశారు?
-బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు
-జగన్ కుట్రలు,కుతంత్రాలు తిప్పికొట్టాలని బీసీ సోదరులను కోరుకుంటున్నాను
- 20 Oct 2020 2:37 PM GMT
Kurnool district updates: cpi పార్టీ ఆద్వర్యంలో కలెక్టరేట్ వద్ద లబ్ధిదారులు ఆందోళన!
కర్నూలు..
-ప్రభుత్వం tidko గృహాలను నిర్మించిన ఇంతవరకు లబ్ధిదారులకు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారంటూ సీపీఐ పార్టీ నిరసన.
-లబ్ధిదారులకు ఇల్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కర్నూల్ cpi పార్టీ ఆద్వర్యంలో కర్నూల్ కలెక్టరేట్ వద్ద లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు..
- 20 Oct 2020 9:57 AM GMT
Vijayawada updates: భక్తుల భద్రతకే అధిక ప్రాధాన్యత: మంత్రి వెల్లంపల్లి!
విజయవాడ..
-మూలా నక్షత్రం రోజున సీఎం చేతుల మీదుగా అమ్మవారికి పట్టు వస్త్రములు
-దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఏర్పాట్లను హైదరాబాద్ నుండి ఫోన్‌లో సమీక్షించిన మంత్రి వెలంపల్లి
-దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలి
-ప్రతి భక్తుడికి అమ్మవారి దర్శనం జరిగేలా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించిన మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు .
-దసరా ప్రారంభమై గత మూడు రోజులుగా చేసిన ఏర్పాట్లు, భక్తుల విషయంలో తీసుకున్న చర్యలపై మంత్రి ఆరా
-అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల దర్శనం విషయంలో రాజీ లేకుండా అన్నీ నిబంధనలు పాటించాల ని అధికారులకు మంత్రి సూచన
- 20 Oct 2020 9:44 AM GMT
Amaravati updates: సీఎం వైయస్ జగన్ స్పందన కార్యక్రమం..
అమరావతి..
-జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం వైయస్ జగన్ స్పందన కార్యక్రమం.
-క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీఎం
-పాల్గొన్న డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, సీఎస్ నీలం సాహ్ని, ఇతర ఉన్నతాధికారులు.
-7 ప్రధాన అంశాలపై సమీక్ష నిర్వహించిన సీఎం.
-వర్షాలు, కోవిడ్, ఎన్‌ఆర్‌ఈజిఎస్, నాడునేడు, విలేజీ, వార్డు సెక్రటేరియట్స్ తనిఖీలు తదితర అంశాలు
-వర్షాలకు సంబంధించి కలెక్టర్లుతో ప్రత్యేకంగా ఈ నెల 14న సమీక్ష నిర్వహించాం.
-కూలిన ఇళ్లు ఎక్కడ ఉన్నాయో.. .వారికి వెంటనే సాయం చేయండి
-కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లందరూ31 అక్టోబరులోగా పంట నష్టానికి సంబంధించి అంచనాలు పూర్తి చేయండి.
-వెంటనే రోడ్ల మరమ్మత్తులు మొదలుపెట్టండి ఆర్ అండ్ బి, పంచాయితీరాజ్ రోడ్లపై ధ్యాస పెట్టండి.
-కరెంటు పునరుద్ధరణ కలెక్టర్లు వేగంగా చేశారు. కలెక్టర్లందరికీ అభినందనలు.
-కలెక్టర్లకు, జేసీలకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాం.
-ఈనెల 27న రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం.
- 20 Oct 2020 9:25 AM GMT
Andhra pradesh updates: ఏపీ నుంచి చేరుకున్న ఎన్ డిఆర్ఎఫ్ బృందాలు!
ఆంధ్ర ప్రదేశ్..
-వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఏపీ నుంచి చేరుకున్న ఎన్ డిఆర్ఎఫ్ బృందాలు...
-37 బోట్లను పంపిన ఏపీ ప్రభుత్వం...
-రవింద్రభారతి లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు...
-24గంటల నిరంతర పర్యావేక్షణ చేసేందుకు 4 అధికారుల బృందం..
-గజ ఈతగాళ్ళు ,రెస్క్యూ టీం లను అందుబాటులో ఉంచిన ప్రభుత్వం...
- 20 Oct 2020 9:18 AM GMT
Nellore district updates: వ్యవసాయ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది!
నెల్లూరు :--
-ఏపీ పీసీసీ ఛీఫ్ శైలజనాద్ కామెంట్స్
-కేంద్రం ప్రభుత్వం అమోదించిన వ్యవసాయ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది
-దేశ వ్యాప్తంగా రైతుల మద్దతు గా 2 కోట్లు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టాము
-దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి
-కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు రైతుల ను కొంతమంది ధనవంతు చేతిలోనికి తీసుకొనిపోతున్నారు
-జగన్మోహన్ రెడ్డి నువు రైతుల పక్షపాతి కాదు రైతుల వ్యతిరేకివి
-RSS మనసా పుత్రుడు జగన్మోహన్ రెడ్డి
-రైతులకు పెట్టె మీటర్లను కాంగ్రేస్ పార్టీ అడుకుంటాం
- 20 Oct 2020 8:52 AM GMT
Annavaram updates: ప్రైవేటు వెబ్‌సైట్‌లో దేవస్థానం వివరాలు పెట్టడంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన దేవస్థానం అధికారులు..
తూర్పుగోదావరి..
-ఓ ప్రైవేటు వెబ్‌సైట్‌లో అన్నవరం దేవస్థానం వివరాలు పెట్టడంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అన్నవరం దేవస్థానం అధికారులు
-భక్తులను అయోమయానికి గురి చేసే విధంగా ధరలతో పాటు ప్రైవేటు ఫోన్ నంబరు పెట్టడంపై అభ్యంతరం తెలిపిన అధికారులు
-గో తిరుపతి.కామ్ వెబ్‌సైట్‌లో పలు దేవస్థానాల వివరాలతో పాటు అన్నవరం దేవస్థానం వివరాలు కూడా ఉన్నాయని అధికారులు గుర్తింపు
-అందులో అన్నవరం మ్యారేజీ ప్యాకేజీ, అన్నవరం దేవస్థానం మ్యారేజీ హాల్స్ కాలమ్స్‌లో చిత్రాలతో పాటు వాటి ధరలు కూడా పెట్టారని పేర్కొన్న అధికారులు
-వివరాల కోసం సంప్రదించాలని ప్రైవేటు ఫోన్ నంబరు కూడా పెట్టడంతో అప్రమత్తమైన అధికారులు
-దీనివల్ల భక్తులు అయోమయానికి గురవ్వడంతో పాటు, మోసపోయే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్న దేవస్థానం అధికారులు.
-ఈ నేపథ్యంలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఈవో వి.త్రినాథరావు
-అదేవిధంగా శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి భక్తి ఛానల్‌కు సిబ్బంది కావాలని ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రచార పత్రంలో స్వామివారి లోగో వాడారన్న దానిపై కూడా స్థానిక పోలీసులకు ఫిర్యాదు
- 20 Oct 2020 6:59 AM GMT
అమరావతి
పోలీసు అమర వీరుల దినోత్సవం సందర్భంగా రేపటి నుంచీ చేయబోయే కార్యక్రమాలపై మాట్లాడనున్న డీజీపీ
సంక్షేమ పధకాలు, కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ప్రాధాన్యత వివరణ
పోలీసు శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించనున్న డీజీపీ
అసువులు బాసిన అమర వీరులకు జోహార్లు తెలుపుతూ చేయనున్న కార్యక్రమాల వివరణ
2016 to 2020 సెప్టెంబరు వరకూ 18% నేరాల సంఖ్య తగ్గింది
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire