Live Updates: ఈరోజు (20 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం | 20 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | చవితి సా.04-40 వరకు తదుపరి పంచమి | అనూరాధ నక్షత్రం ఉ.09-37 వరకు తదుపరి జేష్ఠ | వర్జ్యం: మ.02-55 నుంచి 04-25 వరకు | అమృత ఘడియలు మ.12-01 నుంచి 01-42 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-17 నుంచి 09-04 వరకు తిరిగి రా. 10-32 నుంచి 11-19 వరకు | రాహుకాలం: మ.03-00 నుంచి 04-30 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 20 Oct 2020 6:59 AM GMT
విజయవాడ
డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ తో రెవిన్యూ ఉద్యోగుల సంఘం భేటీ
రెవెన్యూ ఉద్యోగులు క్షేత్ర స్థాయి సమస్యలను వివరించాము
ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం భూముల రీ సర్వే చేపడుతోంది
అది ముగిసే వరకు రెవెన్యూ ఉద్యోగులకు వేరే విధులు కేటాయించొద్దని కోరాం
క్రమశిక్షణ చర్యలు కు గురైన ఉద్యోగుల పై శాఖ పరమైన విచారణ జరపకుండా కాలయాపన చేస్తున్నారు
ఉద్యోగులు సర్వీస్ పూర్తయిన విచారణలు పూర్తికాక పెన్షన్ కూడా రాణి పరిస్థితి ఉంది
త్వరగా విచారణలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరాం
తహశీల్దార్లు కు నిధులు పూర్తి స్థాయిలో రాక పడుతున్న ఇబ్బందులు వివరించామ్
బొప్పరాజు వెంకటేశ్వర్లు, రెవెన్యూ ఉద్యోగులు సంఘం అధ్యక్షుడు
- 20 Oct 2020 6:58 AM GMT
విశాఖ
సిఎం జగన్ బీసీ లను 56 కులాలుగా వర్గీకరణ చేయడంపై దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేషుకుమార్ హర్షం
జగదాంబా కూడలి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం
జగదాంబ కూడలి నుంచి పూర్ణామార్కెట్ వరకు భారీ ర్యాలీ
ర్యాలీకి భారీగా హాజరైన బిసిలు
పాల్గొన్న కార్పొరేటర్ అభ్యర్థులు, బిసి నాయకులు పాల్గోన్నారు
- 20 Oct 2020 6:58 AM GMT
గుంటూరు....
సచివాలయ ఉద్యోగి పై వాలంటీర్ దాడి
గుంటూరు జిల్లా అమరావతి మండలం యండ్రాయి సచివాలయంలో వాలంటీర్ వీరంగం...
సచివాలయం లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ బాబూరావు పై దాడి చేసిన వాలంటీర్ వినోద్...
రేషన్‌కార్డు దరఖాస్తులు పరిశీలించాలని డిజిటల్ అసిస్టెంట్ బాబూరావుకు ఇచ్చిన వాలంటీర్...
దరఖాస్తులు తరువాత పరిశీలిస్తానంటూ పక్కనపెట్టిన సచివాలయ ఉద్యోగి...
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటు పంచాయతీ సెక్రటరీ ఎదుట దాడిచేసిన వాలంటీర్ వినోద్...
- 20 Oct 2020 6:57 AM GMT
అమరావతి
ఆప్కో,లేపాక్షి ఆన్లైన్ వెబ్ స్టోర్ ను నేడు ప్రారంభించనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.
రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా చేనేత,హస్త కళల ఉత్పత్తుల అమ్మకాలు.
క్యాంపు కార్యాలయం నుండి కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం.
ఆన్లైన్ లో అమ్మకాలు చేపట్టడం ద్వారా
చేనేత,హస్త కళల కళాకారుల ఉత్పత్తుల తయారీ దారులకు గిట్టుబాటు ధరలు కల్పించడం,జీవనభృతి కల్పించేలా చర్యలకు శ్రీకారం చుట్టనున్న ప్రభుత్వం.
10 కోట్ల విలువైన చేనేత, హస్త కళల ఉత్పత్తులను ఆన్లైన్ వెబ్ స్టోర్ లో ఉంచనున్న ప్రభుత్వం.
ప్రముఖ ఈ కామర్స్ ఆన్లైన్ స్టోర్ల ద్వారా చేనేత, హస్త కళల ఉత్పత్తుల అమ్మకాలు.
- 20 Oct 2020 6:57 AM GMT
అమరావతి
మరికొద్ది సేపట్లో క్యాంపు కార్యాలయం నుండి స్పందనపై వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించనున్న సీఎం.
రాష్ట్రంలో వర్షాలు, వరదల సహాయక చర్యలపై సమీక్ష చేయనున్న సీఎం.
స్కూల్స్,ఆసుపత్రులు,అంగన్వాడీ లో నాడు- నేడుపై సమీక్ష చేయనున్న సీఎం.
గ్రామ సచివాలయాలు,
ఆర్బికే,విలేజ్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణాల ప్రగతిపై సమీక్ష.
ఈనెల 21వ తేదీన ప్రారంభం కానున్న వైస్సార్ బీమా పథకంపై సమీక్ష చేయనున్న సీఎం
- 20 Oct 2020 6:56 AM GMT
విశాఖ
తినడానికి తిండి లేని పేదోడి పేరిట వెయ్యి ఎకరాలు చూపిస్తున్న రికార్డు లు పేరిట హెచ్ ఎం టీవీ లో ప్రసారం చేసిన కథనానికి స్పందన
అగనం పూడిలో వెయ్యి ఎకరాలు భూమి ఆధార్ కు లింక్ అయిందని లక్ష్మీ అనే పేద మహిళ కుటుంబానికి అన్ని ప్రభుత్వ పథకాలకు అనర్హులు గా ప్రకటన
దీంతో లక్ష్మి కుటుంబానికి మద్దతుగా నిలిచిన రాజకీయ పక్షాల నేతలు
అగనంపూడి లక్మీ నివాసానికి వెళ్లి సమస్య పరిష్కారానికి మద్దతు తెలిపిన బిజెపి నాయకులు కె.ఎన్.రావు, వామపక్షాలు
పేద కుటుంబం సమస్యని వెలుగు లోకి తెచ్చిన హెచ్ ఎం టీవీ ని అభినందించిన రాజకీయ పార్టీలు
- 20 Oct 2020 6:55 AM GMT
విజయవాడ
దివ్య తేజస్విని తలిదండ్రులు
సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇవ్వటం మా అదృష్టం
మహిళా పక్షపాతిగా సీఎం జగన్ మాకు అవకాశం కల్పిస్తారని తెలుసు
మాకు జరిగిన అన్యాయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళతాం
నిద్రిస్తున్న దివ్యను కిరాతకంగా హత్య చేసిన నాగేంద్రను ఉరి తీయాలని కోరతాం
ఏ తల్లితండ్రులకూ కడుపుశోకం రాకూడదు
నాగేంద్రకు పది రోజులలో శిక్షపడే విధంగా చర్యలు తీసుకొవాలని కోరతాం
- 20 Oct 2020 5:16 AM GMT
అమరావతి
రాష్ట్రంలో పలు మేజర్ ప్రాజెక్ట్ లను జుడిషియల్ ప్రివ్యూ కి పంపిన మారిటైమ్ బోర్డ్
రామాయపట్నం పోర్ట్, భావనపాడు పోర్ట్, జువ్వలదిన్నే, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల టెండర్లు సిద్దం
టెండర్లను జుడిషియల్ ప్రివ్యూ కు పంపిన మారిటైమ్ బోర్డ్
2646.84 కోట్ల రూపాయలతో రామాయపట్నం పోర్ట్ నిర్మాణం కు ప్రణాళిక
2573.15 కోట్ల రూపాయలతో భావనపాడు పోర్ట్ నిర్మాణం కు ప్రణాళిక
నాలుగు ఫిషింగ్ హార్బర్ ల నిర్మాణం కోసం 1205.77 కోట్ల రూపాయలు అవుతుంది అని అంచనా
జుడిషియల్ ప్రివ్యూ, పోర్ట్ వెబ్ సైట్లలో వివరాలు అందుబాటులో ఉంచిన మారిటైమ్ బోర్డ్
అభ్యంతరాలు, సూచనలు ఏమన్నా ఉంటే 7 రోజుల్లో తెలియజేయాలని పేర్కొన్న మారిటైమ్ బోర్డ్
- 20 Oct 2020 5:15 AM GMT
అమరావతి....
ఇసుక పాలసీ రూపకల్పన పై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కీలక సమావేశం..
హాజరైన మంత్రులు పెద్దిరెడ్డి, , పేర్ని నాని, కొడాలి నాని...సజ్జ ల రామకృష్ణ రెడ్డి
- 20 Oct 2020 5:15 AM GMT
అమరావతి
గతప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తే జగన్ ప్రభుత్వం ఇసుకని బంగారం ధర తో సమానం చేసింది
జగన్ ప్రభుత్వం ఇసుకను మాఫియాగా మార్చి
ప్రజలపై భారం వేసారు
ఇసుక కాంట్రాక్ట ను రాష్టం మొత్తంగుత్తాగా తన వారికి కట్టబెట్టేoదుకే ఇసుక కార్పొరేషన్ ఏర్పాటు
తమిళనాడు ఇసుక మాఫియా కింగ్ శేఖర్ రెడ్డి కి కట్టబెట్టేo దుకే ఇసుక కార్పొరేషన్
వేల కోట్లు కొట్టేయటనికి తెర వెనుక ఏర్పాట్లు జరుగుతున్నాయి
ఉచితంగా ఇచ్చే ఇసుకను బ్రహ్మ పదార్థంగా ఎందుకు చేశారో సీఎం జగన్ సమాధానం చెప్పాలి
ఇసుక లేక లక్షల మంది కార్మికులుపస్తులు పడుకొంటున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు
టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire