Live Updates: ఈరోజు (19 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 19 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | తదియ సా.06-47 వరకు తదుపరి చవితి | విశాఖ నక్షత్రం రా.11-04 వరకు తదుపరి అనురాధ | వర్జ్యం: మ.02-49 నుంచి 04-19 వరకు | అమృత ఘడియలు రా.11-50 నుంచి 12-47 వరకు | దుర్ముహూర్తం: మ.12-10 నుంచి 12-57 వరకు తిరిగి మ. 02-30 నుంచి 03-17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 09-00 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Telangana updates: ముఖ్యమంత్రి కేసీఆర్ కు తమిళనాడు సీఎం పళని స్వామి లేఖ...
    19 Oct 2020 11:33 AM GMT

    Telangana updates: ముఖ్యమంత్రి కేసీఆర్ కు తమిళనాడు సీఎం పళని స్వామి లేఖ...

    ముఖ్యమంత్రి... 

    -తమిళనాడు సీఎం పళని స్వామి లేఖ...

    -ముఖ్యమంత్రి కేసీఆర్ కు తమిళనాడు సీఎం పళని స్వామి లేఖ

    -ముఖ్యమంత్రి కేసీఆర్ కు తమిళనాడు సీఎం పళని స్వామి లేఖభారీ వర్షాలు, వరదలతో నష్టపోవడం విచారకరం

    -తెలంగాణ ప్రజలకు అండగా ఉంటాం

    -ప్రజలకు దుప్పట్లు చాపలు పంపిణీ చేస్తాం

    -సీఎంఆర్ఎఫ్ నుండి పది కోట్ల రూపాయల తక్షణ సహాయం కింద తెలంగాణకు కేటాయిస్తాం

  • Hyderabad updates: నాగమయ్య కుంట నుంచి భారీగా బయటకు వస్తున్న నీరు...
    19 Oct 2020 11:22 AM GMT

    Hyderabad updates: నాగమయ్య కుంట నుంచి భారీగా బయటకు వస్తున్న నీరు...

    హైదరాబాద్... 

    -హైదరాబాద్ లో నాగమయ్య కుంట నుంచి భారీగా బయటకు వస్తున్న నీరు

    -ముషీరాబాద్ సర్కిల్ లోని వియస్ టి, రాం నగర్ ప్రాంతాలను ఖాళీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్న ghmc అధికారులు

  • K. Chandrashekar Rao: వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకుంటాం- ముఖ్యమంత్రి కేసీఆర్!
    19 Oct 2020 11:19 AM GMT

    K. Chandrashekar Rao: వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకుంటాం- ముఖ్యమంత్రి కేసీఆర్!

    ముఖ్యమంత్రి కేసీఆర్..

    * ప్రజలు ఎంతో నష్టపోయారు

    * వరద నీట మునిగిన ప్రతి ఇంటికి 10వేల చొప్పున ఆర్థిక సహాయం

    * రేపు ఉదయం నుంచే ఆర్థిక సహాయం పంపిణీ చేస్తాం.

    * వరదల వల్ల పూర్తిగా కూలిన ఇంటికి 1లక్ష రూపాయల నష్టపరిహారం

    * పాక్షికంగా నష్టపోయిన ఇంటికి 50వేలు పరిహారం

    * దెబ్బ రహదారులను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలి

    * మళ్ళీ మాములు జీవన పరిస్థితులు తక్షణం చూడాలని అధికారులకు సీఎం ఆదేశం.

    * పేదలకు తక్షణ సహాయం అందించేందుకు మున్సిపల్ శాఖకు 5వందల 50కోట్లు విడుదల

  • Hyderabad updates: దసరా పండగ దృశ్య నుండి  ప్రత్యేక బస్సులు నడుపనున్న తెలంగాణ ఆర్టీసీ...
    19 Oct 2020 11:10 AM GMT

    Hyderabad updates: దసరా పండగ దృశ్య నుండి ప్రత్యేక బస్సులు నడుపనున్న తెలంగాణ ఆర్టీసీ...

    హైదరాబాద్..

     - రంగారెడ్డి రీజనల్ మేనేజర్ వరప్రసాద్

    -దసరా పండగ దృశ్య హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు 3000 ల ప్రత్యేక బస్సులు నడుపనున్న తెలంగాణ ఆర్టీసీ...

    -ఈ నెల 15 నుండి 24 వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి...

    -15-10-20 నుండి నిన్నటి వరకు ఎంజిబిఎస్, జెబిఎస్ మధ్య 281 ప్రత్యేక బస్సులు నడిసాయి...

    -ఈ ప్రత్యేక బస్సులు హైదరాబాద్ నుండి ఇతర రాష్ట్రాలకు కాక తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు నడవనున్నాయి...

    -ఎంజీబీఎస్ ,జేబీఎస్, కూకట్పల్లి దిల్సుఖ్నగర్ ,ఎస్సార్ నగర్ అమీర్పేట్ ,ఈసీఐఎల్ ,ఉప్పల్ క్రాస్ రోడ్ ,ఎల్బీనగర్ పలు ప్రాంతాల నుండి ఇ ప్రత్యేక బస్సులు ఉన్నాయి...

    -ఈ నెల 22 నుండి 24 మధ్య 2034 బస్సులు నడపబడును...

    -ప్రయాణికుల పండుగ రద్దీదృష్ట్యా అడ్వాన్స్ బుకింగ్ రిజర్వేషన్ కల్పించబడినది...

  • Warangal urban updates: వేయిస్తంభాల గుడిలో రుద్రేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు...
    19 Oct 2020 10:49 AM GMT

    Warangal urban updates: వేయిస్తంభాల గుడిలో రుద్రేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు...

    వ‌రంగ‌ల్ అర్బన్..

    -హన్మకొండ వేయిస్తంభాల గుడిలో రుద్రేశ్వర స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు-ఉషా దయాకర్ రావు దంపతులు,

    -మంత్రి ఎర్రబెల్లి దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, ఈఓ

    -రుద్రేశ్వరుడి అభిషేకం చేసి, ద‌ర్శించుకుని మొక్కులు తీర్చుకున్న ఎర్ర‌బెల్లి దంప‌తులు

    -అనంత‌రం ఆల‌యంలో దేవిన్న‌వ రాత్రుల సంద‌ర్భంగా, ఏర్పాటు చేసిన అమ్మ‌వారి విగ్ర‌హం వ‌ద్ద పూజ‌లు చేసిన మంత్రి దంప‌తులు

    -ఆల‌య అభివృద్ధి, స్థితిగ‌తులు త‌దిత‌ర అంశాల‌పై ఇఓ, అర్చ‌కుల‌తో చ‌ర్చించిన మంత్రి

    -ద‌ర్శ‌నానంత‌రం మంత్రికి ఆశీర్వ‌చ‌నం ఇచ్చి, స్వామివారి ప‌ట్టు వ‌స్త్రాలు బ‌హూక‌రించిన వేయిస్తంభాల గుడి అర్చ‌కులు

  • Kunduru Jana Reddy: వరదలకు నష్టపోయిన ప్రాంతాన్ని పరిశీలించిన మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి..
    19 Oct 2020 10:42 AM GMT

    Kunduru Jana Reddy: వరదలకు నష్టపోయిన ప్రాంతాన్ని పరిశీలించిన మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి..

    నల్గొండ జిల్లా....

    -నిడమనూరు మండల కేంద్రంలో వరదలకు నష్టపోయిన ప్రాంతాన్ని పరిశీలించిన మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి.

    -ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలను ఆదుకొని వాళ్లకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సీఎల్పీ నేత జానారెడ్డి.

  • 19 Oct 2020 10:33 AM GMT

    Mulugu district updates: పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ బలగాలు కుంభింగ్!

    ములుగు జిల్లా...

    -జిల్లా ఎస్పీ సంగ్రహమ్ సింగ్ ప్రెస్ మీట్..

    -ములుగు జిల్లా మంగపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ బలగాలు కుంభింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ముసలమ్మ గుట్ట గుత్తి కోయ గుంపు నైరుతి దిశగా ఉన్న కొప్పు గుట్ట సమీపంలో ఎదురు కాల్పులు జరగగా ఇద్దరు మగ మావోయిస్టులు చనిపోయారు.

    -మృతులు రవ్వ రమల్@ సుధీర్ s/o అడుమయ్య (late), 30 years, గుత్తి కోయ N/O జెల్ల గ్రామం, వెంకటాపురం మండలం ములుగు జిల్లా.

    -LOS కమాండర్ మరియు మణుగూరు ఏరియా కమిటీ మెంబర్ మావోయిస్టు పార్టీ. ఇతనిపై వివిధ పోలీసు స్టేషన్లలో ఆరు కేసులు కలవు మరియు 4 లక్షల రివార్డు కలదు.

    -2. కల్మ లక్మ,@ దళం సభ్యుడు.

    -వీరి వద్దనుండి

    -1) SLR -1

    -2) SBBL -2

    -3) విప్లవ సాహిత్యం .

    -4) Kit bags

    -5) 2 AK 47 magazines

    -6) 16, 7.62 mm rounds లభించాయి వీటిని సీజ్ చేసినాము .

    -ములుగు జిల్లా పోలీసు దళాలు అప్రమత్తంగా నుండి తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

  • 19 Oct 2020 10:26 AM GMT

    Warangal Urban district: పాదయాత్ర చేపట్టి నిరసన తెలుపుతున్న రైతు!

    వరంగల్ అర్బన్...

    -నాగలి పట్టి 40 కిమీ పాదయాత్ర చేపట్టి నిరసన తెలుపుతున్న రైతు..

    -తన భూమి తనకి ఇప్పించాలి అని వినూత్న నిరసన..

    -పిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదంటూ.. సిపి కార్యాలయానికి పాదయాత్ర చేపట్టిన రైతు.

    -సీపీ ని కలిసి తన బాధ ని చెప్పుకుంటా అని ఆవేదన వ్యక్తం చేసిన పోనకల్ కి చెందిన రైతు..

    -వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం పోనగల్ గ్రామ రైతు..

  • 19 Oct 2020 7:19 AM GMT

    జిహెచ్ ఎం సి ప్రధాన కార్యాలయం లో మంత్రి కె టి ఆర్ సమావేశం

    వరద సహాయక చర్యలను సమీక్షిస్తున్న మంత్రి కె టి ఆర్

    పాల్గొంటున్న పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, జి హెచ్ ఎo సి కమీషనర్ డి ఎస్ లోకేష్ కుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేత మొహంతి, జి హెచ్ ఎం సి ఈ వి డి ఎం డైరెక్టర్, అదనపు కమీషనర్లు

  • 19 Oct 2020 7:19 AM GMT

    హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్..

    మొన్న కురిసిన భారీ వర్షాల వల్ల వరంగల్ జాతీయ రహదారి పూర్తిగా దెబ్బతింది...

    ఎక్కడపడితే అక్కడ గుంతలు ఉండడం వల్ల భారీగా ట్రాఫిక్ జాం...

    రోడ్డుపై ఇంకా నీరు నిలిచి ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు..

    కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్..

    జాతీయ రహదారిపై ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు కూడా చేరుకోవడం నీరు బయటకు వెళ్లకపోవడంతో పూర్తిగా దెబ్బతిన్న రోడ్లు...

Print Article
Next Story
More Stories