Live Updates: ఈరోజు (19 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 19 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 19 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | తదియ సా.06-47 వరకు తదుపరి చవితి | విశాఖ నక్షత్రం రా.11-04 వరకు తదుపరి అనురాధ | వర్జ్యం: మ.02-49 నుంచి 04-19 వరకు | అమృత ఘడియలు రా.11-50 నుంచి 12-47 వరకు | దుర్ముహూర్తం: మ.12-10 నుంచి 12-57 వరకు తిరిగి మ. 02-30 నుంచి 03-17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 09-00 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 19 Oct 2020 3:53 PM GMT
Telangana updates: ప్రభుత్వ ఆఫీసుల ముందు ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తున్నాయి!
మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే
#వరదల్లో చిక్కుకున్న ప్రజలతో మేము ఉంటే--ప్రభుత్వ ఆఫీసుల ముందు ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తున్నాయి.
#కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రప్పించి ఇక్క స్థానిక నేతలు విమర్శలు చేయాలి.
# నా నియోజకవర్గంలో పలువురు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు.
# ఈ 550 కోట్లే కాకుండా ఇంకా సిఎం ప్రకటిస్తారని మేము అనుకుంటున్నాము.
ముఠా గోపాల్, ఎమ్మెల్యే
# చరిత్రలో కనీవినీ ఎరుగని ప్రకృతి విపత్తు ఎదురైంది.
# వరదల్లో చిక్కుకున్న ప్రజలందరినీ ప్రభుత్వం కంటికి రెప్పలా చూసుకుంటుంది.
కాలేరు. వెంకటేష్ ఎమ్మెల్యే
#రాజకీయాలకు అతీతంగా నేతలందరూ ఇప్పుడు ప్రజలకు అండగా ఉండాలి.
#ముఖ్యమంత్రి కోరిన నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలి.
- 19 Oct 2020 3:01 PM GMT
A.C.B.updates: కీసర నాగరాజు కేసులో ఇంకా బినామిల పై జరుగుతున్న ఏసీబీ సోదాలు..
హైదరాబాద్..
ఏసిబి సోదాలు...
-నాగరాజు బినామి ని గుర్తించిన ఏసీబీ..
-బొల్లారం కు చెందిన వ్యక్తి గా గుర్తింపు..
-బినామి ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు.
- 19 Oct 2020 2:57 PM GMT
Railways updates: దక్షిణ మధ్య రైల్వే నుండి నలభై రెండు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి...
hmtv తో దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్...
-కోవిడ్ తర్వాత ప్రారంభమైన రైళ్లకు అదనంగా దసరా నేపథ్యంలో 196 జతల ప్రత్యేక రైళ్లను ప్రకటించింది...
-ఈ రైలు ఈ నెల 20 - నవంబర్ 30 వరకు ఈ ప్రత్యేక రైళ్ళు నడుస్తాయి..
-దీనిలో జనరల్ కేటగిరి ఉండవు ఈ ప్రత్యేక రైళ్లు కాబట్టి రిజర్వేషన్ ద్వారా మాత్రమే టికెట్ బుక్ చేసుకోవచ్చు...
-ఇప్పటికే అన్ని కౌంటర్లలో రిజర్వేషన్లు బుకింగ్ ప్రారంభమైంది...
-ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రైళ్లు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇక్కడి నుంచి ప్రత్యేక రైళ్లు కూడా ప్రారంభమవుతాయి...
-రద్దీ ఉన్న రూట్లలో సెలెక్ట్ చేసి ఈ ప్రత్యేక రైళ్లను ప్రకటించారు...
-కోవిడ్ నిబంధనల మేరకే రైల్వే ప్రయాణికులు వ్యవహరించాలి..
-మాస్కు తప్పని సరిగా ధరించాలి రైల్వే స్టేషన్ లోపలికి వచ్చే ముందు ధర్మ స్క్రీనింగ్ పరీక్ష జరుగుతుంది...
-ఇవి ప్రత్యేక రైలు కాబట్టి చార్జీలు కూడా అదనంగా ఉంటాయి...
-రైళ్లలో దుప్పట్లు ,క్యాటరింగ్ ఫెసిలిటీ ఉండదు..
- 19 Oct 2020 2:42 PM GMT
Telangana Bhavan updates: భారీ వర్షానికి వేల ఇండ్లు నీళ్లలో మునిగాయి!
తెలంగాణ భవన్..
GHMCమేయర్ బొంతు రామ్మోహన్..
# పృకృతికి ఎవ్వరూ అతిథులు కాదు.
#నాయకులందరూ రాత్రి-పగలు తిరిగినా అకాల వర్షం అందరిని ముంచింది.
#NDRF బృందం- రెస్క్యూ ఆపరేషన్స్ రాత్రి 2-3 గంటలకు కూడా వెళ్లీ చేసి ప్రాణాలను కాపాడాము.
# GHMC నగర చరిత్రలో వరద కష్టాలు రాలేదు.
# కొన్ని ఏరియాల్లోకి కనీసం భోజనం ఇచ్చే పరిస్థితి కూడా లేదు.
# ప్రజలకు అండగా-ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు.
# ప్రజలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం- GHMC ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.
# 112 ఏళ్ల క్రితం 43 సెంటిమిటర్ల వర్షం నమోదు అయింది--కానీ మొన్న 24గంటల్లో 32 సెంటిమిటర్ల కావడం చరిత్ర.
#ఏడాది కాలంలో 120 సెంటిమిటర్ల వర్షపాతం నమోదు చరిత్ర--..120 కూడా దాటడం చరిత్ర లో ఇంతకు ముందు లేదు
- 19 Oct 2020 2:33 PM GMT
Telangana Bhavan updates: వరద నష్ట పరిహారం ప్రకటించినందుకు సీఎం కెసిఆర్ కు ధన్యవాదాలు..
తెలంగాణ భవన్..
చామకూర.మల్లారెడ్డి..
రాష్ట్ర మంత్రి..
# 550 కోట్లు వరద నష్ట పరిహారం ప్రకటించినందుకు సీఎం కెసిఆర్ కు ధన్యవాదాలు.
# వరదల్లో ఉన్న ప్రజల కోసం మంత్రులతో సహా కార్పొరేటర్లు 24 గంటలు పనిచేస్తున్నారు.
# రాత్రి సమయంలో నిద్రపోకుండా నాయకులు కష్టపడుతున్నారు
# ఒకటి తరువాత ఒకటి చేరువులన్ని తెగిపోయి--కాలనిలన్ని నీట మునిగాయి.
- 19 Oct 2020 2:06 PM GMT
Telangana Bhavan updates: వర్షం- వరదల వల్ల చాలా నష్టం జరిగింది!
తెలంగాణ భవన్..
మహమూద్ అలీ హోమ్ మంత్రి..
#1908 తరువాత మళ్ళీ అంతటి వరదలు వచ్చాయి.
# మంత్రి కేటీఆర్ ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నారు.
#వర్షం- వరదల వల్ల చాలా డ్యామేజ్ అయింది- నష్టం జరిగింది.
#80మంది సీనియర్ అధికారులతో ప్రత్యేక బృందం ఏర్పాటు కేటీఆర్ చేశారు.
# ప్రజలకు ముఖ్యమంత్రి ఎప్పుడూ అండగా ఉన్నారు.
#మళ్ళీ మూడు- నాలుగు రోజుల వర్ష సూచన ఉంది-- ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి.
#మూసి అభివృద్ధి కోసం కాంగ్రెస్- టీడీపీ ఎమీ చేయలేదు.
- 19 Oct 2020 1:55 PM GMT
Telangana Bhavan updates: ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత కట్టిన అక్రమ కట్టడాలు ఎక్కడా లేవు!
తెలంగాణ భవన్..
తలసాని శ్రీనివాస యాదవ్ ..
రాష్ట్ర మంత్రి..
#ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత కట్టిన అక్రమ కట్టడాలు ఎక్కడా లేవు-2014 తరువాత కట్టినవన్ని చట్టానికి లోబడే.
# ఇప్పుడు విమర్శలు చేస్తున్న నేతల పాలనలోనే ఇప్పుడు మునిగిన కట్టడాలు.
# వరదల ముంపు ప్రజలకు నష్టపరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్ కు గ్రేటర్ ప్రజలు- నేతల తరపున కృతజ్ఞతలు.
# వరదల్లో నష్టపోయిన ప్రజలెవ్వరూ ఆందోళన చెందొద్దు.
- 19 Oct 2020 1:38 PM GMT
NTR Bhavan updates: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నష్టం జరగడం పై టీడీపీ సమీక్ష జరిగింది..
ఎల్.రమణ టీటీడీపీ అధ్యక్షులు @ ఎన్టీఆర్ భవన్
-వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నష్టపోయిన రైతుల సమస్యల తో పాటు హైదరాబాద్ నగరంపై పెద్ద ఎత్తున ఆస్తి ప్రాణ నష్టం జరగడం పై టీడీపీ సమీక్ష జరిగింది..
-గతంలో ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పర్యటించి వారికి నష్టపరిహారం ఇచ్చేవారని ప్రస్తుతం ఎవరు చేయడం లేదు...
-సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల ఆరు సంవత్సరాలుగా పంట నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్సు రాని పరిస్థితి ఏర్పడింది...
-లక్షల ఎకరాల్లో వరి పత్తి పంటలు వరదల్లో మునిగి పోయాయి...
-కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి...
-నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి...
-రైతుల కోసం టిడిపి ధర్నాలు నిరసన దీక్షలు చేస్తుంది...
-హైదరాబాద్ లో 180 చెరువులు మరమ్మత్తు చేస్తామని నాళాలను రిపేర్ చేస్తామని 30 వేళా కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి 300 కోట్లు కూడా ఖర్చు చేయలేదు...
-ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలి..
- 19 Oct 2020 1:14 PM GMT
Peddapalli updates: కమాన్ పూర్ లో లేఖ కలకలం!
పెద్దపెల్లి జిల్లా :
-కమాన్ పూర్ తహశీల్దార్ కార్యాలయం ముందు ప్రజాశక్తి దళ కమాండర్ మల్లన్న పేరిట వెలిసిన వాల్ పోస్టర్
-జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా విఆర్వో,జూనియర్ అసిస్టెంట్ లను తహశీల్దార్ కార్యాలయంలోకి అనుమతించవద్దని హెచ్చరిక
-నకిలీ వాల్ పోస్టర్ అంటున్న పోలీసులు
- 19 Oct 2020 11:37 AM GMT
Telangana updates: మానవ హక్కుల కమిషన్ కు నాగరాజు కుటుంబ సభ్యులు....
--కీసర తహసీల్దార్ నాగరాజు మృతి ఏసీబీ తీరుపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన నాగరాజు కుటుంబ సభ్యులు..
--నాగరాజు మృతి పై సమగ్ర విచారణ జరిపించాలని కోరిన పిటిషన్..
--నాగరాజు పై తప్పుడు కేసులు పెట్టిన ఏసీబీ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు...
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire