Live Updates: ఈరోజు (సెప్టెంబర్-17) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం | 17 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | అమావాస్య సా.5-06 వరకు తదుపరి పాడ్యమి | పుబ్బ నక్షత్రం ఉ.10-58 వరకు తదుపరి ఉత్తర | అమృత ఘడియలు: ఉ.6-23 వరకు తిరిగి తె.2-47 నుంచి 4-17 వరకు | వర్జ్యం: సా.5-44 నుంచి 7-15 వరకు | దుర్ముహూర్తం: ఉ.9-54 నుంచి 10-42 వరకు తిరిగి మ.2-45 నుంచి 3-34 వరకు | రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.5-51 | సూర్యాస్తమయం: సా.6-00
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 17 Sep 2020 10:18 AM GMT
Vijayawada updates: కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా..
విజయవాడ..
-కేంద్ర మంత్రి గడ్కరీ అనారోగ్యం కారణంగా కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం వాయిదా
-గడ్కరీ అనారోగ్యంతో రేపు ప్రారంభం కావలసిన పలు ప్రాజెక్టులు వాయిదా
-ట్రాఫిక్ సమస్యలు అరికట్టేందుకు రేపటి నుంచీ ఫ్లైఓవర్ పై ప్రజా రవాణాకు అనుమతి
- 17 Sep 2020 10:14 AM GMT
Vijayawada updates: గన్నవరం వైసీపీలో భగ్గుమన్న విభేదాలు..
కృష్ణాజిల్లా :
-ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులకు,దుట్టా వర్గాలు మధ్య రోజు రోజుకు పెరుగుతున్న విభేదాలు.
-రామవరప్పాడులో నిన్న రాత్రి దుట్టా వర్గానికి చెందిన నభిగాని కొండ ఇంటి పై వంశీ వర్గీయులు దాడి.
-అర్ధరాత్రి రాళ్లతో ఇంటి అద్దాలు పగులగొట్టి కుటుంబ సభ్యులతో దుర్భాషలాడి,దాడికి యత్నం.
-పోలీసుల రాకతో పరారైన ఎమ్మెల్యే వర్గీయులు.
- 17 Sep 2020 9:08 AM GMT
Guntur updates: గ్రామ, వార్డు కార్యదర్శుల పరీక్షలు 20 నుంచి 26 వరకు జరుగుతాయి..కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్..
గుంటూరు.....
కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్..
-14 కేటగిరీ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 86,514 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు
-జిల్లాలో తొలిరోజు 212 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
-గుంటూరు, పెదకాకాని కేంద్రాల్లో వారం రోజులపాటు పరీక్షలు కొనసాగుతాయి
-కొవిడ్ నిబంధనల మేర పరీక్షల నిర్వహణ
-మాస్కులు పెట్టుకున్నవారిని గుర్తించేందుకు వీడియోగ్రఫీ తీస్తాం
-అభ్యర్థులు 2 గంటల ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి
-ఉదయం 10 గంటలు దాటిన తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించం...
-ఆర్టీసీ బస్టాండు, ఇతర ప్రాంతాల్లో హెల్ప్ డెస్కుల ఏర్పాటు
-అభ్యర్థులు 6 అడుగుల దూరంలో కూర్చునేలా ఏర్పాట్లు
-పాజిటివ్ అభ్యర్థులకు ప్రత్యేక ఐసోలేషన్ రూముల ఏర్పాటు
-పరీక్షలు నిర్వహించేవారికి పీపీఈ కిట్లు ఇస్తాం
- 17 Sep 2020 9:04 AM GMT
Vijayawada updates: దుర్గగుడిలో మూడు సింహాల మాయంలో అంతుచిక్కని మర్మం..
విజయవాడ..
-యధావిధిగా పెనుగంచిప్రోలులో విధులు నిర్వహించుకుంటున్న ఈవో ఎన్.ఇ.ఎస్.ఎన్. మూర్తి..
-నింద ప్రైవేట్ సెక్యురిటీ పై నెట్టే ప్రయత్నం చేస్తున్న అధికారులు
-వెండి రధం పై సింహాల చోరి నిన్న విచారణ జరిపిన పెనుగంచిప్రోలు ఈవో
-రెండో రోజు విచారణకు తాత్కాలిక బ్రేక్
- 17 Sep 2020 9:01 AM GMT
vijayawada updates: సింహాలు లేకపోవడంతో పోలీసులకు పిర్యాదు చేసాము..సురేష్ బాబు- దుర్గగుడి ఈవో..
విజయవాడ..
సురేష్ బాబు- దుర్గగుడి ఈవో:-
-2018 తరవాత ఈ రథాన్ని తీయలేదు.
-స్టోర్ రూమ్ తాళాలు నా దగ్గర ఉండవు.
-అక్కడ లేవు కాబట్టి స్టోర్ రూమ్ లో సింహాలు ఉంటాయి అనే ఉద్దేశంతో నిన్న పరిశీలించాము.
-అక్కడ సింహాలు లేకపోవడంతో పోలీసులకు పిర్యాదు చేసాము.
- 17 Sep 2020 8:58 AM GMT
Vijayawada-Kanaka Durga updates: సింహాలు మిస్ అవ్వడం పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము..సోమి నాయుడు..
విజయవాడ:
సోమి నాయుడు, చైర్మన్ దుర్గగుడి:
-2016లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఘాట్ రోడ్ లో ఉన్న రథాన్ని జమ్మిదిడ్డి లో పెట్టారు.
-ఆ తరవాత మహామండపం దగ్గరకు తీసుకొచ్చి పెట్టారు.
-వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ రథాన్ని వాడలేదు.
-2019 లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉగాదికి వాడారు, తర్వాత కరోనా వలన వాడలేదు.
-నిన్న కనపడని సింహాలు స్టోర్ రూమ్ లో ఉన్నాయి ఏమో అని గుడి తాలూకా అధికారులు అందరం చెక్ చేసాము.
-కానీ స్టోర్ రూమ్ లో ఆ సింహాలు లేవు.
-పోయిన సింహాలను తయారు చేసి ఆ రథానికి మార్చేందుకు ప్రక్రియ నిన్ననే ప్రారంభించాము.
-గత ప్రభుత్వ హయాంలో ఉన్న సెక్యురిటి అధికారులు ఇప్పుడు వచ్చిన మాక్స్ సెక్యురిటి వాళ్ళకి ఆ సింహాలు అప్పచెప్పలేదు అని చెప్పారు.
-ఈ రోజు సింహాలు మిస్ అవ్వడం పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము.
-పోయిన సింహాలు ఏరకంగా పోయాయి అని పోలీస్ వారిని దర్యాప్తు చేయాలి అని కోరాము.
-హిందువుల మనోభావాలు కపడేవిధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
-నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చిన దేవాదాయశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని మాట్లాడారు.
-గత టీడీపీ-బీజేపీ హయాంలో దేవాలయంలో క్షుద్రపూజలు జరిగినప్పుడు అప్పటి మీ దేవాదాయశాఖ మంత్రి రాజీనామా చేసారా.
-ఒక ఎంఎల్సీ గా మాట్లాడేటప్పుడు ఘనం కూడా లేకుండా మంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారు బుద్ధ వెంకన్న.
- 17 Sep 2020 8:46 AM GMT
Chittoor updates: ఎసిబికి అడ్డంగా దొరికిపోయిన కలకడ డిప్యూటీ తహశీల్థార్ శ్రీనివాసరావు..
చిత్తూరు..
-కార్యాలయంలోనే 3వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఎసిబి అధికారులు..
-ఫెర్టిలైజర్ షాప్ యజమాని సుభాతుల్లా నుంచి విజిలెన్స్ సీజ్ చేసిన లక్షా 60వేలను రిలీజ్ చేసేందుకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ తహశీల్థార్..
- 17 Sep 2020 8:29 AM GMT
Balineni Srinivasa Reddy Comments: గతంలో డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశాడు..మంత్రి బాలినేని..
ప్రకాశం జిల్లా..
మంత్రి బాలినేని కామెంట్స్..
-కరోనా విజృంభనతో ఆర్ధిక ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినా మాట ఇస్తే మడమ తిప్పని నేతలా వైఎస్సాఆర్ ఆసరా పథకాన్ని మహిళలకు అమలు పరిచాడు.
-పేదలకోసం ప్రభుత్వం నివాస స్థలాల పంపిణి కార్యక్రమాన్ని చేపడితే చంద్రబాబు కోర్టుల ద్వారా ఆ కార్యక్రమాన్ని అడ్డుకొని పేదలకు పట్టాలు అందకుండా చేస్తున్నాడు.
-ఎన్ని అడ్డంకులు సృష్టించినా పట్టాల పంపిణీని నెరవేర్చి తీరుతాం.
-ఈరోజు చంద్రబాబు మతాలను, కులాలను రెచ్చగొడుతున్నాడు.
-రథాలను తెలుగుదేశం పార్టీవారే ధ్వంసం చేసి ఆ నేరాన్ని మా ప్రభుత్వంపై నెట్టాలనే ప్రయత్నం చేశారు.
-అందుకే నిష్పక్షపాత విచారణ చేపట్టేంతుకు సీబీఐ విచారణ చేపట్టాలని సిఎం జగన్ కోరారు.
-గోదావరి పుస్కరాలలో 30 మందిని బలితీసుకున్న చంద్రబాబుకు ఆ దేవుడే తగిన బుద్ది చెప్పాడు.
- 17 Sep 2020 7:57 AM GMT
Amaravati updates: రాష్ట్రంలో సమగ్ర పరిశ్రమ సర్వే చేశాం.. మేకపాటి గౌతమ్ రెడ్డి..
అమరావతి..
-మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి..
-5 సెంటర్ ఆఫ్ ఎక్ససెలెన్సు లు ఏర్పాటు చేయడానికి కేంద్ర సంస్థలు అంగీకరించాయి
-నీతి ఆయోగ్ చైర్మన్ నాడు నేడు ని అభినందించారు
-8 ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి కి కేంద్రం సహకరిస్తాం అని చెప్పారు
-పెట్రో కెమికల్ కరిడార్ లో 2 కెమికల్
-సోలార్ మనుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏ పి లో ఏర్పాటు చే
-డిసెంబర్ నుండి స్కిల్ డేవేలప్మెంట్ సెంటర్ల ను ఏర్పాటు చేస్తున్నాం
-బల్క్ డ్రగ్ పార్క్ ని ఏ పి కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
-భావనపాడు, రామాయపట్నం పోర్టులను డిసెంబర్ 15 నాటికి పనులు ప్రారంభిస్తాం
-విశాఖ లో ఐటీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం
-వరల్డ్ క్లౌడ్ సెంటర్ ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాం
-వర్క్ ఫ్రొం హోమ్ కి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం
- 17 Sep 2020 7:51 AM GMT
YSR Asara Varotsavalu: పశ్చిమగోదావరి జిల్లాలో డ్వాక్రా మహిళలు సి.యం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం..
పశ్చిమగోదావరి జిల్లా..
-ఈ కార్యక్రమానికి మాజీ సొసైటీ ప్రెసిడెంట్ జంగా చెన్నకేశవరెడ్డి మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
-పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం యర్రంపల్లి గ్రామంలో వాడవాడలా వై. యస్. ఆర్. ఆసరా ద్వారా లబ్ధి పొందిన డ్వాక్రా మహిళలు సి. యం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
-మా సమస్యలను ముందుగానే కనిపెట్టె మా కుటుంబం పెద్ద కొడుకు అయ్యాడు అని ప్రపంచ మంతా కరోనా వైరస్ తో బాధపడుతున్న సమయంలో కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వైయస్ జగన్మోహన్ రెడ్డె మళ్లీ మళ్లీ సి. యం కావాలని సంబరాలు జరుపుకున్నారు.
-పార్టీతో సంబంధం లేకుండా లబ్ధిదారులందరికి ప్రతి పథకం అభిస్తుందని అవినీతి రహిత పాలన అంటే మాదె అని జిల్లా వై. యస్. ఆర్ నాయకులు శ్రీహరి రెడ్డి అన్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire