Live Updates: ఈరోజు (సెప్టెంబర్-17) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం | 17 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | అమావాస్య సా.5-06 వరకు తదుపరి పాడ్యమి | పుబ్బ నక్షత్రం ఉ.10-58 వరకు తదుపరి ఉత్తర | అమృత ఘడియలు: ఉ.6-23 వరకు తిరిగి తె.2-47 నుంచి 4-17 వరకు | వర్జ్యం: సా.5-44 నుంచి 7-15 వరకు | దుర్ముహూర్తం: ఉ.9-54 నుంచి 10-42 వరకు తిరిగి మ.2-45 నుంచి 3-34 వరకు | రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.5-51 | సూర్యాస్తమయం: సా.6-00
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 17 Sep 2020 11:28 AM GMT
Anantapur updates: జనసేన పీఏసీ సభ్యుడు చిలకం మధుసూదన్ రెడ్డి కి భద్రత తొలగింపు..
అనంతపురం:
-సెక్యురిటీ సమస్య ఉందన్న కారణం తో రెండు నెలల కిందట గన్ మెన్ లను కేటాయించిన ప్రభుత్వం.
-ఇవాళ హైదరాబాద్ లో ఉండగా ఉన్న ఫలంగా గన్ మెన్ ల తొలగింపు.
-ప్రభుత్వ తీరు పై ఆందోళన వ్యక్తం చేస్తున్న మధుసూదన్ రెడ్డి.
-గన్ మెన్ లను పునరుద్ధరించాలని డిమాండ్
- 17 Sep 2020 11:25 AM GMT
Kadapa updates: ట్రిపుల్ ఐటీలలో ఇంత వరకు పరీక్షలు జరపకపోవడం చాలా బాధాకరం.... తులసి రెడ్డి..
కడప :
పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి కామెంట్స్ ...
-బయట రాష్ట్రాలలో ఎగ్జామ్స్ పూర్తి అవడం ఎపి లో మాత్రం జరగక పోవడం విడ్డూరం.
-ప్రతి సంవత్సరం జూన్ లో అడ్మిషన్ లు జరగాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎపిలో దాదాపు గా 5 నెలలు గడుస్తున్నా అడ్మిషన్ ప్రక్రియ పట్టించుకోని అధికారులు...
-తెలంగాణ ట్రిపుల్ ఐటీలో ఇప్పటి కే అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైంది...
-తెలంగాణ ట్రిపుల్ ఐటిలో ఆంధ్రప్రదేశ్ సీట్ల వాటా 150 కోల్పోయే అవకాశం ఉంది...
-తెలంగాణ లో పదవ తరగతి విద్యార్థులకు గ్రేడింగ్ విధానం ఆంధ్రప్రదేశ్ లో కామన్ గా పాస్ విధానం వల్ల అన్యాయం జరుగుతుంది...
-ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం ...
-వెంటనే వైఎస్ రాజశేఖరరెడ్డి గారు స్థాపించిన ట్రిపుల్ ఐటి లపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ ...
- 17 Sep 2020 11:01 AM GMT
Prakasam updates: చంద్రబాబు తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.. మంత్రి వేణుగోపాల కృష్ణ..
ప్రకాశం జిల్లా..
మంత్రి వేణుగోపాల కృష్ణ కామెంట్స్,
-రాష్ట్రం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను అడ్డుకునేందుకు చంద్రబాబు కోర్ట్లుల్లో స్టేలు తెచ్చుకొని స్టే బాబుగా మారిపోయాడు.
-గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ చేస్తుంటే స్టేలు తెచ్చుకుంటున్నారు.
-తెలుగు దేశం పార్టీ జామ్ అయిపోయి జూముల్లో మాట్లేడేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు.
-పేదరిక నిర్మూలన కోసం నవరత్నాలను తెచ్చి సిఎం జగన్ యజ్ణం చేస్తుంటే దానిని అడ్డుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నాడు.
-ఇకనుండి చంద్రబాబు తనపేరును స్టే బాబుగా పేరు మార్చుకోవాలి.
-చంద్రబాబు స్టేలతో ఎన్ని అడ్డంకులు సృష్టించినా సిఎం జగన్ యజ్ణాన్ని ఎవ్వరు అడ్డుకోలేరు.
-అంతర్వేదీలో హిందూవాదాన్ని ఆయన తెరపైకి తేవడమే ఇందుకు భలమైన ఆధారం.
-సదావర్తి భూముల విషయంలో ఆనాడు చంద్రబాబు 40 దేవాలయాలను కూల్చేశాడు..పుస్కరాల్లో 29మంది చావుకు కారకుడయ్యాడు...సింహాచల భూములను అన్యాక్రాంతం చేశాడు.
-చంద్రబాబు భూములను ఏవిదంగా అన్యాక్రాంతం చేశాడో...అవినీతి ఏస్థాయిలో చేశాడనే దానిపై సిబీఐ విచారణలో తేలేరోజు దగ్గరలోనే ఉంది.
- 17 Sep 2020 10:56 AM GMT
Vijayawada updates: మొగల్రాజపురం దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు..
విజయవాడ..
-ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు..
-సాయంత్రం మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశం..
-డాక్టర్ మురళీధర్ పిఆర్ఓ ప్రమేయంతోనే దోపిడి..
-నిందితులు తాడేపల్లికి చెందిన గంజాయ్ బ్యాచ్ గా గుర్తింపు
- 17 Sep 2020 10:54 AM GMT
National updates: కుంభకోణాలను వెలికితీయాలని కోర్టులో ఆదేశించాలి..మిథున్ రెడ్డి..
మిథున్ రెడ్డి , వైఎస్ఆర్సిపి లోక్ సభ పక్షనేత..
-ప్రధానిని అందర్నీ కలిసి పరిస్తితి వివరిస్తాం
-ప్రజల అభివృద్ధి పనులు కు కూడా కోర్టు లు అడ్డుపడుతున్న
-న్యాయ వ్యవస్థలో కొంత మంది వల్ల ఈ పరిస్తితి
-కుంభకోణాలు దర్యాప్తు కోర్టులో అడ్డుపడడం వింతగా ఉంది
-పార్లమెంట్ లోపల మేము మాట్లాడే అధికారం ఉంది
- 17 Sep 2020 10:51 AM GMT
National updates: చట్టం ముందు అందరూ సమానులే.... విజయసాయి రెడ్డి..
జాతీయం..
విజయసాయి రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత..
-కానీ దీన్ని విస్మరించి న్యాయవ్యవస్థ పక్షపాతంతో వ్యవహరిస్తుంది
-నేను ఏ జడ్జికి ఉద్దేశాలు ఆపాదించడం లేదు
-అసాధారణ పరిస్థితుల్లో నిషేధం విధిస్తారు
-న్యాయ స్థానాలు మీడియా నోరు నొక్కు తున్నాయి
-పౌరుల ప్రాథమిక హక్కుల ను హరిస్తున్నారు
-ధర్మాన్ని కాపాడాల్సిన వారి వారే పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు
-ఒకటిన్నర సంవత్సరం ముందు అన్ని చట్ట బద్దమే
-ప్రజలే తీర్పు ఇవ్వాలి
-కేంద్రమే దీంట్లో జోక్యం చేసుకోవాలి
- 17 Sep 2020 10:48 AM GMT
Nellore updates: గ్రామ/వార్డు సచివాలయం పోస్టుల నియామక పరీక్షలపై జడ్పీ సీఈఓ సుశీల మీడియా సమావేశం..
నెల్లూరు..
జడ్పీ సీఈఓ సుశీల మీడియా సమావేశం..
-జిల్లాలో ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు జరుగు గ్రామ/వార్డు సచివాలయం పోస్టుల నియామక పరీక్షలు పై జడ్పీ సీఈఓ సుశీల మీడియా సమావేశం.
-జిల్లాలో 230 సెంటర్లు లో 54146 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు అవుతున్నారు
-అభ్యర్థుల హాల్ టికెట్ తో పాటు ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ కచ్చితంగా తీసుకొని రావాలి.. లేకుంటే అభ్యర్థి ని పరీక్షలకు అనిమతించము
-పరీక్ష కేంద్రానికి కనీసం 2 గంటలు ముందు రావాలి.ఒక నిమిషం ఆలస్యంగా లోపలికి అనుమతించము
-పత్రి ఒక్క అభ్యర్థి మాస్క గ్లోవుజ్ ధరించి సానిటేజర్ లు తెచ్చుకోవాలి
-కోవిడ్ పాజిటివ్ వచ్చిన అభ్యర్ధులకు పరీక్ష రాసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాము.
- 17 Sep 2020 10:46 AM GMT
Srikakulam updates: వైఎస్సార్ ఆసరా వారోత్సవాల్లో ప్రతిపక్షాలపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్..
శ్రీకాకుళం జిల్లా..
-30 లక్షల మంది పేదవాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని జగన్ సంకల్పిస్తే..
-ప్రతిపక్షానికి ఎందుకు ఇంత ఏడుపు ? అర్ధం కావడం లేదు..
-దమ్ముంటే ప్రజాక్షేత్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఎదురొడ్డి పోరాడాలి..
-కోర్టులకు వెళ్ళి స్టే తెచ్చుకుని ప్రజల సంక్షేమాన్ని అడ్డుకోవడం ఏమిటి ?
-మీకు అసలు తలకాయ ఉందా ?
-ఎంత మంది పేదవారు ఇబ్బందులు పడుతున్నారో మీకు అర్ధం అవుతోందా ?
- 17 Sep 2020 10:37 AM GMT
Kadapa updates: మైదుకూరులో ప్రధాని నరేంద్ర మోడి జన్మదిన వేడుకలు...
కడప :
-మైదుకూరులో ప్రధాని నరేంద్ర మోడి జన్మదిన వేడుకలు...
-మోది జన్మదినం సందర్బంగా పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు పంపిణీ చేసిన బిజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు,
-మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి జిల్లా అధ్యక్షుడు కర్నాటి ఎల్లారెడ్డి
- 17 Sep 2020 10:31 AM GMT
Vijayawada updates: రధం పై నాలుగో సింహాన్ని బయటకు తీసిన దుర్గగుడి అధికారులు..
విజయవాడ..
-నాలుగో సింహాన్ని తూకం వేసిన అధికారులు
-3, 239 కేజి ల బరువు ఉన్నట్లుగా నిర్ధారణ
-స్టోర్ రూంలో బధ్రపరచనున్న దుర్గగుడి అధికారులు
-స్టోర్ రూమ్ లో సింహాలు ఉన్నాయా లేవా తనిఖీ చేసాం...సింహాలు లేవు అని తేలింది...
-నిన్న కొంత మందిని విచారణ అధికారి మూర్తి విచారణ చేశారు..
-రథానికి రక్షణ చర్యలు తీసుకుందాం అని పరదా తీస్తే సింహాలు లేవని తేలింది...
-విచారణ లో పూర్తి వాస్తవాలు వెలుగులోకి వస్తాయి..
-సింహాలు మాయం ఇపుడు జరిగిందా..గత హయాం లో జరిగిందా విచారణ లో తేలుతుంది...
-నేను ఈవో గా వచ్చినప్పుడు నుండి రథం కి ఉన్న పరదా తీయలేదు..
-దేవస్థానం తరపున మరో కమిటీ వేశాం...
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire