Live Updates: ఈరోజు (సెప్టెంబర్-17) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 17 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం | 17 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | అమావాస్య సా.5-06 వరకు తదుపరి పాడ్యమి | పుబ్బ నక్షత్రం ఉ.10-58 వరకు తదుపరి ఉత్తర | అమృత ఘడియలు: ఉ.6-23 వరకు తిరిగి తె.2-47 నుంచి 4-17 వరకు | వర్జ్యం: సా.5-44 నుంచి 7-15 వరకు | దుర్ముహూర్తం: ఉ.9-54 నుంచి 10-42 వరకు తిరిగి మ.2-45 నుంచి 3-34 వరకు | రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.5-51 | సూర్యాస్తమయం: సా.6-00
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 17 Sep 2020 1:56 PM GMT
East Godavari Updates: ఏలేరు ప్రాజెక్టు నుంచి 10 వేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తోన్న ఇరిగేషన్ అధికారులు
తూర్పుగోదావరి :
- భయం గుప్పిట్లో గొల్లప్రోలు, పిఠాపురం మండలాలు
- ఇప్పటికే వరద ముంపులో 25 వేల ఎకరాలు, నీట మునిగిన పలు కాలనీలు..
- 17 Sep 2020 12:38 PM GMT
Kadapa updates: ఆక్రమణ జరిగినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను.. రఘురామిరెడ్డి ....
కడప :
మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కామెంట్స్ ...
-అటవీశాఖ భూములను ఆక్రమించినట్లు టిడిపి ఇన్ చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ చేసిన అరోపణలు నెల రోజుల్లో నిరూపించాలి...
-నిరూపించని పక్షంలో మైదుకూరు నాలుగురోడ్ల కూడలిలో తప్పు ఒప్పుకొని, లెంపలు వేసుకోవాలి..
-లేనిపక్షంలో చట్టపరంగా తీసుకొనే చర్యలకు సిద్ధంగా ఉండాలి..
-గత ప్రభుత్వ హయాంలో పుట్టా సుధాకర్ యాదవ్ ఎన్నో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు..
-అప్పట్లో ప్రభుత్వాన్ని మోసం చేసి కోట్లు సంపాదించారు..
-అలాంటి వ్యక్తి కి నాపై విమర్శలు చేసే హక్కు లేదు..
-తొందరలోనే సుధాకర్ యాదవ్ అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతా..
- 17 Sep 2020 12:36 PM GMT
Vijayawada-Kanaka Durga: దుర్గ గుడిలో సింహాల మాయంపై కేసు నమోదు చేసాం..సీపీ బి.శ్రీనివాసులు..
విజయవాడ సీపీ బి.శ్రీనివాసులు..
-గుడి ఈఓను కూడా పిలిచాం సంఘటన జరగడానికి ముందే
-మొత్తం ప్రార్ధన మందిరాల వారిని కూడా పిలిచాం
-దుర్గగుడి సంఘటన జరగడానికి ముందే మీటింగ్ పిలిచి సీసీ కెమెరాలు పెట్టమన్నాం
-దేవాలయాలు, ప్రార్ధన మందిరాల వారు వాలంటీర్లను పెట్టుకోవాలి
-సీసీఎస్ కూడా దుర్గ గుడి సంఘటనపై విచారణ చేస్తారు
- 17 Sep 2020 12:34 PM GMT
Vijayawada updates: నేరం జరిగిన 48 గంటల్లో ఈ కేసు ఛేధించాం..సీపీ బి.శ్రీనివాసులు..
విజయవాడ..
విజయవాడ సీపీ బి.శ్రీనివాసులు
-48.50లక్షల రూపాయల నగదు చోరీ జరిగిందని డాక్టర్ మురళీధర్ కంప్లైంట్ ఇచ్చారు
-ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది సూత్రధారులు, పాత్రధారులు
-కేటరింగ్ నాగేంద్ర, పీఆర్ఓ మెండెం విజయ్, తాడేపల్లికి చెందిన క్రిమినల్స్ తో కలిసి డెకాయిటీ చేసారు
-ఇప్పటికి ఐదుగురిని అరెస్టు చేసాం
-నగదు 34.75లక్షల రూపాయలు, 48గ్రాముల బంగారం రికవరీ చేసాం
-వెస్లీ అనే వ్యక్తికి నేర చరిత్ర ఉంది
-ప్రతీ నెల లక్షల్లో బ్యాంకు ఈఎంఐ లు కట్టాలని డాక్టర్ తెలిపారు
-మొత్తం బిల్డింగ్ మరమ్మత్తులు జరిగిన తరువాత సీసీ కెమెరాలు పెడతామన్నారు డాక్టర్
-20 లక్షలు కట్టామని డాక్టర్ భార్యతో నిందితులు చెప్పారు
-పీఆర్ఓ నే ముందుగా డాక్టర్ భార్యను ఎవరో బయట అనుమానాస్పదంగా తిరుగుతున్నారని అలర్ట్ చేసారు
- 17 Sep 2020 12:25 PM GMT
Amalapuram updates: కోనసీమ వ్యాప్తంగా రేపటి నుంచి మూడు రోజులపాటు 144 సెక్షన్...సబ్ కలెక్టర్ కౌశిక్..
తూర్పు గోదావరి జిల్లా-అమలాపురం..
సబ్ కలెక్టర్ కౌశిక్
-ముందు స్థలము లేకుండా సభలు సమావేశాలు నిర్వహించి రాదు
-ప్రజలు గుంపులు గుంపులుగా తిరగవద్దు
డిఎస్పి బాషా హెచ్చరిక
-చలో అమలాపురానికి అనుమతి లేదు :
-డి ఐ జి కె వి మోహన్ రావు
-రేపు చలో అమలాపురానికి పిలుపునిచ్చిన బిజెపి
-అంతర్వేది సంఘటనలో కేసులు ఎత్తివేయాలని డిమాండ్ తో చలో అమలాపురం పిలుపునిచ్చిన బిజెపి
-బిజెపి నాయకులను ముందస్తు హౌస్ అరెస్టు చేస్తున్న పోలీసులు
- 17 Sep 2020 12:16 PM GMT
Tirumala-Tirupati updates: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపద్యంలో ముఖ్యమంత్రిని ఆహ్వానించిన టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి....
తిరుమల..
-తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపద్యంలో ముఖ్యమంత్రి ని కలిసి తిరుమలకి ఆహ్వానిచిన టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి,
-ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ధర్మ రెడ్డి
-ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి శ్రీవారి తీర్థప్రసాదాలు అందించిన టిటిడి ఈఓ అనీల్ కుమార్ సింఘాల్
- 17 Sep 2020 12:12 PM GMT
Amaravati updates: రేపు చలో అమలాపురం కు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు..
అమరావతి..
-రేపు చలో అమలాపురం కు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారిని విజయవాడలో నిర్బంధించిన విజయవాడ పోలీసులు
-ప్రస్తుతం అమలాపురం పార్లమెంట్ పరిధిలో సెక్షన్ 30,144 అమల్లో ఉన్నందున ముందస్తు నిర్బంధం చేసిన పోలీసులు
- 17 Sep 2020 12:04 PM GMT
National updates: రాజ్యసభలో విజయసాయిరెడ్డి - టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మధ్య వాగ్వాదం..
జాతీయం..
-Covid 19 చర్యలపై రాజ్యసభలో చర్చ సందర్భంగా చోటు చేసుకున్న మాటల యుద్ధం.
-కరోనా నియంత్రణ చర్యలపై మాట్లాడాల్సిన విజయసాయిరెడ్డి ఏసీబీ విచారణ, కోర్టుల జోక్యం అంటూ ఇతర అంశాలను ప్రస్తావించడంపై కనకమేడల తీవ్ర అభ్యంతరం.
-అనవసర అంశాలపై ప్రస్తావన తెస్తూ సభను తప్పుదోవ పట్టించడం తగదన్న కనకమేడల రవీంద్ర కుమార్
-సంబంధం లేని అంశాల్ని ప్రస్తావిస్తూ కోర్టుల పరిధిలోని అంశాలపై చర్చించడం పై తీవ్ర అభ్యంతరం.
-కోర్టు పరిధిలోని అంశాలపై పార్లమెంటులో మాట్లాడడం ద్వారా కోర్టులను కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారని కనకమేడల అభ్యంతరం.
-విజయసాయిరెడ్డి మాటల్ని రికార్డుల నుంచి తొలగించాలని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ని కోరిన తెలుగుదేశం ఎంపీ.
-ఏసీబీ విచారణ, కోర్టుల జోక్యం లాంటి అంశాలపై మాట్లాడరాదంటూ విజయసాయిరెడ్డిని వారించిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్.
-సంబంధిత అంశానికి మాత్రమే పరిమితం కావాల్సిందిగా సూచించిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివన్ష్ నారాయన్.
- 17 Sep 2020 11:50 AM GMT
Amaravati updates: ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...
అమరావతి..
-అన్నదాతల పై కేసులు పెట్టడం జగన్ రెడ్డి గారి దిగజారుడుతనానికి నిదర్శనం.
-కడుపు మండి రోడ్డెక్కిన రైతులని కేసుల పేరుతో వేధించడం దారుణం.
-ధాన్యం కొనుగోలు చెయ్యకుండా ప్రభుత్వం చేతులెత్తేయడంతో నెల్లూరు జిల్లాలో రైతుల్ని దళారులు దోచుకుంటున్నారు.
-నెల్లూరు జిల్లా సంగంలోని జాతీయ రహదారి పై ధర్నా నిర్వహించిన 15 మంది రైతుల పై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి.
- 17 Sep 2020 11:31 AM GMT
West Godavari updates: అంతర్వేది ఘటనపై కేసు సిబిఐ కి అప్పగించాం.. డిఐజి మోహనరావు..
పశ్చిమ గోదావరి జిల్లా..
- ఏలూరు రేంజ్ డిఐజి మోహనరావు..
-నూతన రథం నిర్మాణం కూడా ప్రారంభించాం
-వివాదంలో అరెస్ట్ అయిన హిందూవాదులు విడుదలయ్యారు
-ఇంకా పలు రాజకీయ, మత సంస్థలు ఛలో అంతర్వేది కి వస్తున్నారు
-తూర్పుగోదావరి జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంది
-కోనసీమలో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదు
-ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు ఉంటాయి
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire