Live Updates: ఈరోజు (సెప్టెంబర్-17) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం | 17 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | అమావాస్య సా.5-06 వరకు తదుపరి పాడ్యమి | పుబ్బ నక్షత్రం ఉ.10-58 వరకు తదుపరి ఉత్తర | అమృత ఘడియలు: ఉ.6-23 వరకు తిరిగి తె.2-47 నుంచి 4-17 వరకు | వర్జ్యం: సా.5-44 నుంచి 7-15 వరకు | దుర్ముహూర్తం: ఉ.9-54 నుంచి 10-42 వరకు తిరిగి మ.2-45 నుంచి 3-34 వరకు | రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.5-51 | సూర్యాస్తమయం: సా.6-00
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 17 Sep 2020 7:42 AM GMT
Vijayawada updates: దుర్గ గుడి ఘాట్ రోడ్ వద్ద జనసేన పార్టీ నేత పోతిన మహేష్ ఆధ్వర్యంలో అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి నిరసన..
విజయవాడ..
పోతిన మహేష్ జనసేన లీడర్..
-దుర్గ గుడి ఘాట్ రోడ్ వద్ద జనసేన పార్టీ నేత పోతిన మహేష్ ఆధ్వర్యంలో దుర్గమ్మ నీ ఆస్తులు నువ్వే కాపాడుకోవాలని అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి నిరసన..
-ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ వీర మహిళలు, నేతలు..
-దుర్గమ్మ దేవస్థానం లో వెండి సింహాలు మాయం ఘటన లో తక్షణం ఈవో ని సస్పెండ్ చేయాలి...
-రేపు సాయంత్రం లోపు విచారణ పూర్తి చేసి ఘటన బాద్యులుపై చర్యలు తీసుకోకపోతే శనివారం వెల్లంపల్లి ఇంటిని ముట్టడి చేస్తాం..
-దుర్గమ్మ దేవస్థానంలో మూడు సింహాలు మాయం అయిన ఘటన లో విచారణ పారదర్శకంగా జరగటం లేదు..
-దేవస్థానంలో ఈవో గా ఐఏఎస్ అధికారిని నియమించాలి..
-రాష్ట్రంలో దేవాలయల మీద దాడులు కి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి వెల్లంపల్లి రాజీనామా చేయాలి...
- 17 Sep 2020 7:35 AM GMT
Srikakulam updates: జిల్లా అటవీశాఖ కార్యాలయం ఎదుట నర్సరీ కార్మికుల ఆందోళన..
శ్రీకాకుళం జిల్లా..
-బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా..
-కార్యాలయానికి తాళం వేసి నిరసనకు దిగిన కార్మికులు..
-9 నెలలుగా జీతాలు చెల్లోంచడం లేదంటూ ఆందోళన..
- 17 Sep 2020 7:32 AM GMT
Visakha updates: ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ కార్యాలయంలో రక్తదానం శిబిరం..
విశాఖ
-వికలాంగులకు ట్రై సైకిల్స్, కృత్రిమ అవయవాలు పంపిణీ.
-హాజరైన మాజీ ఎంపీ హరిబాబు, నగర బిజెపి నేతలు, కార్యకర్తలు.
-మాజీ ఎంపీ హరిబాబు కామెంట్స్
-నాయకుల జన్మదినాన్ని ఉత్సవాలుగా జరిపే పద్దతి బిజెపిలో లేదు
-మోదీ జన్మదిన సందర్భంగా ఈ నెల 14 నుంచి వారం రోజుల పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము.
-కోవిడ్ నేపథ్యంలో రక్తం అవసరం ఉంటుంది కాబట్టి రక్త దాన శిబిరం నిర్వహించాం.
-మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాం.
-పర్యావరణాన్ని పరిరక్షించడానికి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టం.
-విశ్వ కర్మ జయంతి సందర్భాగా చేతి వృత్తి కళాకారులను సన్మానించిన మాజీ ఎంపీ హరిబాబు.
- 17 Sep 2020 7:27 AM GMT
Guntur updates: అహల్య ఆసుపత్రిలో ప్రధాని మోదీ 70వ జన్మ దిన వేడుకలు..
గుంటూరు...
-వేడుకల్లో పాల్గొని పేద కళాకారులకు నిత్యవసర వస్తువుల పంపిణీ చేసిన కన్నా, మాజీ మంత్రి శనక్కాల అరుణ, ఉమా శంకర్.
కన్నా కామెంట్స్.
-పేద కుటుంబంలో పుట్టి ఉన్నత స్థాయికి ఎదిగారు...
-దేశ సౌరభౌమత్వానికి ఇబ్బంది కల్గించాలని చూసిన వారికి మోదీ సింహస్వప్నంలా నిలిచారు.
-సమర్థవంతంగా మోదీ పరిపాలన చేస్తున్నారు.
-గతంలో కాంగ్రెస్ ఇతర దేశాల పట్ల మెతకవైఖరీ అవలంభించింది.
-ప్రపంచ మొత్తం భారత దేశంవైపు చూసేలా పాలన సాగిస్తున్నారు...
- 17 Sep 2020 7:00 AM GMT
Amaravati upates: తమ అవినీతి నుంచి ప్రజలదృష్టి మరల్చడం తప్ప 15 నెలల్లో వైసీపీ ప్రజలకు చేసిందేంటి?కిమిడి కళా వెంకట్రావు..
అమరావతి..
కిమిడి కళా వెంకట్రావు: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు
-తాడేపల్లిలో ఉన్నది వైసీపీ కేంద్ర కార్యాలయం కాదు, కుట్రలకు కేంద్రాలయం
-వైసీపీ పాలనలో జరిగిన అవినీతిపై విచారణ చేయించే దమ్ము ప్రభుత్వానికి ఉందా?
- 17 Sep 2020 6:56 AM GMT
Vijayasai Reddy: ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత, పక్షపాతంతో ఉంది. ఈ ధోరణి వెంటనే మానుకోవాలి: విజయసాయి రెడ్డి
జాతీయం..
ఢిల్లీ..
-విజయసాయి రెడ్డి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ
-న్యాయ వ్యవస్థ కారణంగా ఆంధ్ర ప్రదేశ్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది
-ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై న్యాయపరమైన అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి
-హైకోర్టు అసాధారణంగా వ్యవహరిస్తోంది
-మీడియా పైన, సోషల్ మీడియా పైనా ఏపీ హైకోర్టు నిషేధం విధించింది
-మాజీ అడ్వకేట్ జనరల్ నమోదైన ఎఫ్ఐఆర్ను రిపోర్ట్ చేయవద్దని నిషేధం విధించింది
-ఈ చర్యలను సమర్ధించుకునే ఏ ఆధారమూ లేదు
-ఈ రకమైన సెన్సార్షిప్ అసాధారణమైనది బ్రిటిష్ తరహాలో వ్యవహరిస్తున్నారు
-దీనికి సంబంధించిన మరో కేసు పైన స్టే విధించారు
-గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇలా వ్యవహరిస్తున్నారు
-మీడియా కవరేజ్, పబ్లిక్ స్క్రూటినీ లేకుండా తప్పించుకోవాలని చూస్తున్నారు
-జుడిషియల్ నుంచి తీవ్రమైన న ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో కరోనా నిరోధంలో రాష్ట్రం ముందు ఉంది
- 17 Sep 2020 6:42 AM GMT
Andrapradesh Latest news: హైదరాబాద్ నుంచి విశాఖ, తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడపండి: విజయసాయి రెడ్డి విజ్ఞప్తి..
జాతీయం
-రైల్వే మంత్రికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విజ్ఞప్తి
-రాజ్యసభలో స్పెషల్ మెన్షనింగ్ ద్వారా కోరిన ఎంపీ
-ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదు
-వలస కార్మికులు, ప్రయాణికులకు ఉన్న రైళ్లు సరిపోవడం లేదు
-కొత్తగా 80 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినా, అందులో హైదరాబాద్-విశాఖ, హైదరాబాద్-తిరుపతి మధ్య ఒక్క రైలు కూడా లేదు
-ఏపీ, తెలంగాణ మధ్య అత్యధికంగా రాకపోకలు సాగించే మార్గాలివి
-ప్రత్యేక రైళ్లను వెంటనే ప్రవేశపెట్టి సహకరించండి
- 17 Sep 2020 5:34 AM GMT
Amaravati updates: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ...
అమరావతి..
-కేంద్ర విద్యుత్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయండి.
-డిస్కంల నిర్వహణ, సబ్సిడీలు, ఈ ఆర్ సి వంటివి కేంద్రం చేతుల్లోకి వెళ్ళిపోయి, రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుంది.
-విద్యుత్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపితే రైతులకిచ్చే ఉచిత విద్యుత్కు మీటర్లు బిగించడం తప్పనిసరి.
-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును రాక్షస బిల్లుగా పరిగణించి, బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసింది.
-కానీ ఏపీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలకు పచ్చజెండా ఊపి ఉచిత విద్యుత్ స్థానంలో నగదు బదిలీ అంటున్నది.
-కేవలం రుణ పరిమితి పెంచుకొని, అప్పులు తెచ్చుకునేందుకు కేంద్రం అనుమతి కోసం కేంద్ర నిర్ణయాలకు సై అనటం సరికాదు.
- 17 Sep 2020 5:29 AM GMT
Vijayawada updates: ఇంద్రకీలాద్రి పై వెండి రథం సింహాల మాయం పై నేడు రెండో రోజు కొనసాగనున్న విచారణ....
విజయవాడ..
-మొదటి రోజు రికార్డ్ లు పరిశీలించిన విచారణ అధికారి మూర్తి...
-నేడు కూడా రికార్డ్ లు పరిశీలించనున్న మూర్తి..
-1999 లో తయారైన రథం
-రథం పై రెండు సింహాలు ఉన్నాయా...? నాలుగు సింహాలు ఉన్నాయా..? అని కొనసాగుతున్న సందిగ్దత...
-మధ్యాహ్నం వెండి రథాన్ని పరిశీలించనున్న విచారణ అధికారి మూర్తి
-ఈవో సురేష్ బాబు తో సమాన హోదా కలిగిన వ్యక్తి ని విచారణ అధికారిగా నియామకం చేయటం పట్ల పలు విమర్శలు...
- 17 Sep 2020 5:24 AM GMT
East Godavari updates: అంతర్వేది రధం దగ్ధం ఘటనకు నిరసనగా బిజెపి, ధార్మిక సంఘాలు నిర్వహించిన ఆందోళన లో పోలీసులు అరెస్టు చేసిన 37 మంది జైలు నుంచి విడుదల..
తూర్పుగోదావరి :
-కాకినాడ సబ్ జైలు నుంచి విడుదల అయిన కార్యకర్తలకు ఘన స్వాగతం పలికిన బిజెపి, జనసేన ధార్మిక సంఘాలు నాయకులు..
-అరెస్టు చేసిన వారిని బెయిల్ పై విడుదల చేయడంతో కాకినాడ సబ్ జైలు నుంచి బిజెపి, హిందూ ధర్మ రక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ..
-హాజరైన ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ పాయింట్స్..
-యువకుల పై కుట్రపూరితంగా కేసులు నమోదు చేశారు, షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం దారుణం..
-కేసులు ఎత్తేసే వరకు వారికి అండగా ఉంటాం.. రాష్ట్రం లో హిందు దేవాలయాలపై దాడులు జరగడం అమానుషం..
-దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం చేసేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోంది..
-అంతర్వేది ఘటనలో ఎటువంటి విచారణ చేపట్టని ప్రభుత్వం ఆందోళన చేసిన వారిపై కేసులు నమోదు చేసింది..
-రేపు అమలాపురం లో మహా ధర్నా నిర్వహిస్తాము..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire