Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం, 06 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం తదియ(రాత్రి 12-15 వరకు) తదుపరి చవితి; శతభిష నక్షత్రం (ఉ.11-18 వరకు) తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-20 నుంచి 5-02 వరకు), వర్జ్యం (సా. 6-18 నుంచి 8-03 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 11-40 నుంచి 12-31 వరకు) రాహుకాలం (మ. 01-30 నుంచి 03-00 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 6 Aug 2020 11:36 AM GMT
అమరావతి
ప్రకాశం జిల్లాలో పేదలకు కేటాయించాలని నిర్ణయించిన 1367 ఎకరాల మైనింగ్ భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వటం లేదని కోర్టుకి తెలిపిన ఏపీ ప్రభుత్వం
మైనింగ్ కు అనుకూలంగా లేవని పిటిషనర్ తండ్రి అఫిడవిట్ ఇచ్చారన్న ప్రభుత్వం
అఫిడవిట్ అవాస్తవమని ప్రభుత్వ నిర్ణయం సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్ పై హైకోర్టులో విచారణ
విచారణలో భాగంగా ఈ భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడంలేదని కోర్టుకి తెలిపిన ప్రభుత్వం
ఈ నెల 13కి తదుపరి విచారణ వాయిదా వేసిన హైకోర్టు
- 6 Aug 2020 11:35 AM GMT
కడప :
కాసేపట్లొ బెయిల్ పై కడప కేంద్ర కారాగారం నుంచి విడుదల కానున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి....
వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ అభియోగాల కేసులో 54 రోజులుగా రిమాండ్ ఖైదీలుగా జైలులొ ఉన్న జేసీ, తనయుడు...
నిన్న బెయిల్ మంజూరు చేసిన అనంతపురం జిల్లా కొర్టు...
బెయిల్ పత్రాలను జైలు అధికారులకు అందజేసిన జెసీ తరుపు న్యాయవాదులు ....
కేంద్ర కారాగారం వద్దకు చేరుకున్న జెసి అనుచరులు, పార్టీ నేతలు..
జైలు పార్మాలిటీస్ పూర్తయ్యాక విడుదల చేయనున్న అధికారులు..
- 6 Aug 2020 11:35 AM GMT
విశాఖ
సృష్టి యూనివర్సల్ పసిపిల్లల ఆక్రమ రవాణా కేసు
నగర పోలీస్ కమీషనర్ ఆర్కే మీనా కామెంట్స్
పోలీసులు దర్యాప్తులో బయటకు వచ్చిన సంచలన విషయాలు
సృష్టి యూనివర్సల్ ఆసుపత్రి కి నగరంలోని పద్మజ ఆసుపత్రి కి లింకులు
కాన్పుల్లో క్లిష్టమైన డెలవరీ కేసులు డాక్టర్ పద్మజ కు రిఫర్ చేసిన నమ్రత
గ్రామీణ ప్రాంతాల నుంచి కాన్పు కోసం వచ్చిన ఓ డెలవరీ కేసును పద్మజ కు అప్పగించిన నమ్రత
నమ్రత సూచనలు మేరకు పుట్టిన బిడ్డను చనిపోయినట్లు తల్లిని నమ్మించిన ఆసుపత్రి సిబ్బంది
బిడ్డ సరోగసి ద్వారా పుట్టినట్లు రికార్డు సృష్టి
విజయనగరం దంపతులుకు 13 లక్షలు కు విక్రయం
సృష్టి యూనివర్సల్ కేసు బయటకు రావడంతో ఎంవిపి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన చోడవరంకు చెందిన మహిళా
ఈ కేసులో మరో ఇద్దర్ని అరెస్టు చేసిన పోలీసులు
డాక్టర్ పద్మజ,ఆశవర్కర్ నూకరత్నం అరెస్టు చేసిన పోలీసులు
సృష్టి పసిపిల్లల ఆక్రమ రవాణా కేసులో 8 చేరిన అరెస్టులు.
- 6 Aug 2020 10:26 AM GMT
అమరావతి
యనమల రామకృష్ణుడు
రాజధానికి వైసిపి వేసిన ఉరితాళ్లను తొలగించాల్సింది కేంద్రమే
ఆర్టికల్ 355(సి) ప్రకారం కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలి
ఈ సంక్షోభం నుంచి రైతులను, రాష్ట్రాన్ని గట్టెక్కించాల్సింది కేంద్రమే..
సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం ఎందుకు తప్పించుకుంటుందో అర్ధం కావడం లేదు...
ఇలాంటి సంక్షోభం తలెత్తినప్పుడు జోక్యం చేసుకోవడానికి కేంద్రానికి స్పష్టమైన అధికారాలు ఉన్నాయి.
దీనిపై గతంలో దేశంలో అనేక దృష్టాంతాలు ఉన్నాయి.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 మూడు రకాల మార్గదర్శకాలను నిర్దేశిస్తోంది..
- 6 Aug 2020 10:26 AM GMT
తూర్పు గోదావరి
.కాకినాడ....
జిల్లా లో ఈరోజు కరోనా పాజిటివ్ కేసులు-1,351 కాగా
కాకినాడ అర్బన్ లో రూరల్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు-425.
రాజమండ్రి మరియు రూరల్ లో 325 కరొనా కెసులు నమోదు.
- 6 Aug 2020 10:26 AM GMT
అమరావతి
టిటిడి ఆస్తుల వేలం పిటిషన్ పై హైకోర్టులో విచారణ..
వేలం ప్రక్రియ నిలిపివేశామని హైకోర్టు కు తెలిపిన టిటిడి స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు..
పిటిషనర్లు లేవనెత్తిన అంశాలు, వేలం లో తీసుకున్న చర్యలపై పది రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన కోర్టు..
- 6 Aug 2020 10:25 AM GMT
అమరావతి
ఉన్నత విద్యపై సీఎం సమీక్ష – కీలక నిర్ణయాలు
గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్‌ను 90 శాతానికి తీసుకెళ్లాలి
మూడేళ్లు, నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో పది నెలల పాటు అప్రెంటిస్‌షిప్
ఆపై మరో ఏడాది పాటు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పించే కోర్సుల బోధన
అవి నేర్చుకుంటే ఆనర్స్ డిగ్రీ
యూనివర్శిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్
అక్టోబరు 15న తెరుచుకోనున్న కాలేజీలు
సెప్టెంబరులో సెట్ల నిర్వహణ
విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో యూనివర్శిటీల ఏర్పాటు
పాడేరులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు
అక్రమాలకు పాల్పడే కాలేజీలపై కఠిన చర్యలు
- 6 Aug 2020 10:25 AM GMT
తూర్పుగోదావరి - రాజమండ్రి
టుడే ఆఫ్టేడ్స్ ....
జిల్లాలో కరోనా విజృంభన
కరోనా కేసులలో రాష్ట్రంలోనే తొలిస్థానంలో తూర్పుగోదావరి
గత 24 గంటల్లో 1351 పాజిటీవ్ కేసులు నమోదు
27వేల 580 కి చేరుకున్న
పాజిటివ్ కేసులసంఖ్య
యాక్టీవ్ కేసులు సంఖ్య 12వేల 593
కోలుకున్న కరోనా బాధితుల సంఖ్య 14వేల792
కరోనా మృతుల్లోనూ తూర్పుదే మొదటిస్థానం
- 6 Aug 2020 8:40 AM GMT
విశాఖ:
- గంటా శ్రీనివాసరావు కు వ్యతిరేకంగా నియోజకవర్గం వ్యాప్తటగా వైఎస్ఆర్ సిపి శ్రేణులు నిరసన
- మాకొద్దు భూకబ్జాదారుడు గంటా మాకొద్దు అంటూ నినాదాలు
- మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో రాకను వ్యతిరేకిస్తూ భీమిలి నియోజకవర్గంలో పలుచోట్ల నిరసనలు,
- మధురవాడ వైఎస్సార్ క్రికెట్ స్టేడియం వద్ద నిరసనలు
- గంటా శ్రీనివాసరావు తీసుకోవద్దు అంటూ నినాదాలు
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire