Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం, 06 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం తదియ(రాత్రి 12-15 వరకు) తదుపరి చవితి; శతభిష నక్షత్రం (ఉ.11-18 వరకు) తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-20 నుంచి 5-02 వరకు), వర్జ్యం (సా. 6-18 నుంచి 8-03 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 11-40 నుంచి 12-31 వరకు) రాహుకాలం (మ. 01-30 నుంచి 03-00 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 6 Aug 2020 2:17 PM GMT
కడప కేంద్ర కారాగారం నుంచి విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి, తనయుడు అస్మిత్ రెడ్డి
కడప :
- కడప కేంద్ర కారాగారం నుంచి విడుదలైన తాడిపత్రి టిడిపి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, తనయుడు అస్మిత్ రెడ్డి
- జైలు నుంచి బయటకు వచ్చి తాడిపత్రికి పయనం
- తాడిపత్రి నుంచి భారీగా తరలివచ్చిన టిడిపి కార్యకర్తలు
- 6 Aug 2020 2:16 PM GMT
సినీ నటులు చిరంజీవి తో భేటీ అయిన ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోం వీర్ రాజు..
- మాజీ కేంద్ర మంత్రులు ప్రముఖ సినీ నటులు చిరంజీవి తో భేటీ అయిన ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోం వీర్ రాజు.
- మర్యాద పూర్వక భేటీ అంటున్న బీజేపీ నేతలు.
- సోము వీర్రాజు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి.
- బిజెపి జనసేన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పవన్ కళ్యాణ్ ,సహకారంతో వీర్రాజు ముందుకెళ్లాలని చిరంజీవి ఆకాంక్షించారు.
- 6 Aug 2020 2:15 PM GMT
ఉన్నత విద్యపై సిఎం జగన్ సమీక్ష చేశారు: మంత్రి ఆదిమూలపు సురేష్
అమరావతి:
- విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్...
- ఉన్నత విద్యపై సిఎం జగన్ సమీక్ష చేశారు.
- నూతన జాతీయ విద్యా విధానం వచ్చాక ఎలా విద్యారంగాన్ని ముందుకుతీసుక వెళ్లాలి
- మంచి పాఠ్య ప్రణాళికతో విద్యా సంవత్సరం ప్రారంభిస్తాం.
- గ్రాస్ ఎన్రోల్ మెంట్ రేషియో 90 శాతం కు సిఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు.
- వృత్తి విద్యా నైపుణ్యాభి వృద్ధి, ఉపాధి కల్పించే విధంగా డిగ్రీ నాలుగు ఏళ్లపాటు ఆనర్స్ కోర్సులు వుంటుంది.
- బిటెక్ ఆనర్సు కోర్సు లు గా రూపొందించాం.
- ప్రకాశం, విజయనగరం లలో కొత్త యూనివర్సిటీలు ఏర్పాటు.
- ప్రకాశం జిల్లాలో టీచర్స్ ట్రైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు.
- ఈ యూనివర్సిటీ ద్వారా టీచింగ్ లో కొత్త కోర్సులు తీసుకవస్తున్నాం
- ప్రభుత్వ కాలేజిలను గత ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యం చేశాయి.
- జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యా రంగంలో అనేక సంస్కరణ తెచ్చింది.
- అక్టోబరు 15 లోగా కాలేజిలు ప్రారంభిస్తాం.
- కామన్ ఎంట్రెన్స్ టెస్టులు సెప్టెంబరు మూడవ వారం నుండి ప్రారంభిస్తాం.
- 6 Aug 2020 2:13 PM GMT
అనపర్తి శాసనసభ్యుడు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటివ్..
తూర్పుగోదావరి :
- సెల్ఫీ వీడియో విడుదల చేసిన ఎమ్మెల్యే..
- తన ఆరోగ్యంపై ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని కోరిన ఎమ్మెల్యే..
- చికిత్స నిమిత్తం హైదరాబాద్ పయనమైన ఎమ్మెల్యే..
-తన కార్యాలయంలో సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని వెల్లడించిన అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి..
- 6 Aug 2020 12:41 PM GMT
కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ వద్ద హై డ్రామా..
శ్రీకాకుళం జిల్ల:
- మనస్తాపం చెంది పోలీస్ స్టేషన్లలోనే ఆత్మహత్యకు యత్నించిన మహిళ..
- కేసు విషయంలో తన కుమారుడిని కోటబొమ్మాలి ఎస్.ఐ కొట్టారని మహిళ యర్రమ్మ ఆందోళన..
- స్టేషన్ లొనే శానిటైజర్ తాగి ఆత్మహత్యకు యత్నించిన యర్రమ్మ..
- యర్రమ్మను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు..
- 6 Aug 2020 12:36 PM GMT
తిరుమలలో విషాదం..
- శ్రీవారి ఆలయంలో విధులు నిర్వర్తించే అర్చకుడు కరోనాతో మృతి.
- కొద్దీ రోజుల క్రిత్తమే గోవిందరాజుల స్వామి ఆలయం నుంచి డెప్యూటేషన్ పై తిరుమలకు వచ్చిన అర్చకుడు.
- వారం క్రిత్తం కరోనా నిర్దారణ కావడంతో వైద్యం కోసం స్విమ్స్ కు తరలించిన టీటీడీ.
- స్విమ్స్ లో చికిత్స పొందుతూ కాసేపటి క్రిత్తం మృతి చెందిన అర్చకుడు.
- తోటి అర్చకుడు మృతి చెందడంతో తీవ్ర విషాదంలో అర్చకులు.
- అధికారికంగా దృవీకరించని టీటీడీ.
- 6 Aug 2020 12:35 PM GMT
అమరావతిలో ఆస్తులను కాపాడుకోవడానికి చంద్రబాబు: ఎమ్మెల్యే పార్థసారథి
అమరావతి:
- అమరావతిలో ఆస్తులను కాపాడుకోవడానికి చంద్రబాబు తాపత్రయం పడుతున్నాడు..
- తన ఎమ్మెల్యేలు పోయిన పర్వాలేదు తనకు అమరావతి ముఖ్యమనే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు..
- రాజధాని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందని కేంద్రం స్పష్టంగా చెప్పింది..
- ఐదు వేల కోట్లు అమరావతి కోసం చంద్రబాబు ఖర్చు చేశారు..
- 52 వేల కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు అసత్యాలు మాట్లాడుతున్నారు..
- కోర్టులను కూడా చంద్రబాబు మోసం చేస్తున్నారు..
- చంద్రబాబు అమరావతి కోసం ఎక్కడ 52 వేల కోట్లు ఖర్చు చేశారో చెప్పాలి..
- crdaను చంద్రబాబు రియల్ ఎస్టేట్ ఆదరిటీగా మార్చేశారు...
- అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని అమరావతి రైతులను చంద్రబాబు మోసం చేశాడు..
- ఇష్టానుసారంగా రాజధానిలో తన బినామిలకు చంద్రబాబు భూములు ధారాదత్తం చేసాడు..
- అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తున్న వారు అంత రియల్ ఎస్టేట్ వ్యాపారులు..
- అమరావతి మీద ప్రేమతో కాదు వాళ్ళ వ్యాపారం కోసం ఉద్యమం చేయిస్తున్నారు..
- అమరావతి అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాము..
- పవన్ కళ్యాణ్ గుంటూరు కృష్ణ జిల్లాల ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని అజ్ఞాతివాసిగా మాట్లాడుతున్నారు..
- మాకు అన్ని ప్రాంతాలు సమానాభివృద్దే ముఖ్యం..
- రాజధాని రాష్ట్ర పరిధిలో ఉందని చెప్పిన టీడీపీ నేతలు బుద్ది లేకుండా ఇంకా కేంద్రం జోక్యం చేసుకోవాలని మాట్లాడుతున్నారు..
- జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను కట్ కట్ చేసి ఎల్లో మీడియా చూపిస్తుంది..
- రాజధానికి ప్రభుత్వ భూమి 30 వేల ఎకరాలు ఉండాలని అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చెప్పారు..
- చంద్రబాబు మతి భ్రమించి వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని మాట్లాడుతున్నారు..
- గతంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికలకు వెళ్లారు..
- కేసీఆర్ తెలంగాణ వాదం కోసం గతంలో ఉప ఎన్నికలకు వెళ్లారు..
- అమరావతిపై చంద్రబాబు ఉప ఎన్నికలకు వెళ్లాడనికి భయపడుతున్నారు..
- 6 Aug 2020 12:31 PM GMT
కడప :
- కడప కేంద్ర కారాగారం వద్దకు చేరుకున్న జెసీ దివాకర్ రెడ్డి తనయుడు జెసి పవన్ కుమార్ రెడ్డి....
- భారీగా చేరుకున్న అభిమానులు, టిడిపి శ్రేణులను...
- కేంద్ర కారాగారం వద్దకు వచ్చిన అనుచరులు, అబిమానులను తరిమి వేసిన పొలీసులు
- 6 Aug 2020 12:30 PM GMT
అరకు ఏమ్మేల్యే శెట్టి పాల్గుణ కామెంట్స్
విశాఖ జిల్లా:
- తనకు కరోనా వచ్చిందని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని అది నిజం కాదని అరకు ఎమ్మెల్యే శెట్టి ఫల్గుణ చెప్పారు
- తన కుటుంబ సభ్యులకు కరోనా వచ్చి తగ్గిపోయిందని తాను వారిని కలవను కూడా లేదని పేర్కొన్నారు
- కరోనాను తరిమి కొట్టడానికి అందరూ ముందుకు రావాలని కోరారు
- రేపటి నుండి పది రోజుల పాటు అరకు స్వచ్చ లాక్ డౌన్ ప్రకటించటం జరిగిందని అందరూ సహకరించాలని కోరారు
- 6 Aug 2020 12:27 PM GMT
అమరావతి:
- ప్రకాశం జిల్లాలో పేదలకు కేటాయించాలని నిర్ణయించిన 1367 ఎకరాల మైనింగ్ భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వటం లేదని కోర్టుకి తెలిపిన ఏపీ ప్రభుత్వం
- మైనింగ్ కు అనుకూలంగా లేవని పిటిషనర్ తండ్రి అఫిడవిట్ ఇచ్చారన్న ప్రభుత్వం
- అఫిడవిట్ అవాస్తవమని ప్రభుత్వ నిర్ణయం సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్ పై హైకోర్టులో విచారణ
- విచారణలో భాగంగా ఈ భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడంలేదని కోర్టుకి తెలిపిన ప్రభుత్వం
- ఈ నెల 13కి తదుపరి విచారణ వాయిదా వేసిన హైకోర్టు
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire