Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం, 06 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం తదియ(రాత్రి 12-15 వరకు) తదుపరి చవితి; శతభిష నక్షత్రం (ఉ.11-18 వరకు) తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-20 నుంచి 5-02 వరకు), వర్జ్యం (సా. 6-18 నుంచి 8-03 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 11-40 నుంచి 12-31 వరకు) రాహుకాలం (మ. 01-30 నుంచి 03-00 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 6 Aug 2020 8:39 AM GMT
అమరావతి:
- ఉన్నత విద్యపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష
- విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌తో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరు
- 6 Aug 2020 8:39 AM GMT
జంగాలదరువు గ్రామంలో రెండు అలయాల్లో హుండీలు చోరీ..
నెల్లూరు:
- సంగం (మం) జంగాలదరువు గ్రామంలో రెండు అలయాల్లో హుండీలు చోరీ.
- పూజారి,కాపలా సిబ్బంది ని లోపల బంధించి హుండీ చోరీ చేసిన దుండగులు.
- గ్రామస్థుల ఫిర్యాదు తో దర్యాప్తు చేపట్టిన ఎస్సై శ్రీకాంత్.
- 6 Aug 2020 8:37 AM GMT
అమరావతిని అభివృద్ధి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించాం..
- శివ రామకృష్ణ కమిటీ వేశారు, ఆ నివేదిక పరిగణనలోకి తీసుకోవాలని చెప్పాం.
- విశాఖ ప్రజలు అంతా ఈ ప్రాంత అభివృద్ధి కోరుకుంటున్నారు.
- ఉత్తరాంధ్ర ప్రజలు అక్కర్లేదా అనే ధోరణి కనిపిస్తోంది.
- రాష్ట్రం అంటే అమరావతి, ఆ 29 గ్రామలేనా.
- మూడు రోజులు నుంచి సహనంతో పరిశీలిస్తున్నాము
- గడిచిన 5 సంవత్సరాలలో చంద్రబాబు తీసుకున్న విధానాలు,నిర్ణయాలు వల్ల రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది.
- రాష్ట్ర విభజన సమయం చంద్రబాబు ఇచ్చిన లేఖ ఫలితం అందరికి తెలుసు.
- మా పార్టీ నినాదం వికేంద్రీకరణ.
- 13 జిల్లా లు అభివృద్ధి మా ప్రభుత్వ నినాదం.
- ప్రతిపక్షం పదవులను త్యాగం చేసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళండి.
- కేంద్ర హోమ్ శాఖ రాజధాని అంశం మా పరిధిలో లేదని స్పష్టం చేసింది.
- రాష్ట్ర ప్రభుత్వం జులై 21 మూడు రాజధానులు పై అధికారిక గెజిట్ కూడా విడుదల చేసింది.
- 6 Aug 2020 8:24 AM GMT
Hmtv తో వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి
అమరావతి:
- దోచుకోవటనికి అడ్డాగా అమరావతిని మార్చేశారు
- రాజధాని అమరావతి లో పెట్టి గుంటూరు,కృష్ణ జిల్లా రైతులకు చంద్రబాబు అన్యాయం చేసారు.
- పొలిటికల్ exit కోసం చంద్రబాబు హైద్రాబాద్ లో ఉండి దారులు వెతుకుంటున్నారు
- అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయాలి అన్ని లక్ష్యం తోనే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నాం
- పవన్ రెండు చోట్ల ఓడిపోయి సిగ్గు లేకుండా form హౌస్ లో ఉండి మమ్మల్ని రాజీనామా చేయమనడం సిగ్గు చేటు..
- రాజధాని విషయంలో మరోసారి కేంద్రం స్పష్టంగా చెప్పింది ఇప్పటికైనా చంద్రబాబు చిల్లర రాజకీయాలు మానుకోవాలి..
- 3 రాజధానులు ప్రజా వ్యతిరేకిస్తున్నారు అన్ని చంద్రబాబు అంటున్నారు ...గతం లో ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు కేసీఆర్, జగన్ ప్రజల్లోకి వెళ్లి గెలిచి వచ్చారు..
- చంద్రబాబుకు రాజీనామా చేసే దమ్ము, ధైర్యం లేక మాకు డెడ్ లైన్ విధిస్తున్నారు..
- 6 Aug 2020 8:23 AM GMT
కర్నూల్:
- ఎంఎల్సీ రవీంద్ర బాబు వాఖ్యలపై మండి పడ్డ టీడీపీ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు.
- ఎంఎల్సీ రవీంద్ర బాబు పై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సోమిశెట్టి..
- జగన్ వెంట్రుక కూడా ఎవరూ పీక్కో లేరు అంటూ ఎంఎల్సీ రవీంద్ర న్యాయ వ్యవస్థనే కించ పరిచాడు...
- న్యాయవ్యవస్థ,జడ్జీ లను అసభ్య కరంగా మాట్లాడిన ఎంఎల్సీ రవీంద్ర పై చర్యలు తీసుకోవాలి.
- గవర్నర్ వెంటనే స్పందించి రవీంద్ర ను ఎంఎల్సీ పదవి నుంచి తొలగించాలి..
- 6 Aug 2020 8:22 AM GMT
తూర్పు గోదావరి జిల్లా:
అమలాపురం పట్టణానికి చెందిన ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు కరోనా తో మృతి
కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
- 6 Aug 2020 8:19 AM GMT
కాకినాడ జీజీహెచ్ లో ఈ నెల 10 వ తేదీ వరకు ఓపి సేవలు పొడిగింపు..
తూర్పుగోదావరి:
- కాకినాడ జీజీహెచ్ లో ఈ నెల 10 వ తేదీ వరకు ఓపి సేవలు పొడిగింపు..
- కొవిడ్ హాస్పిటల్ గా మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపధ్యంలో నేటి నుంచి అన్ని సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన వైద్యాధికారులు..
- దూర ప్రాంతాల నుంచి రోగుల కోసం మరో నాలుగు రోజులు ఈనెల ఓపీ సేవలు కొనసాగించాలని ఆదేశించిన కలెక్టర్ మురళీధర్‌రెడ్డి..
- 6 Aug 2020 8:17 AM GMT
మంత్రి బొత్స సత్య నారాయణ కామెంట్స్
విశాఖ:
- మూడు రోజులు నుంచి చంద్రబాబు వీధి నాటకం ఆడుతున్నారు.
- చంద్రబాబు సమాజం కోసం కాకుండా , సామాజిక వర్గం కోసం ఆలోచిస్తున్నారు.
- చంద్రబాబు కొత్త పద్ధతులు మొదలు పెట్టారు.
- శాసన సభలో వెనక ,ముందు కట్ చేసి వారికి అనుకూలంగా ఉన్న మాటలను చూపిస్తున్నారు.
- దేశ రాజకీయాలలో కూడా ద్వంద వైఖరి అవలభించారని జాతీయ పార్టీ నాయకులే చెప్తున్నారు.
- 6 Aug 2020 8:11 AM GMT
ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాలు వెల్లడించిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్
- 4 శాతం వద్దే రెపో రేటు, రివర్స్ రెపో 3.35 శాతంగా కొనసాగింపు.
- రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ అధ్యక్షతన మూడు రోజులపాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించేందుకే నిర్ణయం.
- ఆర్థిక వ్యవస్థకు కోవిడ్-19 విసురుతున్న సవాళ్ల నేపథ్యంలో ఎంపీసీ ఇందుకు ఏకగ్రీవ ఆమోదాన్ని తెలిపినట్లు సమాచారం.
- అవసరమైతే తగిన సందర్భంలో మరిన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire