Live Updates:ఈరోజు (ఆగస్ట్-05) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం, 05ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం విదియ(రాత్రి 9-34 వరకు) తదుపరి తదియ; ధనిష్ఠ నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి శతభిష నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-20 నుంచి 5-02 వరకు), వర్జ్యం (సా. 5-04 నుంచి 6-47 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 11-40 నుంచి 12-31 వరకు) రాహుకాలం (మ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-౨౯
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 5 Aug 2020 9:41 AM GMT
108 సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.
శ్రీకాకుళం జిల్లా: పాము కాటుకు గురైన మహిళ ను శ్రీకాకుళం తరలించడానికి రెండు 108 వాహనాలు సిబ్బంది మధ్య తలెత్తిన వివాదం.
మహిళను బయట ఉంచి గంట పాటు వాదించుకున్న రెండు 108 వాహనాల సిబ్బంది.
చివరకు 108 వాహనం వద్దనే ప్రాణాలు వదిలిన మహిళ.
ఈ రోజు ఉదయం పాము కాటుకు గురైన ఇచ్ఛాపురం మండలం ముచ్చింద్ర కు చెందిన సాడి తులసమ్మ.
ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన బంధువులు.
తులసమ్మ పరిస్థితి విషమం గా ఉండటంతో శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రి కి రిఫర్ చేసిన సిబ్బంది.
ఇచ్ఛాపురం 108 కోవిడ్ రోగుల కు కేటాయించడంతో కవిటి మండలం 108 ను రప్పించిన ఆసుపత్రి సిబ్బంది.
- రెండు గంటల తరువాత వచ్చిన కవిటి 108 వాహనం.
- ఇచ్ఛాపురం 108 ఉంటుండగా తమను పిలవడంపై కవిటి 108 సిబ్బంది ఆగ్రహం.
- సుమారు గంట పాటు ఇరు వాహనాలు సిబ్బంది మధ్య వాగ్వివాదం.
- సుమారు మూడు గంటలు ఆలస్యం కావడంతో మృతి చెందిన తులసమ్మ.
- 108 వాహనాల వద్ద మృతురాలి బంధువుల ఆందోళన.
- 5 Aug 2020 9:38 AM GMT
రైతుల శాపం వల్లే చంద్రబాబు ఓటమి: పండుల రవీంద్ర బాబు
తూర్పు గోదావరి: అల్లవరం మండలం ఎమ్మెల్సీగా ఎన్నికై తొలిసారి అమలాపురం నియోజకవర్గం అల్లవరం వచ్చిన పండుల రవీంద్ర బాబుకు ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు.
పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటే చంద్రబాబు కేవలం ఓటుకు నోటు కేస్ నుండి తప్పించుకోవడానికి విజయవాడ తరలించేసాడు.
రైతులకు అన్యాయం జరిగిందని ఆందోళన చేస్తున్నవారు అందరూ రైతులు కాదు.. రైతుల ముసుగులో ఉన్న రియల్ఎస్టేట్ వ్యాపారులు..ఎమ్మెల్సీ
రైతుల శాపమే చంద్రబాబు ఓటమి..
జగన్ విశాఖపట్నం రాజధానిని ఎంచుకోవడం ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదు ...
రాజకీయ దురుద్దేశం ఉంటే కడప ,పులివెందుల లో రాజధాని పెట్టేవాడు..
- 5 Aug 2020 9:32 AM GMT
కావాలంటే మేనిఫెస్టోలో చూడండి: కిలారి రోశయ్య
గుంటూరు: ఎమ్మెల్యె కిలారి రోశయ్య కామెంట్స్...
- వైసీపీ మ్యానిఫెస్టోలో అమరావతి తరలింపు పై మాట్లాడలేదు అని చంద్రబాబు అంటున్నారు...
- అమరావతి నుండి రాజధాని ని మార్చటం లేదు.
- ఉమ్మడి రాష్ట్రం కింద హైదరాబాద్ లోనే మనం ఉండవచ్చు...
- భారీగా అద్దెలు కట్టుకోవాల్సి వచ్చిందంటే అందుకు చంద్రబాబు కారణం
- వేల ఎకరాలు,కోట్ల రూపాయలు వసూలు చేస్తాం అని చంద్రబాబు మ్యానిఫెస్టోలో పెట్టారా..
- రైతుల నుండి బలవంతంగా భూముల లాక్కున్నారు.
- 5 సంవత్సరాలలో ఎక్కడ అభివృద్ధి చేయలేదు..
- జగన్ సర్కారు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంది..
[-మీరు మాకు అల్టిమేటం ఇవ్వటం కాదు
- మేమే మీకు అల్టిమేటం ఇస్తున్నాం...
- మీకు నైతిక విలువలు ఉంటే టీడీపీ ఎమ్మెల్యే లు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళాలి
- 5 Aug 2020 9:26 AM GMT
ప్లాస్మా దానానికి ముందుకు వచ్చిన ఎమ్మెల్యే, కలెక్టర్
గుంటూరు: కరోనా పాజిటివ్ నుండి బయట పడి ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వచ్చిన ఎమ్మెల్యే కిలారి రోశయ్య,జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్.
ప్లాస్మా దానం పై అవగాహన కల్పిస్తూ రెడ్ క్రాస్ సొసైటీలో ప్లాస్మా దానం చేస్తూ అంగీకార పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే,జిల్లా కలెక్టర్.
జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ కామెంట్స్...
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదు కావడమే కాకుండా మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది.
జులై నెలలోనే 170 కరోనా మరణాలు జిల్లాలో నమోదయ్యాయి.
కరోనా మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్లాస్మా డొనేషన్ ను ప్రోత్సహిస్తుంది.
బ్లడ్ బ్యాంక్ లలో ప్లాస్మా సేకరణకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
సేకరించిన ప్లాస్మాను ప్రత్యేక కమిటీ నిర్ణయించిన వారికి ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం...
- 5 Aug 2020 9:18 AM GMT
ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ కామెంట్స్...
గుంటూరు:
అయోధ్యలో రామమందిరం శంకస్థాపనకు మద్దతుగా బ్రాడీపేట రామాలయంలో ప్రత్యేక పూజలు.
హిందూ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజలలో పాల్గొని సీతా రాముల విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ,బిజెపి నేత ధారా సాంబయ్య.
ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ కామెంట్స్: శ్రీరామ చంద్రుడు అందరివాడు.ఒక కుల,మత,ప్రాంతాలకి సంబందించిన వాడు కాదు.
శ్రీరాముడి జన్మస్థలంలో గుడి కట్టేందుకు శంకుస్థాపన చేయడం సంతోషదాయకం.
రామమందిరం నిర్మాణం తో ప్రజలకు కరోనా నుండి విముక్తి లభించాలి.
ప్రసిద్దిగాంచిన ఒంటిమిట్టలో రామాలయం నిర్మించిన జాంబవంతుడికి కూడా అక్కడే గుడి కట్టించాలి
- 5 Aug 2020 8:44 AM GMT
కడప కలెక్టరేట్ లో కరోనాపై సమీక్ష సమావేశం
కడప : కలెక్టరేట్ లొ కోవిడ్ -19 పై డిప్యూటి సిఎం అంజద్ భాష, ఇన్ చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలొ పాల్గొన్న వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాన్ని...
కార్యక్రమంలో పాల్గొన్న చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎంపి వై.ఎస్.అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, ఎస్పీ అన్బు రాజన్, జేసిలు గౌతమి, సాయికాంత్ వర్మ , జిల్లా వైద్య శాఖాధికారులు...
- 5 Aug 2020 8:40 AM GMT
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య..
అనంతపురం : వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలో అప్పుల బాధతో రమేష్ అనే కౌలు రైతు పురుగుల మందు సేవించి ఆత్మహత్య..
- 5 Aug 2020 8:37 AM GMT
రైలు కింద పడి యువకుడి మృతి
అనంతపురంలోని కొత్తచెరువు మండలం నాగిరెడ్డి పల్లి సమీపంలో ప్రమాదవశాత్తు రైలు కింద పడి కొత్తచెరువుకి చెందిన మోహన్(30) మృతి.
- 5 Aug 2020 8:34 AM GMT
చంద్రబాబుపై వైసీపీ ఎమ్మేల్యే ఫైర్
ప.గో :చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ.
విభజన చట్టంలో పొందుపరిచిన ఏ అంశాన్ని చంద్రబాబునాయుడు ఫుల్ ఫిల్ చేయలేదు.
దీనిలో ఆయన స్వార్థం ఉంది.
శివరామకృష్ణ కమిటీ ని కనీసం పట్టించుకోలేదు.
ఆయన ఒక చక్రవర్తి అని కలగన్నాడు.
రాజధానిలో ఐదు సంవత్సరాల కాలంలో ఏమి నిర్మాణం చేశాడు..?
కపట నాటకానికి, కుట్రపూరిత రాజకీయానికి తెరతీశాడు.
సుమారు రెండు వేల ఎకరాల భూమిని అమ్ముకున్నాడు కానీ ఏ ఒక్క రైతుకు ప్రయోజనం కలగలేదు.
జగన్ పై ఆరోపణలు చేశారు. ఏమాత్రం తప్పు లేదు గనకే విచారణ ఎదుర్కొన్నాడు.
కానీ మీ మీద ఆరోపణ వస్తే 18 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారు.
స్టేలు తెచ్చుకుంటే మీరు నిరపరాధి కాదు.
స్టేలు తెచ్చుకున్నంత మాత్రాన నిజాయితీపరులు కాదు.
అమరావతి భవనాల్లో మీరు చేసిన స్కాం లు సి బి ఐ ఎంక్వయిరీ లో అన్నీ బయటకు వస్తాయి.
కచ్చితంగా వాటిని అనుభవించాలి. అనుభవించే రోజులు వస్తాయి.
న్యాయస్థానాన్ని మభ్యపెట్టి, మేనేజ్ చేసి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం కోసం చేసే ప్రయత్నం ప్రజాస్వామ్యవాదులు క్షమించరు.
- 5 Aug 2020 8:28 AM GMT
వారి అంత్యక్రియలు అడ్డుకోవడం సరికాదు: జిల్లా ప్రధాన న్యాయముర్తి
గుంటూరు: జిల్లా ప్రధాన న్యాయముర్తి జి. గోపిచంద్
కోవిడ్ మరణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.
కోవిడ్ తో మృతి చెందిన వారి అంత్యక్రియలు అడ్డుకోవడం సరికాదు.
గ్రామాల లో అంత్యక్రియలు ఎక్కువగా అడ్డుకుంటున్నారు.
అంత్యక్రియలు అడ్డుకునే హక్కు ఎవరికి లేదు.
అంత్యక్రియలు అడ్డుకునే వారిపై కేసులు పెట్టేందుకు వెనుకాడం.
ప్రజలు మూడ నమ్మకాలు వదిలేయండి....
ఎవరి మత విశ్వాస ప్రకారం వారు అంత్యక్రియలు చేసుకోనివ్వాలి.
మండల స్దాయి లో దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం.....
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire