Live Updates:ఈరోజు (ఆగస్ట్-05) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 05 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం, 05ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం విదియ(రాత్రి 9-34 వరకు) తదుపరి తదియ; ధనిష్ఠ నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి శతభిష నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-20 నుంచి 5-02 వరకు), వర్జ్యం (సా. 5-04 నుంచి 6-47 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 11-40 నుంచి 12-31 వరకు) రాహుకాలం (మ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-౨౯
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 5 Aug 2020 12:29 PM GMT
ఇచ్చాపురం 108 సిబ్బంది నిర్లక్ష్యం ఘటన పై స్పందించిన జిల్లా కలెక్టర్ జె.నివాస్..
శ్రీకాకుళం జిల్లా:
- ఘటన పై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశం..
- రెండు 108 వాహనాల సిబ్బంది మద్య తలెత్తిన వివాదం..
- ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించకుండా గంటపాటు వాదులాడుకోవడం..
- 108 వాహనం ఎక్కించకుండానే మహిళ ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా పరిగణిస్తున్నామన్న కలెక్టర్ నివాస్..
- సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఇచ్చాపురం తహశీల్దార్ మరియు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్ నివాస్..
- 5 Aug 2020 11:44 AM GMT
మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ప్రెస్ మీట్
అనంతపురం :
- మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ప్రెస్ మీట్
- వైద్య ఆరోగ్యశాఖ మీటింగ్ లో ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి వాస్తవాలు చెప్పడాన్ని అభినందిస్తున్నా.
- అధికార పార్టీ ప్రజాప్రతిని చేసిన ఆరోపణ పై ప్రభుత్వం విచారణ జరపాలి.
- కరోన విషయం లో అనంత వెంకటరామిరెడ్డి వాస్తవాలు చెప్పారు
- ఆర్డీటీ సంస్థ అందిస్తోన్న సేవలు ప్రభుత్వం ఎందుకు అందించలేకపోతోంది.
- జిల్లా సమావేశంలో ఓ ప్రజాప్రతినిధి చెప్పిన
- వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలి
- సాధారణ ఆసుపత్రిని, కోవిడ్ ఆసుపత్రిని వేరు వేరు గా ఉంచాలి.
- నిర్వహణ ప్రభుత్వం చేయలేకపోతే స్వచ్చంద సంస్థ ఆర్డీటీ కి జిజిహెచ్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలను అప్పగించండి.
- 5 Aug 2020 11:43 AM GMT
అన్ లాక్ 3.0 అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
అమరావతి:
- కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో అన్ లాక్ ప్రక్రియ
- ఆగస్టు 31 వరకు విద్యాసంస్థలకు అనుమతులు నిరాకరణ
- సినిమా హాలు, స్విమ్మింగ్ పూల్స్, బార్ లు కు నో ఛాన్స్
- తగిన జాగ్రత్తలతో యోగ ట్రైనింగ్ సెంటర్ లు, జిమ్ లకు నేటి నుండి అనుమతి
- స్వతంత్రదినోత్సవ వేడుకలు భౌతిక దూరం పాటిస్తూ నిర్వహించాలని ఆదేశం
- కంటోన్మెంట్ జోనుల్లో ఈ నెలలో 31 వరకు లాక్ డౌన్ కొనసాగింపు
- 5 Aug 2020 11:42 AM GMT
వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..
- వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, పశ్చిమబెంగాల్ లమధ్య తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది....
- దీనికి అనుబంధం గా 7.5కిమీ ఎత్తున ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది...
- దీని ప్రభావం వల్ల ఉత్తర తెలంగాణ ,ఈశాన్య తెలంగాణ జిల్లాలో,ఉత్తర కోస్తా లో ఈరోజు ,రేపు ఒకటి రెండు చోట్లా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది...
- రాగల మూడు రోజుల పాటు తెలంగాణ జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది...
- ఉత్తర,దక్షిణ కోస్తాలో ఈరోజు ,రేపు ఒకటి రెండు చోట్లా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది...
- రాయలసీమ లో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉంది...
- ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది...
- హైదరాబాద్ లో తేలికపాటి వర్షాలు ఒకటి రెండు చోట్లా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది...
- జూన్ 1 నుండి ఈరోజు వరకు నైరుతి రుతుపవనాలు కాలంలో తెలంగాణ లో సాధారణం కంటే 17 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది....
- ఇందులో అత్యధికం వా జోగులంబ జిల్లాలో 121 శాతం ,వనపర్తి లో 117 శాతం సాధారణం కన్నా అత్యధికంగా నమోదైంది. అత్యల్పం నిర్మల్ జిల్లాలో సాధారణం కన్నా 20 శాతం తక్కువగా నమోదైనది..
- కోస్తాంధ్ర లో సాధారణం కన్నా 29 శాతం ఎక్కువగా నమోదుకగా ఇందులో నెల్లూరు లో సాధారణం కన్నా 98 శాతం ఎక్కువగా నమోదయింది. శ్రీకాకుళం లో సాధారణ కన్నా 20 శాతం తక్కువగా నమోదైంది..
- రాయలసీమ లో సాధారణం కన్నా 126 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. ఇందులో అత్యధికం గా అనంతపురం లో 158 శాతం సాధారణం కన్నా అధికంగా నమోదైంది...
- 5 Aug 2020 11:41 AM GMT
అమరావతి:
- రాష్ట్రంలో నదుల్లో కలుస్తున్నా కలుషిత నీటి శుద్ధి కోసం సివెజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు
- పురపాలక శాఖ కార్యదర్శి ని STP ఏర్పాటుకు నోడల్ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
- రాజమండ్రి, విజయవాడ, తాడేపల్లి, శ్రీకాకుళం, కర్నూల్ మరియు నంద్యాల లోని ఐదు నదులలో కలుషిత నీరు చేరుతుందని గతంలో పేర్కొన్న సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు
- వచ్చే ఏడాది మార్చి 31 నాటికి 100 శాతం కలుషిత నీటిని శుద్ధి చేసే చర్యలు చేపట్టాలని ఆదేశం
- కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా STP నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు
- 5 Aug 2020 11:12 AM GMT
కడప జిల్లాలొ ఒకరి పేరుతొ మరొకరు తప్పుడు అధార్, ఫోన్ నంబర్లతొ కరోనా టెస్ట్...
కడప :
- కడప జిల్లాలొ ఒకరి పేరుతొ మరొకరు తప్పుడు అధార్, ఫోన్ నంబర్లతొ కరోనా టెస్ట్...
- ఫలితం వచ్చాకా కనిపించకుండా పొయిన టెస్ట్ చేయించుకున్న వ్యక్తి ...
- వైద్యాధికారులు మాత్రం అధార్ అధారంగా మరొకరిని క్వారంటైన్ కు తరలింపు...
- తీరా క్వారంటైన్ కు వెళ్లాకా టెస్ట్ చేస్తే అధార్ కార్డు వ్యక్తికి నెగెటీవ్...
- అన్యాయంగా కరోనా లేకపొయినా... నేను కరొనా పరీక్ష చేయించుకొలేదని చెప్పినా వినిపించుకొకుండా క్వారంటైన్ తీసుకువచ్చారంటూ అవేదన
- అదివారం మైదుకూరు మార్కెట్ యార్డులొ జి.కొట్టాలకు చెందిన జంపన గంగిరెడ్డి అనే వ్యక్తి పేరుతొ మరొకరొ కరోనా పరిక్షలు చేయించుకున్న గుర్తుకుతెలియని వ్యక్తి...
- పాజిటీవ్ అని పరీక్షల్లొ రావడంతొ కనిపించకుండా పొయిన గుర్తుకు తెలియని వ్యక్తి...
- వైద్యాధికారులు మాత్రం జంపన గంగిరెడ్డిని క్వారంటైన్ కు తరలింపు...
- అధికారులకు తాను కరొనా పరీక్ష చేయించుకొలేదని చెప్పినా వినకిండా క్వారంటైన్ కు తరలించారని గంగిరెడ్డి అవేదన
- 5 Aug 2020 11:10 AM GMT
ఏపీ స్టేట్ ఎలక్షన్ కమీషన్
విజయవాడ:
- ఎలక్షన్ కమీషనర్ కార్యాలయంలో వాస్తు మార్పులు అన్న వార్తలు అవాస్తవం
- ఎటువంటి నమ్మకాలకు తావులేని వ్యక్తి ఎలక్షన్ కమీషనర్
- ఆయన లేని సమయంలో కార్యాలయంలో కొన్ని మార్పులు జరిగాయి
- కార్యాలయంలో మార్పులను ఎవరు నిర్ధారించారో విచారణ జరుగుతోంది
- 5 Aug 2020 11:09 AM GMT
అర్ ఎస్ ఎస్ చీఫ్
- మోహన్ భగవత్ కి అయోధ్య లో ఏమి పని అని ప్రశ్నిస్తున్న సెక్యులర్ పార్టీలుగా చెప్పుకుంటున్న అయ పార్టీలు సిగ్గుతో తలదించూ కోవాలి..
- కాశీ, మధుర లో ఎన్నో మసీదులు వున్నాయి..
- వీటిని సైతం కూల్చి మోది సర్కార్ లోక్ స లో చట్టాలు రూపొందించి
- ఆ ప్రాంతంలో హిందూ దేవాలయాలు రూపొందిస్తారు.
- 5 Aug 2020 11:08 AM GMT
బాధిత కుటుంబానికి అండగా ఉంటామంటూ భరోసా..
శ్రీకాకుళం జిల్లా:
- పలాస పోలీసు కార్యాలయంలో బాధితుడిని పరామర్శించిన ఎస్పీ అమిత్ బర్దార్..
- ఘటనపై బాధితుడిని ఆరా తీసిన ఎస్పీ..
- తనపై జరిగిన దాడికి బాధితుడిని క్షమాపణ కోరిన ఎస్పీ అమిత్ బర్దార్..
- బాధిత కుటుంబానికి అండగా ఉంటామంటూ భరోసా..
- 5 Aug 2020 11:07 AM GMT
రాష్ట్ర వైద్య శాఖ మంత్రి అళ్ల నాని కామెంట్స్ ...
కడప :
- జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో సమీక్ష నిర్వహించాము..
- నివారణకు తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తలు పై అధికారులతో సమీక్ష..
- కోవిద్ హాస్పిటల్ లో ఏర్పాట్లు, భోజనాలు ఇతర స్యానిటేషన్ పై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాం...
- ప్రతి రోజు జిల్లాలో 4500 కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం...
- రాష్ట్రంలో కరోనా నివారణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూనే ఉన్నారు...
- పారదర్శకంగా వీలైనన్ని కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం...
- కరోనా బాధితులను సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యే వరకు వారి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే ...
- కరోనా రోగులకు అందిస్తున్న భోజన నాణ్యత లేకుంటే కఠిన చర్యలు తప్పవు...
- నాణ్యత లేకుండా ఆహారాన్ని సరఫరా చేస్తే కాంట్రాక్ట్ రద్దుతో పాటు సంబంధిత అధికారులు పై చర్యలు...
- దేశంలో నే అత్యధిక శాతం లో కరోనా టెస్టులు చేస్తున్నాం...
- అందుకే పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి...
- కరోనా నివారణకు ఎంత ఖర్చు అయినా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది...
- జిల్లాలో ఇప్పటి వరకు 1080 బెడ్లు అందుబాటులో ఉన్నాయి... దీనికి అదనంగా300 ఆక్సిజన్ బెడ్లను అందుబాటులో ఉంచడం జరిగింది..
- నాన్ కోవిడ్ కేర్, కోవిద్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం..
- 1000మంది నూతన వైద్య సిబ్బందిని వారం రోజుల లోపు తీసుకొనున్నాం...
- స్టాఫ్ నర్సులు, నర్సులు, ఎఫ్ ఎన్ ఓ లను రిక్రూట్ చేస్తున్నాం..
- కరోనా నివరణలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారథ్యంలో ప్రజలు కూడా సహకారాన్ని అందించాలి...
- ప్లాస్మా దానం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు...దీనిపై అపోహలు వద్దు...
- ప్లాస్మా దానం ద్వారా అపాయాంలో ఉన్న వ్యక్తి ప్రాణాలను కాపాడిన వారు అవుతారు...
- ప్లాస్మా దానం చేసిన వారికి ప్రోత్సహకంగా 5 వేల రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది...
- ఇది వరకు ఇచ్చిన సహకారాన్ని ప్రజలు కూడా కరోనా నివారణకు సహకరించాలి...
- కరోనా పై ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంది..
- నెలకు 350 కోట్ల రూపాయలను కరోనా నివారణకు ఖర్చు చేస్తున్నాం...
- ప్రజల ఆరోగ్యం కన్నా డబ్బులు ముఖ్యం కాదన్న సంకల్పంతో సిఎం వైఎస్ జగన్ ముందుకు వెళ్తున్నారు...
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire