Live Updates:ఈరోజు (ఆగస్ట్-05) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం, 05ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం విదియ(రాత్రి 9-34 వరకు) తదుపరి తదియ; ధనిష్ఠ నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి శతభిష నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-20 నుంచి 5-02 వరకు), వర్జ్యం (సా. 5-04 నుంచి 6-47 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 11-40 నుంచి 12-31 వరకు) రాహుకాలం (మ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-౨౯

జగదానంద కారకుడికి మందిర నిర్మాణం. ఎన్నో ఏళ్ల కల.. ఆ కల సాకారానికి తొలిఅడుగు మరి కొద్దిగంటల్లో పడనుంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరగనుంది. ఆ వేడుకకు సంబంధించి ఎప్పటికప్పుడు లైవ్ అప్ డేట్స్!

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • తిరుపతిలో  సంబరాలు
    5 Aug 2020 8:23 AM GMT

    తిరుపతిలో సంబరాలు

    రామాలయంలో పూజలు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించిన భాజపా శ్రేణులు

    నాలుగు కాళ్ళ‌ంమడపం వద్ద ఘనంగా సంబరాలు

    బాబ్రీమసీదు ఘటనలో అయోధ్య కు వెళ్ళిన కరసేవకులకు ఘనంగా సన్మానం

  • 5 Aug 2020 6:07 AM GMT

    అయోధ్యలో రామ మందిర నిర్మాణం భూమి పూజ సందర్భంగా బీజేపీ శ్రేణులు సంబరాలు..

    విజయవాడ

    బీజేపీ కార్యాలయం వద్ద బాణాసంచా కాల్సి, స్వీట్లు పంచిన బీజేపీ నాయకులు...

    శ్రీనివాస్ రాజు బీజేపీ అధికార ప్రతినిధి పాయింట్స్

    భారత దేశ ప్రజల చిరకాల వాంఛ అయోధ్యలో రామ మందిర నిర్మాణం..

    రాముని జన్మ స్థలంలో రామాలయం నిర్మించడం శుభపరిణామం..

    ప్రధాని నరేంద్ర మోదీ రామ మందిరానికి శంకుస్థాపన చేయడం సంతోషం..

    భారత సంస్కృతిని విదేశీయులు నాశనం చేశారు..

    ప్రపంచంలో అత్యంత పురాతనమైన సంస్కృతి భారతదేశానిది..

    ప్రపంచానికే ఆచార్య వ్యవహారాలు, సంస్కృతి నేర్పిన దేశం భారత దేశం..

    భారతదేశంలో పురాతనమైన దేవాలయాలకు పునర్వైభవం ప్రధాని మోడీ తీసుకువస్తారు..

    అయోధ్యలో రామమందిరం నిర్మించాలని దేశ వ్యాప్తంగా పెద్ద ఉద్యమం జరిగింది..

    దేశ వ్యాప్తంగా ఉన్న పవిత్ర పుణ్య స్థలాలు నదుల నుంచి మట్టి నీరు తెచ్చి శంకుస్థాపన చేస్తున్నారు..

    దేశ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది..

    భరతదేశ చరిత్రలో ఈ రోజు లిఖించ దగ్గ రోజు..

  • 5 Aug 2020 4:13 AM GMT

    ఆన్నవరం సత్యదేవుని సన్నిధిలో ఏపి బిజేపి అధ్యక్షులు సోము వీర్రాజు..

    తూర్పుగోదావరి :

    ఆన్నవరం సత్యదేవుని సన్నిధిలో ఏపి బిజేపి అధ్యక్షులు సోము వీర్రాజు..

    స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన సోము వీర్రాజు..

    ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థానం ఈఓ త్రినాథరావు, సిబ్బంది..

  • 5 Aug 2020 2:40 AM GMT

    కేసనకుర్రు పాలెం లో ఉద్రిక్తత!

    తూర్పు గోదావరి ముమ్మిడివరం

    - ఐ.పోలవరం మం కేసనకుర్రు పాలెం సంత మార్కెట్లో వద్ద

    - బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు కు దళిత సంఘాలు ప్రయత్నం

    - కోర్టు వివాదమున్న స్థలము లో విగ్రహాన్ని పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్న పోలీసులు

    - ఉద్రిక్తతకు దారితీయడంతో అమలాపురం డిఎస్పీ ముసూం భాష ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మోహరింపు

  • 5 Aug 2020 2:39 AM GMT

    తూర్పుగోదావరి -రాజమండ్రి

    - రాజానగరం కొవిడ్‌ ఆస్పత్రిలో గత 9రోజులుగా మార్చురీలోనే కరోనా యువకుడి(22) మృతదేహం

    - కాకినాడ జగన్నాథపురానికి చెందిన ఆ యువకుడు కరోనాతో చికిత్స పొందుతూ గత నెల 28న మృతి

    - తాను హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నందున రాలేనన్న యువకుడి తండ్రి.

    - విషయాన్ని ప్రభుత్వాధికారుల దృష్టికి కొవిడ్ ఆస్పత్రివర్గాలు తీసుకెళ్లినా పట్టించుకోనివైనం

  • 5 Aug 2020 2:13 AM GMT

    - అనంతపురం: ఎస్కే యూనివర్సిటీ పరిధిలోని అన్ని రకాల పరీక్షల నిర్వహణపై షెడ్యూల్ ఖరారు

    - సెప్టెంబర్ 7 నుంచి 14 వరకు డిగ్రీ ఫైనల్ పరీక్షలు.

    - ఇంజనీరింగ్, బీఫార్మసీ, బీఈడీ విద్యార్థులకు సెప్టెంబర్ మొదటి వారం నుంచి పరీక్షలు ప్రారంభం

    - ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆగస్టు 15 నుంచి ఆన్లైన్ తరగతులు

  • 5 Aug 2020 2:12 AM GMT

    అనంతపురం: వ్యవసాయ శాఖ జెడిఎ పై బదిలీ వేటు.

    - లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఓ మహిళ జెడిఎ హబీబ్ భాషా పై ఎస్పీకి ఫిర్యాదు.

    - కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు.

    - లైంగిక ఆరోపణల నేపథ్యంలో చిత్తూరు వ్యవసాయ శాఖ భూసార సంరక్షణ కేంద్రం ఉపసంచాలకులు గా బదిలీ.

    - పశ్చిమగోదావరి డ్వామా పీడీగా పనిచేస్తున్న రామకృష్ణ అనంతపురం జేడీఏ గా నియామకం

  • 5 Aug 2020 1:41 AM GMT

    తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!

    - బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం...

    - పశ్చిమ బెంగాల్- బంగ్లాదేశ్ మధ్య కొనసాగుతున్న అల్పపీడనం..

    - మరోవైపు 7,6 కీమీ. ఎత్తులో ఆవర్తనం

    - వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

  • 5 Aug 2020 1:39 AM GMT

    శ్రీశైలం జలాశయంలో తగ్గిన వరద ప్రవాహం

    కర్నూలు జిల్లా

    - ఇన్ ఫ్లో : 10,050 క్యూసెక్కులు

    - ఔట్ ఫ్లో : 40,259 క్యూసెక్కులు

    - పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు

    - ప్రస్తుతం : 850.00 అడుగులు

    - నీటి నిలువ సామర్థ్యం : 215 టిఎంసీలు

    - ప్రస్తుతం : 79.9890. టిఎంసీలు

    - ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి

Print Article
Next Story
More Stories