Seethakka: కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్‌తో... తెలంగాణ పంచాయతీరాజ్ మంత్రి సీతక్క భేటీ

Seethakka: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని కోరిన సీతక్క

Update: 2024-06-25 15:18 GMT

Seethakka: కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్‌తో... తెలంగాణ పంచాయతీరాజ్ మంత్రి సీతక్క భేటీ

Seethakka: తెలంగాణ మంత్రులు హస్తినలో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రమంత్రులతో భేటీ అవుతున్నారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌తో తెలంగాణ మంత్రి సీతక్క సమావేశమయ్యారు. తెలంగాణలో గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కేంద్రమంత్రిని కోరారు. తెలంగాణలో 6 వేల 176 గ్రామ పంచాయతీలకు భవనాలు లేవని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తాత్కాలిక భవనాల్లో విధులను ఉద్యోగులు నిర్వర్తించలేకపోతున్నారని రాజీవ్ రంజన్‌కు సీతక్క తెలిపారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద 15 వందల 44 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని సీతక్క విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News