Revanth Reddy: భారత న్యాయవ్యవస్థపై నాకు అత్యంత విశ్వాసం ఉంది.. ప్రతికల్లో వచ్చిన వార్తలపై..

ప్రతికల్లో వచ్చిన వార్తలపై విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి...న్యాయ వ్యవస్థపైనా, ఆ వ్యవస్థ స్వతంత్రతపైనా..తనకు అత్యంత నమ్మకం ఉందని వెల్లడించారు.

Update: 2024-08-30 05:14 GMT

Revanth Reddy: భారత న్యాయవ్యవస్థపై నాకు అత్యంత విశ్వాసం ఉంది.. ప్రతికల్లో వచ్చిన వార్తలపై..

Revanth Reddy: ట్విట్టర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పోస్ట్ పెట్టారు. భారత న్యాయ వ్యవస్థపై తనకు అత్యంత విశ్వాసం ఉందని...తన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థను..ప్రశ్నించినట్టు ఆపాదించారని అన్నారు. ప్రతికల్లో వచ్చిన వార్తలపై విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి...న్యాయ వ్యవస్థపైనా, ఆ వ్యవస్థ స్వతంత్రతపైనా..తనకు అత్యంత నమ్మకం ఉందని వెల్లడించారు.

తెలంగాణ సీఎం క్షమాపణలకు కారణం గురువారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడమే. ఓటుకు నోటు కేసును తెలంగాణ హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీ చేయాలన్న BRS నేత జగదీష్‌రెడ్డి పిటిషన్‌ విచారణ సందర్భంగా.. కవిత్ బెయిల్‌పై సీఎం రేవంత్‌ చేసిన వ్యాఖ్యలపై ధర్మాసనం స్పందించింది. ఈ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుబట్టింది. వ్యక్తులు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని నిందితులకు మేము బెయిల్ ఇస్తామా అంటూ.. రేవంత్ రెడ్డి తరపు లాయర్లను జస్టిస్ గవాయి తిసభ్య ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి.. సుప్రీం కోర్టు పట్ల గౌరవంగా మెలగాలని, రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయడం ఎంత మాత్రమూ సరికాదని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.


Tags:    

Similar News