BRS MLC Kavitha: కాసేపట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎమ్మెల్సీ కవిత

BRS MLC Kavitha: ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఇంటికి వెళ్లనున్న కవిత

Update: 2024-08-28 09:39 GMT

MLC Kavitha: కాసేపట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎమ్మెల్సీ కవిత

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహాడ్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. ఢిల్లీ నుండి విస్తారా ఫ్లైట్‌లో కవిత, కేటీఆర్, కుటుంబ సభ్యులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు బయలుదేరారు. సాయంత్రం 4.45 గంటలకు కవిత బృందం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద కవితకు స్వాగతం పలికేందురు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి కవిత నేరుగా తన నివాసానికి వెళ్లనున్నారు.

Tags:    

Similar News