KTR: మాఫీ అయిన వారికన్నా... కంటతడి పెట్టిన వారే ఎక్కువ
కాంగ్రెస్ అంటేనే మొండి చేయి అని మరోసారి తేలిపోయిందని ట్వీట్ చేశారు కేటీఆర్.
KTR: పంట రుణమాఫీపై ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రుణమాఫీ అయిన రైతుల కన్నా... కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువన్నారు. అన్నివిధాలా అర్హత ఉన్నా... ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పేవారు లేరన్నారు. రెండు సీజన్లు అయినా రైతు భరోసా ఇంకా షురూ చెయ్యలేదని విమర్శించారు.
జూన్‌లో వేయాల్సిన రైతు భరోసా ఆగస్టు దాటుతున్నా... రైతుల ఖాతాల్లో జమచేయలేదని ఆక్షేపించారు. కౌలు రైతులకు ఇస్తానన్న 15 వేలు ఇయ్యనే ఇయ్యలేదన్నారు. రైతు కూలీలకు 12 వేల రూపాయల హామి ఇంకా అమలు చేయలేదని నిలదీశారు. కాంగ్రెస్ అంటేనే మొండి చేయి అని మరోసారి తేలిపోయిందని ట్వీట్ చేశారు కేటీఆర్.