KTR: ప్రశ్నిస్తే దాడులు .. నిలదీస్తే బెదిరింపులు.. అయినా తగ్గేదే లేదు..

KTR: రుణం తీరలే..! రైతు బతుకు మారలే..! అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-08-17 06:36 GMT

KTR: ప్రశ్నిస్తే దాడులు .. నిలదీస్తే బెదిరింపులు.. అయినా తగ్గేదే లేదు..

KTR: రుణం తీరలే..! రైతు బతుకు మారలే..! అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ లెక్క ప్రకారం.. రైతు రుణాలు 49వేల, 500 కోట్లు ఉందని.. కేబినెట్ భేటీలో చెప్పింది 31 వేల కోట్లు అని.. కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్‌లో కేటాయించింది మాత్రం 26 వేల కోట్లు మాత్రమేనన్నారు.

ఇక మూడు విడతలుగా కలిపి ఇచ్చింది 17వేల 933 కోట్లు మాత్రమేనన్నారు కేటీఆర్. ఒకే విడతలో రెండు లక్షల రైతు రుణమాఫీపై.. ప్రశ్నిస్తే దాడులు .. నిలదీస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. అయినా తగ్గేదే లేదు..నిగ్గదీసి అడుగుతాం.. నిజాలే చెబుతామని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ డొల్లా మాటల గుట్టు విప్పుతూనే ఉంటామన్నారు.


Tags:    

Similar News