KTR: సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్.. నిరూపిస్తే పదవికి రాజీనామా

రుణమాఫీపై సీఎం రేవంత్‌కు మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. రుణమాఫీ అంతా బోగస్ అన్న కేటీఆర్.. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు.

Update: 2024-08-16 09:49 GMT

KTR: సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్.. నిరూపిస్తే పదవికి రాజీనామా

Rythu Runa Mafi: తెలంగాణలో అప్పులు తీసుకున్న రైతుల్లో సగం మందికి కూడా రుణమాఫీ కాలేదని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. రుణమాఫీ పేరుతో చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ రంకెలు వేస్తున్నారని అన్నారు. ఒకేసంతకంతో డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని మాట తప్పారని విమర్శించారు. తొలుత రూ.40 వేల కోట్లతో మాఫీ అంచనాలు వేసి ఇప్పుడు కేవలం రూ. 27 వేల కోట్లకే పరిమితం చేయడం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. జులై రాగానే లబ్ధిదారుల్లో సగానికిపైగా రైతులకు కోత విధించి మాఫీ అమలు చేశారని అన్నారు.

రుణమాఫీపై సీఎం రేవంత్‌కు మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. రుణమాఫీ అంతా బోగస్ అన్న కేటీఆర్.. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏ ఊరికైనా సీఎంతో పాటు వెళ్లడానికి సిద్ధమని.. వంద శాతం రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే తాను ఆ ఊరి నుంచే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖ స్పీకర్‌కు పంపిస్తానని సవాల్ విసిరారు. సీఎం రేవంత్‌కు తన మాటలపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు.

Full View


Tags:    

Similar News