BRS: గ్రామాల కేంద్రంగా మరో ఉద్యమానికి బీఆర్ఎస్ ప్లాన్

పంట రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ పార్టీ అన్నదాతలను మోసం చేస్తుందని ధర్నా కార్యక్రమాలు బీఆర్ఎస్ చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ గ్రామంలో పర్యటించి రుణమాఫీ కాని రైతుల డేటాను సేకరించేందుకు సిద్ధమవుతున్నారు.

Update: 2024-08-23 06:49 GMT

BRS: గ్రామాల కేంద్రంగా మరో ఉద్యమానికి బీఆర్ఎస్ ప్లాన్

BRS: తెలంగాణ ఉద్యమం కోసం అందరినీ ఏకం చేసిన బీఆర్ఎస్ మరో ఉద్యమానికి కార్యాచరణ రచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు 420 హామీలను నెరవేర్చే దిశగా పోరాటానికి సిద్ధం అవుతున్నారు. గ్రామం కేంద్రంగా కాంగ్రెస్ నేతలపై ఒత్తడి తీసుకువచ్చేలా కార్యక్రమం చేపట్టబోతుంది బీఆర్ఎస్.

పంట రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ పార్టీ అన్నదాతలను మోసం చేస్తుందని ధర్నా కార్యక్రమాలు బీఆర్ఎస్ చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ గ్రామంలో పర్యటించి రుణమాఫీ కాని రైతుల డేటాను సేకరించేందుకు సిద్ధమవుతున్నారు. అలా సేకరించిన అప్లికేషన్లను ప్రభుత్వానికి సమర్పించాలని బీఆర్ఎస్ భావిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ప్రకారం రుణమాఫీ హామీ జరగలేదని ఆరోపిస్తూ రైతుల పక్షాన పోరాటం చేయాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి పోరాటం చేస్తే... స్థానిక సంస్థల ఎన్నికల వరకు బీఆర్ఎస్ పుంజుకుంటుందన్న అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లు ప్రకటించింది. రైతు, మహిళా, యువత, ఎస్సీ, ఎస్టీలకు పలు పథకాలతో కూడిన డిక్లరేషన్‌లను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన డిక్లరేషన్లను అమలు అయ్యే విధంగా ఒక్కో ప్లేస్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోంది. రైతుల కోసం బీఆర్ఎస్ చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సైతం పాల్గొంటారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలంటే భారీగా నిధులు అవసరం ఉంటుంది. కావున రాష్ట్ర ప్రభుత్వానికి ఆ హామీలన్నీ నెరవేర్చాలంటే కొంత కష్టమేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో కాంగ్రెస్‌పై వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది.

Tags:    

Similar News