YouTube Premium: యూట్యూబ్ ఇప్పుడు సరికొత్తగా.. వారికోసం స్టన్నింగ్ ఫీచర్స్..
YouTube Premium: కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లతో యూట్యూబ్ ప్రీమియం సేవలను అందిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి కొంగొత్త ఫీచర్లను అందిస్తున్నారు.
YouTube Premium: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోట్లాది మంది యూజర్లు యూట్యూబ్‌ను ఉపయోగిస్తున్నారు. ఓవైపు వ్యూయర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ పంచుతున్న యూట్యూబ్ మరోవైపు క్రియేటర్స్‌కి సంపాదన కూడా తెచ్చిపెడుతోంది. ఇక ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్న యూట్యూబ్ తాజాగా మరికొన్ని ఆసక్తికరమైన ఫీచర్లను పరిచయం చేసింది.
అయితే ఈ ఫీచర్లు కేవలం ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు మాత్రమే. కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లతో యూట్యూబ్ ప్రీమియం సేవలను అందిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి కొంగొత్త ఫీచర్లను అందిస్తున్నారు. ముఖ్యమంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్లు యూజర్లకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే యూట్యూబ్ తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చిన కొన్ని ఫీచర్లపై ఓ లుక్కేయండి..
యూట్యూబ్ తీసుకొస్తున్న కొత్త ఫీచర్లలో జంప్ హెడ్ ఒకటి. ఏఐ సహాయంతో పనిచేసే ఫీచర్ సహాయంతో మొత్తం వీడియోలో కేవలం బెస్ట్ కంటెంట్‌ను మాత్రమే అవకాశం లభిస్తుంది. వీడియోలోని బెస్ట్ పార్ట్‌ను ఇది విశ్లేషిస్తుంది. వీడియో ఫార్వర్డ్ అయ్యేందుకు డబుల్ చేసే సమయంలో జంప్ హెడ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక యూట్యూబ్‌ను ఉపయోగిస్తున్న సమయంలో ఇతర యాప్స్‌ను ఉపయోగించేందుకు పిక్చర్ ఇన్ పిక్చర్ సౌకర్యం అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇకపై షార్ట్స్‌ను కూడా ఇదే విధానంలో చూడొచ్చు.
యూట్యూబ్ షార్ట్స్‌ను డౌన్‌లోడ్ చేయాలంటే ప్రత్యేకంగా బ్రౌజర్ లేదా యాప్‌ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అయితే యూట్యూబ్ తీసుకొస్తున్న కొత్త ఫీచర్‌లో సహాయంతో షార్ట్స్‌ను ఆటోమేటిక్‌గా స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీంతో నెట్ లేని సమయంలో కూడా షార్ట్స్‌ను చూడొచ్చన్నమాట. ఇష్టమైన వీడియోల గురించి అడగటానికి ఆస్క్ పేరుతో ఏఐ టూల్‌ను తీసుకొస్తున్నారు.