Youtube: యూట్యూబ్‌లో ఈ మోడ్‌ని ఆన్‌చేస్తే సెర్చ్‌ ఇంజిన్‌లో మీ హిస్టరీ ఉండదు..!

Youtube: మీరు యూట్యూబ్‌లో ఏదైనా వీడియో చూస్తే దాని హిస్టరీ సెర్చ్‌ ఇంజిన్‌లో నమోదవుతుంది.

Update: 2023-03-21 13:30 GMT

Youtube: యూట్యూబ్‌లో ఈ మోడ్‌ని ఆన్‌చేస్తే సెర్చ్‌ ఇంజిన్‌లో మీ హిస్టరీ ఉండదు..!

Youtube: మీరు యూట్యూబ్‌లో ఏదైనా వీడియో చూస్తే దాని హిస్టరీ సెర్చ్‌ ఇంజిన్‌లో నమోదవుతుంది. ఇది కొన్నిసార్లు మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు. అంతేకాదు కొంతమంది వినియోగదారులు దీనిగురించి చాలా ఆందోళన చెందుతారు. పొరపాటున ఎవరి చేతికైనా మొబైల్‌ వెళితే వారు ఈ హిస్టరీని చూసేస్తారని కంగారు పడుతారు. ఇలాంటివారికోసం యూట్యూబ్‌ incognito modeని ప్రవేశపెట్టింది.

కానీ ఈ ఆప్షన్‌ గురించి చాలామందికి తెలియదు. యూట్యూబ్‌లో దీనిని యాక్టివేట్‌ చేసినట్లయితే మీరు చేసే వీడియోల హిస్టరీని సెర్చ్‌ ఇంజిన్‌లో నమోదుకాదు. అయితే దీనిని ఎలా యాక్టివేట్‌ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మీ ఫోన్‌లో YouTube యాప్‌ని తెరిచి ఎడమవైపు ఎగువన ఉన్న మూడు చుక్కల ఎంపికపై క్లిక్ చేయండి. తర్వాత ఖాతా విభాగంపై క్లిక్ చేసి incognito modeపై క్లిక్ చేయండి. తర్వాత ఇది ఆన్‌ అవుతుంది. మీరు వేరే YouTubeకి వెళతారు. ఇప్పుడు ఏ వీడియో చూసినా అది హిస్టరీలో నమోదుకాదు.

వినియోగదారు ప్రైవసీ దెబ్బతినకుండా ఉండటానికి incognito modeని ఉపయోగించవచ్చు. అలాగే ఇటీవల యూట్యూబ్ వినియోగదారుల కోసం యూట్యూబ్ టీవీలో మల్టీవ్యూ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్‌లో వినియోగదారులు ఒకే స్క్రీన్‌పై స్పోర్ట్స్ విభాగంలో 4 వీడియోలను ఏకకాలంలో ప్లే చేయవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం ఎంపిక చేసిన వినియోగదారులందరికీ అందుబాటులో ఉంది. త్వరలో ఇది అందరికీ వస్తుంది.

Tags:    

Similar News