Whatsapp: వాట్సాప్ నుంచి గుడ్ న్యూస్.. ఒకే నంబర్‌తో నాలుగు ఫోన్లలో వాట్సాప్‌..!

WhatsApp on Multiple Phones: వాట్సాప్ వాడుతున్న స్మార్ట్ ఫోన్ యూజర్లకు మెటా సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2023-04-26 08:52 GMT

Whatsapp: వాట్సాప్ నుంచి గుడ్ న్యూస్.. ఒకే నంబర్‌తో నాలుగు ఫోన్లలో వాట్సాప్‌..!

WhatsApp on Multiple Phones: వాట్సాప్ వాడుతున్న స్మార్ట్ ఫోన్ యూజర్లకు మెటా సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు ఫోన్ లేదా డెస్క్ టాప్ లలో ఒక వాట్సాప్ అకౌంట్ ను మాత్రమే వినియోగించే అవకాశం ఉంది. అయితే ఇకపై ఒకేసారి నాలుగు ఫోన్లు లేదా నాలుగు పీసీలలో వాట్సాప్ ను ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే అంతర్జాతీయంగా ఈ ఫీచర్ ను ప్రవేశపెట్టామని మరికొన్ని వారాల్లో ఈ నూతన ఫీచర్ ను వినియోగులందరికీ అందుబాటులోకి తెస్తామని మెటా సంస్థ ప్రకటించింది. మల్టి డివైజ్ వాట్సాప్ అనుభవాన్ని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళుతున్నామని మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించారు.

తాజాగా అందుబాటులోకి తెస్తున్న కంపానియన్ మోడ్ సహకారంతో 4 డివైజ్ లలో వాట్సాప్ ను వాడుకోవచ్చు. ఏ డివైజ్ నుంచైనా చాట్ చేసుకునే వీలు కల్పిస్తున్నారు. ప్రైమరీ ఫోన్ లో ఇంటర్నెట్ లేకపోయినా మిగతా డివైజ్ లకు మెసేజ్ లు వస్తాయని వాట్సాప్ ప్లాట్ ఫామ్ తెలిపింది. ఒకవేళ ప్రధాన ఫోన్ చాలా సేపు ఇన్ యాక్టివ్ గా ఉంటే దానికి అనుసంధానమైన అన్ని ఫోన్లు ఆటోమేటిక్ గా లాగ్ అవుట్ అవుతాయి.

మల్టి డివైజ్ లలో వాట్సాప్ ఎలా వాడాలంటే

ముందుగా మీరు వాట్సాప్ బిజినెస్ లేటెస్ట్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ స్క్రీన్ పై కనిపించే ఓవర్ ఫ్లో మెనుపై క్లిక్ చేసి అందులో లింక్ ఏ డివైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రైమరీ డివైజ్ లో వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్లి లింక్డ్ డివైజ్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత సెకండరీ ఫోన్ లేదా డివైజ్ లో ఉండే క్యూఆర్ కోడ్ ను ప్రైమరీ డివైజ్ తో స్కాన్ చేయాలి. ఇలా మొదటి ఫోన్ లో లాగౌట్ కాకుండానే మిగతా డివైజ్ లలోనూ వాట్సాప్ వాడుకోవచ్చు.

Tags:    

Similar News