Xiaomi Hyperphone: 'హైపర్‌ఫోన్'ను ఇండియాలో లాంచ్‌ చేయనున్న షియోమీ.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Xiaomi 11T Pro: Xiaomi గురువారం, జనవరి 6న Xiaomi 11i సిరీస్ ప్రకటన సందర్భంగా మరోకొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

Update: 2022-01-06 16:00 GMT

 Xiaomi Hyperphone: 'హైపర్‌ఫోన్'ను ఇండియాలో లాంచ్‌ చేయనున్న షియోమీ.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Xiaomi 11T Pro: Xiaomi గురువారం, జనవరి 6న Xiaomi 11i సిరీస్ ప్రకటన సందర్భంగా మరోకొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఫోన్‌కు సంబందించిన ఖచ్చితమైన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే ఆఫోన్ Xiaomi 11T Pro కావచ్చునని టీజర్ సూచిస్తుంది. అయితే ఐరోపాలో గతేడాది సెప్టెంబర్‌లో ఈ ఫోన్ విడుదల అయింది. Xiaomi 11T ప్రో 12GB RAM వరకు సపోర్ట్ చేస్తుంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో సహా మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో హై-ఎండ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 SoC కూడా ఉంది. 120Hz AMOLED డిస్‌ప్లేను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

గత నెలలో, టిప్‌స్టర్ ముకుల్ శర్మ బ్లూటూత్ స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ (SIG) వెబ్‌సైట్‌లో Xiaomi 11T ప్రో ఇండియా వేరియంట్‌ను ఉద్దేశించి కొన్ని వివరాలు వెల్లడించారు. ఆ వేరియంట్ మోడల్ నంబర్ 2107113Iతో కనిపించింది. ఇక్కడ "I" అనేది ప్రత్యేకంగా భారతీయ వేరియంట్‌కు సూచనగా ఉంటుందని తెలుస్తోంది.

Xiaomi 11T ప్రోతో పాటు, చైనీస్ కంపెనీ Xiaomi 11T ని దేశంలో లాంచ్ చేస్తుందని ఊహిస్తున్నారు. Xiaomi 11T ఫోన్ రెండు వేరియంట్లు 8GB RAM + 128GB స్టోరేజ్‌, 8GB RAM + 256GB స్టోరేజ్‌తో రానుంది. Xiaomi 11T ప్రో మూడు వేరియంట్లలో లభిస్తుంది. 8GB RAM + 128GB స్టోరేజ్, 8GB + 256GB స్టోరేజ్, 12GB RAM + 256GB స్టోరేజ్‌లలో విడుదల కానుంది.

Xiaomi 11T ప్రో ధర..

Xiaomi 11T ప్రో బేస్ మోడల్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర EUR 649 (దాదాపు రూ. 54,600) ప్రారంభ ధరతో యూరప్‌లో విడుదల అయింది. మరో వేరియంట్ 8GB RAM + 256GB మోడల్‌లో EUR 699 (సుమారు రూ. 58,800), EUR 749 (దాదాపు రూ. 63,000) ధరతో విడుదల అయ్యాయి. అయితే ఈ మోడల్ 12GB RAM+ 256GB ఎంపికలో కూడా లభిస్తుంది.

Xiaomi 11T ప్రో స్పెసిఫికేషన్స్..

Xiaomi 11T ప్రో స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల 10bit AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. 12GB వరకు RAMతోపాటు Qualcomm Snapdragon 888 SoCతో విడుదల కానుంది. ఫోన్ 108-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్, టెలిఫోటో షూటర్‌ను కలిగి ఉన్న ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం, Xiaomi 11T ప్రో ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

Xiaomi హర్మాన్ కార్డాన్‌తో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్లను అందించింది. స్మార్ట్‌ఫోన్ 120W Xiaomi హైపర్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వనుంది. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేశారు. భారతదేశంలో Xiaomi 11i హైపర్‌ఛార్జ్ 5Gతో పరిచయం చేయనున్నారు.

Tags:    

Similar News