Yamaha RX100: యమహా RX100 మళ్లీ లాంచ్ అవుతుందా.. కంపెనీ ఏం చెబుతోందంటే..?
Yamaha RX100: యమహా RX100 మళ్లీ లాంచ్ అవుతుందా.. కంపెనీ ఏం చెబుతోందంటే..?
Yamaha RX100: యమహా ఆర్‌ఎక్స్ అంటే ఒక ట్రెండ్. అది సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ బైక్‌ని నడపాలని ఆరాటపడుతారు. ఎందుకంటే ఈ బైక్‌కి ఉన్న క్రేజ్ అలాంటిది. ఇండియాలో ఆర్‌ఎక్స్ 100 కంటే జనాదరణ పొందిన బైక్ మరొకటి లేదనే చెప్పాలి. ఈ బైక్‌ని ఇష్టపడేవారి సంఖ్య, కొనుగోలు చేయాలనే సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ బైక్ 1985 నుంచి 1996 వరకు మార్కెట్లో కొనసాగింది. కానీ ఇప్పుడు మరోసారి యమహా దీన్ని లాంచ్ చేసే ప్రయత్నంలో ఉంది.
ఓ ఇంటర్వ్యూలో యమహా ఇండియా ప్రెసిడెంట్ ఐషిన్ సిహానా ఈ బైక్ గురించి పలు విషయాలని వెల్లడించారు. యమహా RX100 మోడల్‌ను తిరిగి భారత మార్కెట్లోకి తీసుకురావాలనుకుంటున్నట్లు తెలిపారు. అయితే పాత యమహా ఆర్‌ఎక్స్100 మళ్లీ రోడ్డుపైకి రావడం కష్టం. ఎందుకంటే ఇది టూ -స్ట్రోక్ ఇంజిన్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత BS6 నిబంధనలకు అనుగుణంగా ఉండదు. ఈ పరిస్థితిలో దాని ఇంజిన్ మార్చవచ్చు. డిజైన్ కూడా అప్‌డేట్ చేసే అవకాశాలు ఉన్నాయి.
అంతేకాదు యమహా ఏ బైక్‌పైనా RX100 బ్యాడ్జ్‌ను నిబంధనల ప్రకారం ఇవ్వలేరు. కొత్త RX100 కోసం కంపెనీ ఒక కొత్త బైక్‌ను రూపొందించాల్సి ఉంటుంది. కానీ పాత మోడల్‌లో ఉన్న కొన్ని పార్ట్స్ ను తీసేసి రెట్రో డిజైన్ కలయికతో కొత్తగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రస్తుతం ఆ కంపెనీకి పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు. ఇందులో భాగంగా 2026 నాటికి యమహా RX100ని తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మార్కెట్‌లోకి వచ్చిందంటే మరో ట్రెండ్ క్రియేట్ అయినట్లే అని నిపుణులు భావిస్తున్నారు.