WhatsApp: బిగ్ అలర్ట్.. రేపటి నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ సేవలు బంద్‌!

Whatsapp Stop Working: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.

Update: 2022-10-23 10:00 GMT

WhatsApp: బిగ్ అలర్ట్.. రేపటి నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ సేవలు బంద్‌!

Whatsapp Stop Working: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. మీరు పాత ఐఫోన్‌ని ఉపయోగిస్తున్నారా లేదా మీ ఫోన్ ఐఓఎస్‌(iOS) పాత వెర్షన్‌లో రన్ అవుతుందా?అయితే మీ ఫోన్‌ని అప్‌గ్రేడ్ చేయాలి లేదా iOS లేటెస్ట్‌ వెర్షన్‌లోకి అప్‌డేట్‌ చేసుకోవాలి. ఇలా చేయకుంటే ఆ ఫోన్లలో ఇకపై వాట్సాప్‌ సేవలను వినియోగించడం కుదరుదు. ఎందుకంటే పాత వెర్షన్‌ ఓఎస్‌తో పనిచేస్తున్న పలు ఫోన్లలో వాట్సాప్ సర్వీస్‌ నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఐఫోన్, ఆండ్రాయిడ్ డివైజ్‌లలో కొన్ని మోడల్స్‌కు అక్టోబరు 24 నుంచి తమ సర్వీస్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

కంపెనీ తెలిపిన సమాచారం ప్రకారం.. అక్టోబర్‌ 24 నుంచి ఐఫోన్‌5, ఐఫోన్‌ 5సీ మొబైల్స్‌తో పాటు ios 10, ios 11తో పని చేస్తున్న ఐఫోన్‌లలో వాట్సాప్‌ సేవలను నిలిపివేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా ఫోన్లను ios 12, లేదా ఆపైన వెర్షన్‌కు అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈ ఫోన్ యూజర్లు వెంటనే తమ డివైజ్‌లలో ఐఓఎస్‌ 12ను అప్‌డేట్ చేసుకోవాలని వాట్సాప్‌ సూచించింది. ఐఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి జనరల్‌ సెక్షన్‌లో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌పై క్లిక్ చేసి ఓఎస్‌ను అప్‌గ్రేడ్ చేయొచ్చు. వీటితో పాటు ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 4.1 లేదా అంతకంటే తక్కువ వెర్షర్‌ ఓఎస్‌లు(os) మీద పని చేస్తున్న మొబైల్స్‌లోనూ వాట్సాప్‌ సేవలు ఉండవు. ఈ ఓఎస్‌ తర్వాతి వెర్షన్‌కు యూజర్లు వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. 

Tags:    

Similar News