Whatsapp: ఇక‌పై ఈ ఫోన్స్‌లో వాట్సాప్ ప‌నిచేయ‌దు.. మీ ఫోన్ ఉందేమో చూసుకోండి

Whatsapp: ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రికొన్ని ఫోన్స్‌లో వాట్సాప్ త‌న సేవ‌ల‌ను నిలిపి వేసింది.

Update: 2024-08-11 08:30 GMT

Whatsapp: ఇక‌పై ఈ ఫోన్స్‌లో వాట్సాప్ ప‌నిచేయ‌దు.. మీ ఫోన్ ఉందేమో చూసుకోండి

Whatsapp: ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్కువ మంది ఉప‌యోగిస్తున్న మెసేజింగ్ యాప్ ఏదైనా ఉందంటే అది వాట్సాప్ మాత్ర‌మే. రోజురోజుకీ కొంగొత్త ఫీచ‌ర్ల‌తో యూజ‌ర్ల‌ను అట్రాక్ట్ చేస్తూ వ‌స్తోంది వాట్సాప్‌. ఇలా కొత్త ఫీచ‌ర్ల‌ను అప్‌గ్రేడ్ చేసే స‌మ‌యంలో కొన్ని పాత ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌తో ప‌నిచేసే ఫోన్‌ల‌కు వాట్సాప్ త‌మ సేవ‌ల‌ను నిలిపివేస్తూ వ‌స్తోంది. ఇప్ప‌టికే ప‌లు స్మార్ట్ ఫోన్స్‌లో వాట్సాప్ సేవ‌ల‌ను నిలిపివేసిన విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రికొన్ని ఫోన్స్‌లో వాట్సాప్ త‌న సేవ‌ల‌ను నిలిపి వేసింది. దీంతో ఇక‌పై కొన్ని ఫోన్స్‌లో వాట్సాప్ స‌పోర్ట్ చేయ‌దు. వాట్సాప్ ప్ర‌కారం ఆండ్రాయిడ్ 4 లేదా అంత‌కంటే పాత ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌స్‌తో పాటు, ఐఓఎస్ 11 లేదా అంత కంటే పాత ఆప‌రేటింగ్ సిస్ట‌మ్స్‌, కియా ఓఎస్ 2.4 అంత‌కంటే పాత ఆప‌రేటింగ్ సిస్ట‌మ్స్‌తో ప‌నిచేస్తున్న ఫోన్స్‌లో ఇక‌పై వాట్సాప్ ప‌నిచేయ‌దు. ఇంత‌కీ వాట్సాప్ స‌పోర్ట్ చేయ‌ని ఆ ఫోన్‌ల జాబితా ఏంటో ఇప్పుడు త‌లెఉసుకుందాం..

సామ్‌సంగ్ కంపెనీకి చెంది సామ్‌సంగ్ గ్యాల‌క్సీ ఏస్ ప్ల‌స్‌, గ్యాల‌క్సీ కోర్‌, గ్యాల‌క్సీ ఎక్స్‌ప్రెస్ 2, గ్యాల‌క్సీ గ్రాండ్‌, గ్యాల‌క్సీ నోట్ 3 N9005 LTE, గ్యాల‌క్సీ నోట్ 3 నియో LTE+, గ్యాల‌క్సీ ఎస్‌ 19500, గ్యాల‌క్సీ ఎస్‌3 మినీ వీఈ, గ్యాల‌క్సీ ఎస్‌4 యాక్టివ్‌, గ్యాల‌క్సీ ఎస్4 మినీ I9190, గ్యాల‌క్సీ S4 మినీ I9192 Duos, గ్యాల‌క్సీ ఎస్‌4 మినీ I9195 LTE, గ్యాల‌క్సీ S4 జూమ్ ఫోన్స్‌లో వాట్సాప్ ప‌నిచేయ‌దు.

ఇక యాపిల్ విష‌యానికొస్తే.. యాపిల్ ఐఫోన్ 4, ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్ ప్ల‌స్‌, ఐఫోన్ 6ఎస్‌, ఐఫోన్ ఎస్ఈ ఫోన్‌ల‌లో ఇక‌పై వాట్సాప్ స‌పోర్ట్ చేయ‌దు. వీటితో పాటు హువాయ్ కంపెనీకి చెందిన‌.. హువాయి సీ199, హువాయి జీఎక్స్‌1ఎస్‌, హువాయి వై625, అస్కెండ్ పీ6 ఎస్ ఫోన్‌ల‌లో వాట్సాప్ ప‌నిచేయ‌దు.

Tags:    

Similar News