OTP Scam: OTP స్కామ్ అంటే ఏమిటి.. దీనిని ఎలా నివారించాలి..?

OTP Scam: సైబర్ నేరాల పెరుగుదల కారణంగా వ్యాపారవేత్తలు కస్టమర్ల డేటా పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

Update: 2023-01-02 16:00 GMT

OTP Scam: OTP స్కామ్ అంటే ఏమిటి.. దీనిని ఎలా నివారించాలి..?

OTP Scam: సైబర్ నేరాల పెరుగుదల కారణంగా వ్యాపారవేత్తలు కస్టమర్ల డేటా పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ కంపెనీలు కస్టమర్‌లకు సురక్షితమైన డెలివరీ చేయడానికి వన్ టైమ్ పాస్‌వర్డ్ లేదా OTP విధానాన్ని ప్రవేశపెట్టాయి. అయితే మోసగాళ్లు ఇలాంటి ఓటీపీలని సద్వినియోగం చేసుకుని బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును దొంగిలిస్తున్నారు. మోసపూరిత డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు కస్టమర్‌ల నుంచి OTPలను సేకరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటిని ఏ విధంగా నివారించాలో తెలుసుకుందాం.

OTPని ఎవరితో షేర్‌ చేయకూడదు

OTPని ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. మోసగాళ్లు లావాదేవీలకు సహాయం చేస్తానని, మెరుగైన సేవలను అందిస్తానని చెప్పి ఓటీపీని దొంగిలిస్తారు. అనంతరం బ్యాంకు ఖాతా నుంచి డబ్బుని దొంగిలిస్తారు. అందుకే అలర్ట్‌గా ఉండాలి. డెలివరీని నిర్ధారించే ముందు కస్టమర్‌లు తప్పనిసరిగా డెలివరీ ప్యాకేజీని ఓపెన్‌ చేసుకొని చూసుకోవాలి. సమాచారం కోసం అడిగే ఎలాంటి లింక్‌లు లేదా వెబ్‌సైట్‌లను విశ్వసించవద్దు.

OTP అంటే ఏమిటి?

ఓటీపీ అంటే వన్-టైమ్ పాస్‌వర్డుగా చెబుతారు. ఇది లావాదేవీలు లేదా లాగిన్‌ల కోసం రూపొందించిన సంఖ్యా లేదా ఆల్ఫాన్యూమరిక్ స్ట్రింగ్. ఒక్క మాటలో చెప్పాలంటే OTP అనేది కంప్యూటర్ సిస్టమ్ లేదా ఇతర డిజిటల్ పరికరంలో లాగిన్ సెషన్ లేదా లావాదేవీకి మాత్రమే చెల్లుబాటు అయ్యే ఒక పాస్‌వర్డ్. దీనిని ఎప్పుడు ఎవ్వరితో షేర్‌ చేసుకోకూడదని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News