Vivo Y17s: 50ఎంపీ కెమెరా.. 5000mAh బ్యాటరీతో విడుదలైన వివో వై17ఎస్ స్మార్ట్ ఫోన్.. వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్‌తో అదిరిపోయిందంతే.. ధరెంతంటే?
Vivo Y17s Price in India: Vivo తన నూతన స్మార్ట్‌ఫోన్ Vivo Y17sని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్ రేంజ్ బడ్జెట్‌లో వస్తుంది. కంపెనీ దీనిని రెండు ప్రత్యేకమైన కలర్ ఆప్షన్లలో విడుదల చేసింది.
Vivo Y17s Price in India: Vivo తన నూతన స్మార్ట్‌ఫోన్ Vivo Y17sని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్ రేంజ్ బడ్జెట్‌లో వస్తుంది. కంపెనీ దీనిని రెండు ప్రత్యేకమైన కలర్ ఆప్షన్లలో విడుదల చేసింది. తమ తాజా స్మార్ట్‌ఫోన్ Vivo Y17s గ్రేటర్ నోయిడాలోని తమ ఫెసిలిటీలో తయారు చేసింది.
ఈ ఫోన్ 6.65-అంగుళాల LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్‌తో వస్తుంది. ఇది 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. కంపెనీ ఈ హ్యాండ్‌సెట్‌లో AI పవర్డ్ బ్యాటరీ ప్రొటెక్షన్ ఫీచర్‌ను అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఇతర వివరాలను తెలుసుకుందాం..
Vivo Y17s ధర, లభ్యత..
Vivo ఈ హ్యాండ్‌సెట్‌ను రెండు కాన్ఫిగరేషన్‌లలో విడుదల చేసింది. దీని 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,499. Vivo Y17s 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499లుగా పేర్కొంది. మీరు గ్లిట్టర్ పర్పుల్, ఫారెస్ట్ గ్రీన్‌లో కొనుగోలు చేయవచ్చు.
మీరు ఈ హ్యాండ్‌సెట్‌ను Amazon, Flipkart, Vivo ఆన్‌లైన్ స్టోర్, Vivo ఆఫ్‌లైన్ రిటైల్ భాగస్వాముల నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ అక్టోబర్ 2 నుంచి అందుబాటులోకి వచ్చింది.
స్పెసిఫికేషన్స్ ఏమిటి?
Vivo Y17s 6.56-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్, HD రిజల్యూషన్‌తో వస్తుంది. స్క్రీన్ బ్రైట్‌నెస్ 700నిట్స్. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Helio G85 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఇది 4GB RAM, 128GB వరకు నిల్వ ఎంపికను కలిగి ఉంది. మైక్రో SD కార్డ్ సహాయంతో నిల్వను విస్తరించవచ్చు.
పరికరం డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ సెన్సార్ ఉన్నాయి. కంపెనీ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరాను అందించింది. 5000mAh బ్యాటరీ అందించింది. ఇది 15W వైర్డు ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించింది.