హోండా యాక్టివాకి పెద్ద ముప్పు.. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌కి పెరిగిన డిమాండ్‌..!

ప్రస్తుతం హోండా యాక్టివా ప్రతి నెలా 1.50 లక్షల యూనిట్ల అమ్మకాలతో భారతదేశంలో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంది.

Update: 2023-02-20 08:32 GMT

హోండా యాక్టివాకి పెద్ద ముప్పు.. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌కి పెరిగిన డిమాండ్‌..!

TVS iQube Electric Scooter: ప్రస్తుతం హోండా యాక్టివా ప్రతి నెలా 1.50 లక్షల యూనిట్ల అమ్మకాలతో భారతదేశంలో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు భారత మార్కెట్లో పెట్రోల్ స్కూటర్లకు గట్టి పోటీని ఇస్తున్నాయి. తాజాగా ఓలాకే కాకుండా హోండా యాక్టివాకు కూడా కాంపిటీషన్‌గా పరిణమించే ఎలక్ట్రిక్ స్కూటర్ తెరపైకి వచ్చింది. జనవరిలో దేశం మొత్తం 64,203 ఎలక్ట్రిక్ స్కూటర్లు విక్రయించారు. ఇందులో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు అధికంగా అమ్ముడయ్యాయి.

టీవీఎస్‌ కంపెనీకి చెందిన టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విపరీతంగా అమ్ముడుపోయింది. ఒక్క జనవరిలోనే 12,169 యూనిట్లను విక్రయించింది. TVS iQube ఇప్పుడు 100కి పైగా నగరాల్లో, 200కి పైగా టచ్‌పాయింట్‌లలో అందుబాటులోకి వచ్చింది. వరుసగా మూడో నెలలో 10,000 యూనిట్లకు పైగా విక్రయించారు. TVS ఏప్రిల్, డిసెంబర్ 2022 మధ్యకాలంలో 53,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. iQube గొప్ప డిజైన్, ఫీచర్లు వినియోగదారులకి బాగా నచ్చుతున్నాయి.

TVS iQube స్టాండర్డ్, S, ST అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. స్టాండర్డ్, S వేరియంట్‌లు 3.04 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ని పొందుతాయి. అదే సమయంలో ST వేరియంట్‌లో 4.56 kWh పెద్ద బ్యాటరీ పొందుతుంది. స్టాండర్డ్, S, ST మోడల్‌లు ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 100 కిమీ, 100 కిమీ, 145 కిమీల పరిధిని అందిస్తాయి. స్టాండర్డ్, S వేరియంట్‌లు వరుసగా రూ.99,130 , రూ.1.04 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. అయితే ST వేరియంట్ ఇంకా ధర వెల్లడించలేదు. కంపెనీ ఇప్పటికీ అమ్మకాలలో ఓలా ఎలక్ట్రిక్ కంటే వెనుకబడి ఉంది. అయితే TVS iQube నెమ్మదిగా మార్కెట్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది.

Tags:    

Similar News