Youtube: యూట్యూబ్‌లో ఎక్కువగా ఏ వీడియోలు చూస్తున్నారో తెలుసా.?
Youtube: యూట్యూబ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Youtube: యూట్యూబ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ దానికి యూట్యూబ్‌లో సెర్చ్ చేసే రోజులు వచ్చేశాయ్. యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా లక్షల్లో డబ్బులు ఆర్జిస్తున్న వారు కూడా ఉన్నారు. అయితే యూట్యూబ్‌లో ఎక్కువ మంది ఎలాంటి వీడియోలు వీక్షిస్తున్నారో ఎప్పుడైనా ఆలోచించారా.? దీనికి సంబంధించి యూట్యూబ్ ఇటీవల ఓ జాబితాను విడుదల చేసింది.
ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్న వారిలో మ్యూజిక్ వీడియోలు మొదటి స్థానంలో ఉన్నాయి. యూజర్లు కొత్త పాటలతో పాటు పాత పాటలను ఎక్కువగా చూస్తున్నారు. ఇక రెండో స్థానంలో గేమింగ్ వీడియోలు ఉన్నాయి. యూజర్లు గేమ్‌ప్లే, ట్యుటోరియల్‌లు, ఇ స్పోర్ట్స్ ఈవెంట్‌లను చూడడానికి ఎక్కువగా ఆసక్తికనబరుస్తున్నారు.
ఇక ఎక్కువ మంది వీక్షిస్తున్న వీడియోల జాబితాలో (డీఐవై) డూ ఇట్ యూవర్ సెల్ఫ్ సంబంధిత వీడియోలు మూడో స్థానంలో ఉన్నాయి. ఇందులో భాగంగా యూజర్లు ఎక్కువగా రిపేర్‌లు, చేతి పనులు, ఆర్ట్స్‌కి సంబంధించిన వీడియోలను చూస్తున్నారు. ఇక 4వ స్థానంలో కామెడీ వీడియోలు ఉన్నాయి. ఇందులో భాగంగా స్టాండప్ కామెడీ, స్కెచ్ కామెడీని చూడటానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. వ్లాగ్ వీడియోలు ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నాయి.
ఇందులో భాగంగా నెటిజన్లు రోజువారీ జీవితానికి సంబంధించిన వీడియోలను వీక్షిస్తున్నారు. ఇవి కాకుండా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, చరిత్రకు సంబంధించిన వీడియోలు, పిల్లలకు సంబంధించిన కంటెంట్, ఫ్యాషన్, ట్రెండ్‌లకు సంబంధించిన వీడియోలను ఎక్కువగా చూసేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు.