Smartphone: మీ ఫోన్‌లో ఈ మార్పులు కనిపిస్తే.. పేలే ప్రమాదం ఉన్నట్లు అర్థం చేసుకోవాలి
Smartphone: అయితే ఫోన్‌ను ఉపయోగించే క్రమంలో కొన్ని రకాల సమస్యలు ఎదురవుతుంటాయి.
Smartphone: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ వినియోగం అనివార్యంగా మారింది. అన్ని రకాల పనులకు స్మార్ట్‌ఫోన్ ఉండాల్సిందే. అయితే ఫోన్‌ను ఉపయోగించే క్రమంలో కొన్ని రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటి వాటిలో బ్యాటరీ ఒకటి. స్మార్ట్‌ఫోన్‌లు పేలిన సంఘటనలు ఎన్నో చూసి ఉంటాం. ఇంతకీ స్మార్ట్‌ఫోన్‌లు ఎందుకు పేలుతున్నాయి.? ఫోన్ పేలడానికి ముందు కనిపించే లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఉబ్బినట్లు కనిపిస్తే ఫోన్‌లో ఏదో సమస్య ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. ఇలా అసాధరణంగా ఫోన్ బ్యాటరీ ఉబ్బితోఫోన్ పేలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు భావించాలి. బ్యాటరీ ఉబ్బితే వెంటనే మార్చేయాలని సూచిస్తున్నారు.
* మీ ఫోన్ తరచుగా వేడెక్కుతున్నట్లయితే, బ్యాటరీతోపాటు ఫోన్‌లోని ఇతర భాగాల్లో సమస్యకు సంకేతంగా చెప్పొచ్చు. కొన్ని సందర్భాల్లో ఫోన్ వేడెక్కడం వల్ల బ్యాటరీలో వేడెక్కడం లేదా షార్ట్ సర్క్యూట్‌కు కారణమవుతుంది. ఇది ఫోన్ మంటలు లేదా పేలిపోయే అవకాశాన్ని పెంచుతుంది. అలాంటి సందర్భాలలో, ఫోన్‌ను వెంటనే సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాలి.
* ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఫోన్‌ను ఛార్జ్ చేయడం కూడా ఫోన్ పేలడానికి కారణంగా చెప్పొచ్చు. మనలో చాలా మంది టీవీలు, ల్యాప్‌టాప్‌ల వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు సమీపంలో ఫోన్‌లను ఛార్జింగ్ చేస్తుంటారు. దీనివల్ల ఫోన్ వేడెక్కే అవకాశం ఎక్కువుతుంది. కాబట్టి ఫోన్ ఛార్జింగ్ చేసే సమయంలో చల్లటి ప్రదేశంలోనే ఉండేలా చూసుకోవాలి.
* మనలో చాలా మంది ఫోన్‌ను నీటిలో తడిచిన తర్వాత అలాగే ఉపయోగిస్తుంటారు. ఫోన్‌లోకి కొన్ని నీళ్లు వెళ్తే ఫోన్ ఎలాంటి రిపేర్ అవసరం లేకుండానే పనిచేస్తుంది. అయితే నీటిలో పడిన తర్వాత ఫోన్‌ను ఉపయోగించే సమయంలో ఛార్జింగ్ చేస్తే ఫోన్‌లో షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల కూడా ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది.
smartphone tips,summer,tech tips, Smartphone, battery, mobile, blast, blast mobile, fire in mobile, smartphone getting hot, Technology