Microsoft: మైక్రోసాఫ్ట్‌ సమస్యపై స్పందించిన సత్య నాదెళ్ల.. ఏమన్నారంటే..?

Microsoft: మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో తలెత్తిన సాంకేతక సమస్య ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.

Update: 2024-07-20 05:51 GMT

Microsoft: మైక్రోసాఫ్ట్‌ సమస్యపై స్పందించిన సత్య నాదెళ్ల.. ఏమన్నారంటే..?

Microsoft: మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో తలెత్తిన సాంకేతక సమస్య ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ కారణంగా భారత్‌ సహా ప్రపంచంలోని చాలా దేశాల్లో పలు రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. బ్యాంకింగ్ మొదలు విమానాయన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ప్రయాణికులకు మ్యానువల్‌ టికెట్స్‌ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్‌ ఆఫ్‌ డెత్‌ ఎర్రర్‌ కనిపించడంతో సిస్టమ్‌లు షట్‌డౌన్‌ / రీస్టార్ట్‌ అయ్యాయి.

అయితే ఈ సమస్యను గుర్తించిన మైక్రోసాఫ్ట్‌ పరిష్కారానికి వేగంగా స్పందించారు. క్రౌడ్‌ స్ట్రైక్‌ అప్‌డేట్‌ చేయడం వల్ల ఈ సమస్య వచ్చినట్లు మైక్రోసాఫ్ట్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమస్యపై సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల స్పందించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. క్రౌడ్ స్ట్రైక్‌ విడుదల చేసిన అప్‌డేట్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లలో సాంకేతిక సమస్య తలెత్తింది. సమస్యను గుర్తించాం. దీనికి సంబంధించి క్రౌడ్ స్ట్రైక్‌తో కలిసి పనిచేస్తున్నాం. కస్టమర్లకు అవసరమైన సాంకేతిక సహాయం, మద్దతు సమకూర్చేలా, సిస్టమ్‌లను సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చారు.

అయితే మొదట్లో హ్యాకింగ్ కారణంగానే ఇలా జరిగిందంటూ సోషల్‌ మీడియాలో కొంతమేర చర్చ జరిగింది. అయితే కంపెనీ అలాంటిది ఏం లేదని. అప్‌డేట్‌లో భాగంగా తలెత్తిన చిన్న సాంకేతిక సమస్య అని తెలిపారు. జీవితంలో తొలి సారి పెన్నుతో రాసిన ఫ్లైట్‌ టికెట్‌ను పొందామని కొందరు నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే మైక్రోసాఫ్ట్‌లో ఇలాంటి సమస్య 1999లో ఓసారి తలెత్తింది. ఇక ఈ సమస్యపై ఎలాన్‌ మస్క్‌ మాట్లాడుతూ.. ఆటోమోటివ్ సరఫరా గొలుసును దిగ్బంధించిందంటూ వ్యాఖ్యానించారు.

అమెరికాలో ఎగరని విమానాలు...

ఇదిలా ఉంటే మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో తలెత్తిన సమస్య కారణంగా అమెరికాలో విమానం ఎగరని పరిస్థితి నెలకొంది. నిత్యం విమానాలతో బిజీబిజీగా ఉండే విమానాశ్రయాలు మూగబోయాయి. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌,డెల్టా,యునైటెడ్‌ సంస్థల విమానాలు ఎక్కడికక్కడే ఎయిర్‌పోర్టుల్లో నిలిచిపోయాయి. అలాగే ఆకాశంలో నిత్యం రద్దీగా తిరిగే విమానాల సంఖ్య కూడా ఒక్కసారిగా తగ్గిపోయింది.

Tags:    

Similar News