Samsung Galaxy F22: అన్ని ఫీచర్స్ తో అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్
Samsung Galaxy F22: సామ్ సంగ్... ఎలక్ట్రానిక్ & స్మార్ట్ అప్లికేన్స్ తో దేశీయ మార్కెట్ లో ముందుండే ఈ సంస్థ
Samsung Galaxy F22: సామ్ సంగ్... ఎలక్ట్రానిక్ & స్మార్ట్ అప్లికేన్స్ తో దేశీయ మార్కెట్ లో ముందుండే ఈ సంస్థ తాజాగా మరో సరికొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ ను వినియోగదారులకి అందుబాటులోకి తీసుకొచ్చింది. "సామ్ సాంగ్ గెలాక్సీ ఎఫ్ 22" మోడల్ ఫోన్ అతి తక్కువ ధరతో పాటు వినియోగదారుడికి కావలసిన అన్ని ఫీచర్స్ తో మార్కెట్లో విడుదల చేసింది. ఈ సేల్ ని జూలై 13 2021 సామ్ సంగ్ అధికారిక వెబ్ సైట్ మరియు ఫ్లిప్ కార్ట్ సంయుక్తంగా ద్వారా ఆన్లైన్ లో అమ్మకాలు చేయనున్నారు. మొదటి సేల్ లో భాగంగా జూలై 13న మధ్యాహ్నం 12 గంటలకి ఈ సేల్ నూ ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు మార్కెట్లోకి వచ్చిన మొబైల్ ఫోన్స్ తో పోలిస్తే సామాన్యుడు కూడా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న "సామ్ సాంగ్ గెలాక్సీ ఎఫ్ 22" యొక్క వివరాలు తెలుసుకుందాం.
మొదటగా "సామ్ సాంగ్ గెలాక్సీ ఎఫ్ 22" స్మార్ట్ ఫోన్ లో 15 వాట్ ఛార్జింగ్ పోర్ట్ తో 6,000 ఎంఎచ్ అతిపెద్ద బ్యాటరీ కెపాసిటీతో పాటు 6.4 ఇంచ్ ఎచ్ డి స్క్రీన్ ఉండనుంది. మీడియా టెక్ హేలియో జీ80 ప్రాసెసర్ తో పాటు ఫ్రంట్ కెమెరా 13 మెగా పిక్సెల్, బ్యాక్ కెమెరా 48 మెగా పిక్సెల్ సెన్సార్ తో కస్టమర్లను ఆకర్షిస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ తో విడుదల అయిన ఈ ఫోన్ లో 64 జీబీ ఇంటర్నల్ మెమరీతో పాటు 4 జీబీ ర్యామ్ తో సూపర్ ఫాస్ట్ గా పనిచేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటు 1000 జీబీ వరకు మెమొరీ కార్డ్ సపోర్ట్ చేయనుంది. భారత మార్కెట్లో సామ్ సాంగ్ గెలాక్సీ ఎఫ్ 22 ధర 12,499గా నిర్ణయించారు