Galaxy z fold 6: సామ్‌సంగ్ నుంచి కొత్త ఫోన్.. ధర అక్షరాల రూ. లక్షన్నర..
Galaxy z fold 6: సామ్‌సంగ్ నుంచి కొత్త ఫోన్.. ధర అక్షరాల రూ. లక్షన్నర..
Galaxy z fold 6: సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామసంగ్ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. గ్యాలక్స్ జెడ్ ఫోల్డ్ 6 పేరుతో కొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేసింది. పారిస్‌లో జరిగిన సామ్‌సంగ్ గ్యాలక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్లో ఈ ఫోన్‌ను విడుదల చేశారు. ఈ ఫోన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన ఫీచర్లను అందించారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
గ్యాలక్స్ జెడ్ ఫోల్డ్ 6లో 7.6 ఇంచెస్ QXGA+ ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్‌ప్లే, డైనమిక్ AMOlED 2X ప్యానెల్, 2160 x 1856 పిక్సెల్ రిజల్యూషన్ మరియు 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన మెయిన్ స్క్రీన్‌ను ఇచ్చారు. ఇక 6.3 ఇంచెస్‌తో కూడిన కవర్ డిస్‌ప్లేను ఇచ్చారు. హెచ్‌డీప్లస్ డైనమిక్ అమోఎల్‌ఈడీ 2 ఎక్స్ ప్యానెల్, 120 హెచ్‌జెడ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఇక ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 7 ఏళ్లపాటు అప్‌డేట్‌లను అందించనున్నారు. ఈ ఫోన్‌ను మొత్తం మూడు వేరియంట్స్‌లో తీసుకొస్తున్నారు. వీటిలో 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ 512 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్.. 1 టీబీ స్టోరేజ్‌ను ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే 50 ఎంపీ, 12 ఎంపీ, 10 ఎంపీతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 10 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమరాను.. అలాగే అండర్ డిస్‌ప్లేలో 4 ఎంపీ కెమెరాను అందించారు.
ఇక ఈ ఫోన్‌లో 25 వాట్స్ ఫాస్ట ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4400 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ ఫోన వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో 5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ 5.3 వంటి ఫీచర్లను అందించారు. ధర విషయానికొస్తే ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ రూ. 1.58 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.