Samsung Grand Republic Sale: శామ్‌సంగ్ గ్రాండ్ రిపబ్లిక్ సేల్.. సగం ధరకే స్మార్ట్‌ఫోన్‌లు భారీ డిస్కౌంట్లు..!
Samsung Grand Republic Sale: శామ్‌సంగ్ గ్రాండ్ రిపబ్లిక్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, గృహోపకరణాలపై భారీ తగ్గింపు ప్రకటించింది.
Samsung Grand Republic Sale: శామ్‌సంగ్ గ్రాండ్ రిపబ్లిక్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, గృహోపకరణాలపై భారీ తగ్గింపు ప్రకటించింది. గెలక్సీ స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, శామ్‌సంగ్ టీవీలతో సహా అనేక రకాల ఉత్పత్తులపై భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ సేల్ Samsung.com, Samsungలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రత్యేకమైన దుకాణాలు, శామ్‌సంగ్ షాప్ అప్లికేషన్‌లో జనవరి 21 వరకు కొనసాగుతుంది.
శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్లు
సేల్ సమయంలో శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. Galaxy Z Fold 4, Galaxy S21 FE, Galaxy S20 FE, Galaxy M33 వంటి ఫోన్‌లపై 61 శాతం తగ్గింపు లభిస్తుంది. అంటే సగం కంటే తక్కువ ధరకే ఫోన్ లభ్యం కానుంది. వినియోగదారులు Galaxy Z Fold 4ని కొనుగోలు చేస్తే వారు Galaxy Watch 4 Classicని కేవలం రూ.2,999కే పొందుతారు. అదే డీల్ Galaxy Z Flip 4కి కూడా వర్తిస్తుంది. Galaxy A73 కొనుగోలుపై Galaxy Buds 2ని రూ.1,999కి కొనుగోలు చేయవచ్చు.
టీవీలపై తగ్గింపులు
ల్యాప్‌టాప్‌లపై 38 శాతం తగ్గింపు లభిస్తుంది. ఇది మాత్రమే కాదు టాబ్లెట్లు, వాచీలపై 63% తగ్గింపు లభిస్తుంది. సేల్‌లో Galaxy Tab S8ని కొనుగోలు చేస్తే ఆ బుక్ కవర్ రూ.999కి మాత్రమే లభిస్తుంది. Samsung TVపై 56 శాతం తగ్గింపు లభిస్తుంది. Neo QLED, QLED, Frame, UHD TV మోడల్‌లను కొనుగోలు చేస్తే Galaxy A23 స్మార్ట్‌ఫోన్ లేదా HW-S801B సౌండ్‌బార్‌ను ఉచితంగా పొందుతారు. దీని ధర సుమారు రూ.40,000.
Neo QLED 8Kని కొనుగోలు చేస్తే Galaxy Z Fold 4ని ఉచితంగా పొందుతారు. శాంసంగ్ రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్‌లు, ఎయిర్ కండీషనర్ల కొనుగోలుపై 42 శాతం తగ్గింపు లభిస్తుంది. సేల్‌లో చాలా బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. ICICI బ్యాంక్ డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లతో Samsung TVలు, డిజిటల్ పరికరాలపై 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.