Samsung Galaxy A52: త్వరలో శాంసంగ్ గెలాక్సీ ఏ52 5జీ లాంచ్; లీకైన ఫీచర్లు

Samsung Galaxy A52: శాంసంగ్ గెలాక్సీ ఏ52 4జీ వెర్షన్ కంటే ధర కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Update: 2021-05-05 13:53 GMT

Samsung A52 5G

Samsung Galaxy A52: శాంసంగ్ ఇండియాలో త్వరలోనే తన నూతన ఫోన్ గెలాక్సీ ఏ52 ను విడుదల చేసేందుకు రెడీ అయింది. శాంసంగ్ గెలాక్సీ ఏ52, గెలాక్సీ ఏ52 5జీ, గెలాక్సీ ఏ72 స్మార్ట్ ఫోన్లు మార్చిలోనే గ్లోబల్ గా విడుదల అయ్యాయి. వీటిలో శాంసంగ్ గెలాక్సీ ఏ52, శాంసంగ్ గెలాక్సీ ఏ72 ఫోన్లు ఇప్పటికే మనదేశంలోనూ లభిస్తున్నాయి. గెలాక్సీ ఏ52 5జీ మాత్రం ఇంతవరకు రిలీజ్ కాలేదు. అయితే విడుదల తేదీ ఎప్పుడన్నది ఇంకా తెలియరాలేదు.

శాంసంగ్ గెలాక్సీ ఏ52 4జీ వెర్షన్ కంటే ధర కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. డిస్ ప్లే, ప్రాసెసర్, కనెక్టివిటీ లాంటి అంశాల్లో ఈ ఫోన్ అప్ గ్రేడ్ అయింది. శాంసంగ్ గెలాక్సీ ఏ52 4జీ వెర్షన్ మనదేశంలో రూ.26,499 ధరతో లాంచ్ అయింది. దీంతీ గెలాక్సీ ఏ52 రూ.30 వేలపైన ఉండే అవకాశం ఉంది.

ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్లో అసమ్ బ్లాక్, అసమ్ బ్లాక్ వయొలెట్, అసమ్ వైట్ రంగుల్లో విడుదల కాగా, మనదేశంలోనే ఇవే రంగుల్లో లభించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ ఇన్‌ఫినిటీ-ఓ డిస్ ప్లేతోపాటు రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ వర్క్ చేస్తుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది. స్టోరేజ్ ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.

ఇందులో బ్యాక్ సైడ్ 4 కెమెరాలు అందించారు. వీటిలో మెయిన్ కెమెరా సామర్థ్యం 64 MPగా ఉంది. దీంతోపాటు 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 MP డెప్త్ సెన్సార్, 5 MP మాక్రో సెన్సార్ లు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 MP కెమెరాను అందించారు.

ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనున్న ఈ ఫోన్.. 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీతో రానుంది. 25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లతో అలరించనుంది.

Tags:    

Similar News